India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పార్టీ మారిన MLAల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రతివాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘MLAలు పార్టీ మారి ఇప్పటికే వార్షికోత్సవం పూర్తైంది. రీజనబుల్ టైమ్ అంటే వారి పదవీకాలం పూర్తయ్యేవరకా? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోతే పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేసినట్లే. ఆలస్యం చేసే ఎత్తుగడలు వేయొద్దు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలి’ అని ప్రభుత్వ తరఫు లాయర్‌ను ఆదేశించింది.

NJACపై మళ్లీ నిర్ణయం తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కాలిపోవడం తెలిసిందే. కొలీజియం ఆయన్ను అక్కడి నుంచి తమ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని బార్ వ్యతిరేకిస్తోంది. నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించింది. జడ్జిల నియామకం కోసం GOVT ఏర్పాటు చేయాలనుకున్న కమిషనే NJAC.

అత్యంత వైభవంగా జరిగే శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబవుతోంది. ఏప్రిల్ 6న జరిగే శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ వీక్షించేలా నగరం మెుత్తం భారీ LED స్క్రీన్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఆశ్రమాలలో వసతి సౌకర్యం కల్పించనున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని దేశవ్యాప్తంగా తిలకించేలా లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్, US అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం మరింత పెరుగుతోంది. ఈ నెల మొదట్లో ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కోఫ్‌కు భేటీ అనంతరం ట్రంప్ చిత్రపటాన్ని పుతిన్ ఆయనకు ఇచ్చారని మాస్కో ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. ఆ బహుమతి పట్ల ట్రంప్ చాలా సంతోషించారని విట్కోఫ్ తాజాగా వెల్లడించారు. ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే అమెరికా, రష్యా బంధం ట్రంప్ వచ్చాక మెరుగుపడుతున్న సంగతి తెలిసిందే.

‘ఐ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమీ జాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అతడికి ‘ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్‌విక్’ అని పేరు పెట్టారు. తన భర్త-బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్, కొడుకుతో కలిసి దిగిన ఫొటోలను ఆమె SMలో పంచుకున్నారు. 2022 నుంచి వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేసిన అమీ గతేడాది పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు మాజీ భర్త జార్జ్‌తో ఆమె ఓ కొడుకును కన్నారు. 2021లో అమీ, జార్జ్ విడిపోయారు.

ఐపీఎల్ అరంగేట్రంలోనే విప్రాజ్ నిగమ్ సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఢిల్లీ 113 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నిగమ్ 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు బాది సమీకరణాలు మార్చేశారు. LSGపై DC సంచలన విజయంలో అశుతోశ్ శర్మకు ఎంత క్రెడిట్ ఉందో 20 ఏళ్ల నిగమ్‌కూ అంతే ఉంది. అందరూ అశుతోశ్‌ను పొగుడుతున్నారు కానీ నిగమ్‌ను మాత్రం మరిచిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా రూ.2000+ కోట్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చేసేందుకు తాను మొదట్లో ఇష్టపడలేదని ఆమిర్ వెల్లడించారు. ‘నా కెరీర్‌ను ముగించడానికే సల్మాన్ & షారుఖ్‌లు ఈ స్క్రిప్ట్‌తో డైరెక్టర్‌ను నా దగ్గరకు పంపించారేమోనని భావించా’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చమత్కరించారు.

బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూనస్ పట్ల బంగ్లా సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, 8మంది మేజర్ జనరల్స్, కమాండర్స్, కీలక అధికారులతో ఆర్మీ చీఫ్ వకెర్-ఉజ్-జమాన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించడంతో తిరుగుబాటు వార్తలు ఊపందుకున్నాయి.

IPL 2025లో జట్లు మారిన ఆటగాళ్లు చెలరేగుతున్నారు. ఇప్పటివరకు 4 మ్యాచులు జరగ్గా అన్నిట్లోనూ ఫ్రాంచైజీలు మారిన ఆటగాళ్లే POTMగా నిలిచారు. వీరిలో కృనాల్ పాండ్య (RCB), ఇషాన్ కిషన్ (SRH), నూర్ అహ్మద్ (CSK), అశుతోశ్ శర్మ (DC) ఉన్నారు. గత సీజన్‌లో వీరు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సీజన్‌లో జట్టు మారగానే విధ్వంసం సృష్టిస్తున్నారు. స్టార్ ప్లేయర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నారు.

TG: BRS MLA పాడి కౌశిక్ వేసిన పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై SCలో విచారణ మొదలైంది. కౌశిక్ తరఫున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. ‘ముగ్గురు MLAలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా అసెంబ్లీ స్పీకర్ పట్టించుకోలేదు. సుప్రీం జోక్యం చేసుకున్న తర్వాతే నోటీసు ఇచ్చారు. వాటిపై ఎమ్మెల్యేలు వారంలో సమాధానం ఇవ్వాలి. కానీ ఇప్పటికి 3 వారాలైనా వారు స్పందించడంలేదు’ అని జడ్జి జస్టిస్ గవాయ్ దృష్టికి తీసుకెళ్లారు.
Sorry, no posts matched your criteria.