India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనూప్ అనే వ్యక్తితో తన భార్య దివ్య అక్రమ సంబంధం పెట్టుకుందని రిప్లింగ్ కంపెనీ కో-ఫౌండర్, TNకు చెందిన ప్రసన్న శంకర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వారి చాట్ స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. అందులో ఆమె ‘కండోమ్’ గురించి ప్రస్తావించిందని ప్రసన్న తెలిపారు. మరోవైపు భర్త తనను వేధిస్తున్నాడంటూ దివ్య ఫిర్యాదు చేయడంతో ప్రసన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరికి పదేళ్ల కిందట పెళ్లి కాగా ఓ కొడుకు ఉన్నాడు.

అశుతోశ్ గత ఏడాది పంజాబ్‌కు ఫినిషర్‌గా గేమ్స్ గెలిపించాడు. అతడి IPL స్ట్రైక్ రేట్ 167.26 కాగా సగటు 27. లీగ్‌లో భారత ఫినిషర్ దొరకడమే అరుదు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వేలంలో కేవలం ₹3.80 కోట్లకే దక్కించుకుంటుంటే ఇతర జట్లు చోద్యం చూశాయి. నిన్న 7 రన్స్‌కే 3వికెట్లు కోల్పోయిన DCని అశుతోశ్ ఒంటిచేత్తో ఒడ్డుకు చేర్చాడు. ముందు సీజన్లో ఆల్రెడీ తనను తాను నిరూపించుకున్న అతడిపై జట్లు ఎందుకు ఆసక్తి చూపలేదో మరి!

కొంతమంది రూ.లక్షలు ఖర్చుపెట్టి మరీ తనను ట్రోల్ చేయిస్తున్నారని హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. ‘నాపై ట్రోలింగ్ చేస్తున్న మీమ్ పేజీలను కాంటాక్ట్ చేయమని మా టీమ్‌కు చెప్పాను. ఈ పని చేసేందుకు తమకు రూ. లక్షలు ఇస్తున్నారని మా టీమ్‌తో మీమర్స్ చెప్పారు. ట్రోలింగ్ ఆపాలంటే నేను కూడా అంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు’ అని పేర్కొన్నారు. తెలుగులో ఆమె చివరిగా ఎఫ్-3లో స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.

ఉగాది సందర్భంగా రిలీజయ్యే కొత్త సినిమాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నార్నె నితిన్, సంతోష్ శోభన్ కాంబోలో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’, నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలపై రూ.75 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. పెరిగిన ధరలు 7 రోజుల పాటు అందుబాటులో ఉంటాయంది. TGలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

AP: కడప(D) వల్లూరు సెంటర్‌లో నిన్న గణిత పరీక్ష సమయంలో పేపర్ లీక్ అయిందని DEO షంషుద్దీన్ తెలిపారు. వాటర్ బాయ్‌గా పనిచేసే సాయి మహేశ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డికి వాట్సాప్ చేసినట్లు గుర్తించారు. విచారణ అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. 2 రోజుల క్రితం TGలోని నకిరేకల్‌లోనూ టెన్త్ పేపర్ లీకైంది.

హర్ష్, మృణు అనే జంట 1960లో పారిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరి మతాలు వేరవడంతో అప్పట్లో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అయితే అప్పుడు అనాథలుగా పెళ్లి చేసుకున్న వీరికి ఇప్పుడు మరిచిపోలేని జ్ఞాపకాలను అందించాలని పిల్లలు, మనవళ్లు నిర్ణయించారు. 64 ఏళ్ల తర్వాత వీరికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి ఫొటోలు వైరలవుతున్నాయి. చూడ ముచ్చటైన జంట అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

లుకేమియా కారణంగా <<15878066>>చనిపోయిన<<>> కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేని ఆస్పత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘పవన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌కి తరచుగా వచ్చేవాడు. ఆయన ఎంతో చురుగ్గా ఉండేవారు. నా ఫేవరెట్ స్టూడెంట్. కళ్యాణ్ కుమార్‌గా ఉన్న అతడికి పవన్ అనే పేరు పెట్టాను. నేను చనిపోయాక మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌ను అభివృద్ధి చేయాలి’ అని ఆయన కోరారు.

న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చింది. ఇవాళ ఉదయం 7.13 గంటలకు పశ్చిమ తీరంలోని సౌత్ ఐలాండ్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీలో 52 మండలాల్లో వడగాలులు వీయనుండగా, మరోవైపు పలుచోట్ల అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకూ ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరగొచ్చని అంచనా వేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే చోట దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దీనివల్ల ఉద్యోగార్థుల సమయం ఆదా అవటంతో పాటు సులభంగా అప్లై చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగాల రిక్రూట్ మెంట్ సగటు కాల వ్యవధిని 15 నెలల నుంచి 8నెలలకు తగ్గించామని వెల్లడించారు. మిషన్ కర్మయోగి పథకంలో ఇప్పటివరకు 89లక్షల ఉద్యోగులు చేరారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.