News March 25, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: 2029కల్లా పేదరికాన్ని నిర్మూలించడమే మా సంకల్పం: CBN
* చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది: పవన్
* ఏపీలో రూ.2వేల కోట్ల లిక్కర్ స్కామ్: ఎంపీ లావు
* అరటి రైతులకు రూ.1.10 లక్షలు: అచ్చెన్న
* TG: వారికి రుణమాఫీపై మాట్లాడే హక్కు లేదు: తుమ్మల
* రేవంత్‌వి దివాలాకోరు రాజకీయాలు: హరీశ్ రావు
* రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: MLC కవిత
* పార్లమెంటు సభ్యుల జీతాలు పెంపు

Similar News

News April 21, 2025

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

image

CSKతో జరిగిన మ్యాచ్‌లో రాణించిన రోహిత్ శర్మ(76*) అరుదైన రికార్డును సాధించారు. IPLలో అత్యధిక(20) POTMలు సాధించిన భారత ప్లేయర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో ABD(25), గేల్(22) తొలి రెండు స్థానాల్లో, కోహ్లీ(19) ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. అలాగే IPLలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ధవన్(6,769)ను వెనక్కు నెట్టి 6,786 పరుగులతో హిట్ మ్యాన్ రెండో స్థానానికి చేరారు. కోహ్లీ(8,326) టాప్‌లో ఉన్నారు.

News April 21, 2025

దేశవ్యాప్త సమ్మెకు LPG డిస్ట్రిబ్యూటర్ల పిలుపు

image

తమ సమస్యలను 3 నెలల్లో పరిష్కరించకపోతే దేశవ్యాప్త సమ్మె చేస్తామని LPG డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ కేంద్రాన్ని హెచ్చరించింది. నిర్వహణ వ్యయం అధికమైనందున 14.2KG సిలిండర్‌కు ఇస్తున్న ₹73.03 కమీషన్‌ను ₹150కి పెంచాలని డిమాండ్ చేసింది. ఉజ్వల స్కీమ్‌లోని సిలిండర్ల పంపిణీలో సమస్యలున్నాయని, ఆయిల్ కంపెనీల టార్గెట్లనూ భరించలేకపోతున్నామని పేర్కొంది. ఇప్పటికే పెట్రోలియం మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిపింది.

News April 21, 2025

వాకింగ్ ఎంత వేగంతో చేస్తున్నారు?

image

ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే ఎంతవేగంతో ఎంతసేపు నడుస్తున్నామనేది చాలా ముఖ్యం. గంటకు 6.4 కి.మీ వేగంతో నడిస్తే గుండె దడ, హార్ట్ బీట్‌లో హెచ్చుతగ్గుల సమస్యలు 43 శాతం తగ్గుతాయని గ్లాస్గో వర్సిటీ(UK) అధ్యయనం వెల్లడించింది. 4.20 లక్షల మంది వాకర్స్ నుంచి 13 ఏళ్లపాటు డేటాను సేకరించి ఈ వివరాలను తెలిపింది. వేగంగా నడిస్తే బరువు, రక్తంలో కొవ్వు, జీర్ణ సమస్యలు తగ్గుతాయని పేర్కొంది.

error: Content is protected !!