India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో మరో మృతదేహం లభ్యమయింది. కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. నెల రోజుల క్రితం టన్నెల్‌లో 8 మంది చిక్కుకోగా ఇటీవల ఓ ఇంజినీర్ డెడ్‌బాడీని వెలికితీశారు.

TG: పదో తరగతి ప్రశ్నాపత్రం <<15867946>>లీకేజీ<<>> కేసులో తనను అన్యాయంగా డీబార్ చేశారని నకిరేకల్‌కు చెందిన విద్యార్థిని ఝాన్సీరాణి ఆవేదన వ్యక్తం చేసింది. తాను పరీక్ష రాస్తుండగా కిటికీ వద్దకు వచ్చిన కొందరు బెదిరించి పేపర్ ఫొటో తీసుకున్నారని వాపోయింది. తనపై డీబార్ ఎత్తివేసి మళ్లీ పరీక్ష రాయనివ్వాలని కోరింది. లేదంటే ఆత్మహత్యే దిక్కని కన్నీళ్లు పెట్టుకుంది. అటు ఈ కేసులో ఓ మైనర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా విడుదలై మూడేళ్లవుతోంది. సరిగ్గా ఇదేరోజున 2022లో ఈ చిత్రం రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. ‘మూడేళ్ల క్రితం విడుదలైన RRR సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. నాటు నాటు పాటకు హీరోలు వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల కేరింతలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి’ అని మేకర్స్ ట్వీట్ చేశారు.

తమ దేశంలో వచ్చే నెల 28న జరిగే ఎన్నికల్లో భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ జోక్యం చేసుకునేందుకు యత్నించనున్నాయని కెనడా నిఘా సంస్థ CSIS డిప్యూటీ డైరెక్టర్ వానెసా లాయిడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘AIని వాడుకుని చైనా ఈ చర్యకు పాల్పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. భారత్‌కు కూడా ఎన్నికల్ని ప్రభావితం చేయాలన్న ఉద్దేశాలున్నట్లు మా దృష్టికి వచ్చింది’ అని ఆమె పేర్కొన్నారు. ఆ ఆరోపణల్ని భారత్, చైనా ఖండించాయి.

ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మరణించారు. హుస్సేనీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా హీరో పవన్ కళ్యాణ్‌కు హుస్సేనీ మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ నేర్పించారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూనే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు.

TG: భాగ్యనగరం మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమవుతోంది. మే 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమంతోపాటు 31న ఫైనల్స్ జరుగుతాయి. పోటీదారులు 4 బృందాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తారు. ఈ పోటీలలో విజేత జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు గవర్నర్, సీఎంలను మర్యాదపూర్వకంగా కలుస్తారు. 120 దేశాలకు చెందిన ప్రతినిధులు పోటీలలో పాల్గొననున్నారు.

AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో రూ.కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. లీజు ముగిసినా క్వార్ట్జ్ తరలించారని ఫిర్యాదు అందడంతో కాకాణి సహా ఏడుగురిపై FIR నమోదు చేశారు. గోవర్ధన్ రెడ్డిని ఏ4గా చేర్చారు. ఆయనపై 120బి, 447, 427, 379, 220, 506, 129తో పాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో-సీఈవో హాన్ జోంగ్-హీ (63) గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. శామ్‌సంగ్‌లోని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ & మొబైల్ డివైజెస్ విభాగానికి హాన్ బాధ్యత వహిస్తుండగా, మరో కో-సీఈవో జున్ యంగ్-హ్యూన్ చిప్ బిజినెస్‌ను పర్యవేక్షిస్తున్నారు.

AP: 2024-25 ఏడాది మార్చి నెలాఖరునాటికి ఏపీ అప్పులు రూ.5.62 లక్షల కోట్లు దాటుతాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఇవి GSDPలో 34.70 శాతం ఉంటాయని పార్లమెంట్‌లో చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీలో అప్పులు 34.58 శాతంగా ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు తెలంగాణకు రూ.4,42,298 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు FRBM చట్టాన్ని అమలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

AP: వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల వద్ద తొలి 30min వరకు ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయవద్దని మున్సిపల్ శాఖ ఆదేశాలిచ్చింది. వస్తువులు కొన్న బిల్స్ చూపిస్తే 30min నుంచి 1hr వరకు ఫీజు తీసుకోవద్దని సూచించింది. సినిమా టికెట్ లేదా ఆ సముదాయంలో పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ మొత్తం విలువైన వస్తువులు కొంటే గంట కంటే ఎక్కువసేపు ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ ఆదేశాలు APR 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Sorry, no posts matched your criteria.