News March 25, 2025

ఈ IPL సీజన్‌లో వారిదే హవా..!

image

IPL 2025లో జట్లు మారిన ఆటగాళ్లు చెలరేగుతున్నారు. ఇప్పటివరకు 4 మ్యాచులు జరగ్గా అన్నిట్లోనూ ఫ్రాంచైజీలు మారిన ఆటగాళ్లే POTMగా నిలిచారు. వీరిలో కృనాల్ పాండ్య (RCB), ఇషాన్ కిషన్ (SRH), నూర్ అహ్మద్ (CSK), అశుతోశ్ శర్మ (DC) ఉన్నారు. గత సీజన్‌లో వీరు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సీజన్‌లో జట్టు మారగానే విధ్వంసం సృష్టిస్తున్నారు. స్టార్ ప్లేయర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నారు.

Similar News

News April 24, 2025

రేపు ఆకాశం ‘నవ్వుతుంది’

image

ఆనందానికి చిహ్నమైన స్మైలీ ఫేస్ రేపు తెల్లవారుజామున ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. 5.30 గంటలకు శుక్రుడు, శని గ్రహాలు నెలవంకకు అతి చేరువగా రానున్నాయి. శుక్రుడు, శని 2 కళ్లుగా, నెలవంక నవ్వుతున్నట్లుగా కనిపించనుంది. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా తెలిపింది. మన కళ్లతో నేరుగా దీన్ని చూడొచ్చని, టెలిస్కోప్, బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని వెల్లడించింది.

News April 24, 2025

పీఓకేలో 42 ఉగ్ర లాంచ్ ప్యాడ్స్!

image

ఆక్రమిత కశ్మీర్‌లో 42 లాంచ్ ప్యాడ్‌లను పాక్ సిద్ధం చేసినట్లు భారత భద్రతా బలగాలు గుర్తించాయి. 130మంది ఉగ్రవాదులు పైనుంచి ఆదేశాలు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో చొరబడి విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే నుంచి 60మంది ఉగ్రవాదులు, స్థానిక టెర్రరిస్టులు 17మంది కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి.

News April 24, 2025

ఇది భారత్‌పై దాడి: ప్రధాని మోదీ

image

పహల్‌గామ్‌లో పర్యాటకులపై దాడిని భారత్‌పై దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని మోదీ గుర్తు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆప్తులను కోల్పోయినవారికి న్యాయం చేయడానికి అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.

error: Content is protected !!