News March 25, 2025
పార్కింగ్ ఫీజు రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

AP: వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల వద్ద తొలి 30min వరకు ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయవద్దని మున్సిపల్ శాఖ ఆదేశాలిచ్చింది. వస్తువులు కొన్న బిల్స్ చూపిస్తే 30min నుంచి 1hr వరకు ఫీజు తీసుకోవద్దని సూచించింది. సినిమా టికెట్ లేదా ఆ సముదాయంలో పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ మొత్తం విలువైన వస్తువులు కొంటే గంట కంటే ఎక్కువసేపు ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ ఆదేశాలు APR 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Similar News
News April 19, 2025
ఇది నమ్మశక్యంగా లేదు: రోహిత్ శర్మ

వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు తన పేరును పెట్టడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ఫేవరెట్ రంజీ ప్లేయర్లను చూసేందుకు వాంఖడే బయట ఎదురుచూస్తూ ఉండేవాడిని. స్టేడియంలోకి అందర్నీ రానిచ్చేవారు కాదు. అలాంటిది అదే స్టేడియంలో నా పేరిట స్టాండ్ అంటే చాలా భావోద్వేగంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. ఇది ఎంతోమంది క్రికెటర్లకు కల’ అని హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
మైనర్ మినరల్ పాలసీ రిలీజ్ చేసిన ప్రభుత్వం

AP: రాష్ట్ర ప్రభుత్వం మైనర్ ఖనిజాల పాలసీ-2025 విడుదల చేసింది. అధిక ఆదాయ సృష్టి, పెట్టుబడుల ఆకర్షణే దీని ప్రధాన లక్ష్యమని వెల్లడించింది. 2022 మార్చి 13 వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకే లీజు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్‌లాంటి ఖనిజాలున్న భూములను 30ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనుంది. మరోవైపు, యాన్యువల్ డెట్ రెంట్ మూడు నెలల్లోగా కట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
News April 19, 2025
ఏప్రిల్ 19: చరిత్రలో ఈరోజు

1882: జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్(ఫొటోలో) మరణం.
1912: నోబెల్ గ్రహీత, అమెరికా రసాయన శాస్త్రవేత్త గ్లెన్ సీబోర్గ్ జననం.
1957: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ జననం.
1971: మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రారంభం.
1975: భారత్ తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం
2006: స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న మరణం.