India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్చి 25, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.16 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.28 గంటలకు
ఇష: రాత్రి 7.40 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

☛ తిథి: బహుళ ఏకాదశి రా.11.48 వరకు తదుపరి ద్వాదశి
☛ నక్షత్రం: శ్రవణం రా.12.02 వరకు తదుపరి ధనిష్ఠ
☛ శుభ సమయం: ఉ.6.00-ఉ.8.00, రా.7.28-రా.7.52
☛ రాహుకాలం: మ.3.00 నుంచి సా.4.30 వరకు
☛ యమగండం: ఉ.9.30-ఉ.10.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, రా.10.48-రా.11.36
☛ వర్జ్యం: తె.4.19 నుంచి ఉ.5.52 వరకు
☛ అమృత ఘడియలు: మ.2.04 నుంచి మ.3.38 వరకు

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేయనున్నారు. ఆ జట్టు యజమాని సల్మాన్ ఇక్బాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘కరాచీ కింగ్స్ కుటుంబానికి వార్నర్‌కు స్వాగతం. కెప్టెన్‌గా అతడి నాయకత్వం మా జట్టు విజన్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది’ అని పేర్కొన్నారు. లాహోర్‌లో ఇటీవల జరిగిన డ్రాఫ్ట్‌లో ఆ జట్టు ఆయన్ను ప్లాటినం కేటగిరీలో తీసుకుంది. ఇదే జట్టులో కేన్ విలియమ్‌సన్ కూడా ఉండటం గమనార్హం.

* AP: 2029కల్లా పేదరికాన్ని నిర్మూలించడమే మా సంకల్పం: CBN
* చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది: పవన్
* ఏపీలో రూ.2వేల కోట్ల లిక్కర్ స్కామ్: ఎంపీ లావు
* అరటి రైతులకు రూ.1.10 లక్షలు: అచ్చెన్న
* TG: వారికి రుణమాఫీపై మాట్లాడే హక్కు లేదు: తుమ్మల
* రేవంత్‌వి దివాలాకోరు రాజకీయాలు: హరీశ్ రావు
* రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: MLC కవిత
* పార్లమెంటు సభ్యుల జీతాలు పెంపు

ఢిల్లీ బౌలర్ ముకేశ్ కుమార్ టోర్నీ చరిత్రలోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. IPLలో కనీసం 300 బంతులేసి వరస్ట్ ఎకానమీ రేట్ కలిగి ఉన్న బౌలర్‌గా నిలిచారు. ముకేశ్ ఎకానమీ 10.45గా ఉండటం గమనార్హం. లక్నోతో మ్యాచులో 2 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు. ఓవరాల్‌గా 21 మ్యాచుల్లో 10.45 ఎకానమీతో 25 వికెట్లు తీశారు. ఢిల్లీ జట్టు ముకేశ్ కోసం రూ.8 కోట్లు వెచ్చించడం గమనార్హం.

ర్యాగింగ్ భూతం కారణంగా దేశవ్యాప్తంగా గత నాలుగేళ్లలో 51మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా’ నివేదిక వెల్లడించింది. ‘2020-24 మధ్యకాలంలో 1946 కాలేజీల నుంచి హెల్ప్‌లైన్‌కు 3156 ఫిర్యాదులు అందాయి. అధిక ఫిర్యాదులు వైద్య కళాశాలల నుంచే ఉన్నాయి. మొత్తం కేసుల్లో 45.1శాతం మేర మెడికల్ కాలేజీలవే. మానసిక ఒత్తిడి భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని పేర్కొంది.

బోరుగడ్డ అనిల్‌కు నరసరావు పేట కోర్టు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించింది. ఫిరంగిపురం పోలీసులు ఈరోజు ఆయన్ను పీటీ వారెంట్‌పై సివిల్ జడ్జి వద్ద హాజరుపరచగా ఆయన రిమాండ్ విధించారు. కాగా అనిల్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

నిద్ర పోయే సమయంలో బెడ్ రూమ్‌లోకి దోమలు రాకుండా నివారణ యంత్రాలను వాడుతుంటారు. వీటి వాసనను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే హానికరమైన రసాయనాలతో శ్వాస సంబంధిత వ్యాధులకు ఆస్కారం ఉందంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెంపుడు జంతువులపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. వీటికి బదులుగా సహజ ప్రత్యామ్నాయాలు వాడటం, దోమతెరలను ఉపయోగించడం ఉత్తమమని చెబుతున్నారు.

IPL: వైజాగ్ వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కష్టాల్లో పడింది. 1.4 ఓవర్లలో 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఫ్రేజర్ 1, పోరెల్ 0, రిజ్వీ 4 పరుగులకు ఔటయ్యారు. శార్దూల్ 2, సిద్ధార్థ్ ఒక వికెట్ తీశారు. క్రీజులో అక్షర్, డుప్లెసిస్ ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 209 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.