India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి వారం రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్నారు. ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను కలిసి కోరనున్నారు.
రేవంత్‌తో పాటు జపాన్‌కు శ్రీధర్‌బాబు, అధికారులు వెళ్లనున్నారు.

ATM ఇంటర్‌ఛేంజ్(ఒక బ్యాంకు మరో బ్యాంకుకు చెల్లించేది) ఫీజుల పెంపునకు RBI ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ.2, ఆర్థికేతర ట్రాన్సాక్షన్లకు రూ.1 ఛార్జీలను పెంచింది. కొత్త రేట్లు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో క్యాష్ విత్‌డ్రా సేవలకు రూ.19, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇతర సేవలకు రూ.7 ఛార్జ్ ఉండనుంది. ఈ మొత్తాన్ని రికవరీ చేసేందుకు బ్యాంకులు కస్టమర్లమైనే భారం వేసే అవకాశముంది.

లైఫ్, హెల్త్ పాలసీలపై GST తగ్గింపునకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే సమావేశంలో ఈ పాలసీలపై ట్యాక్స్ తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్ అంగీకరించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించవచ్చని తెలిపాయి. అయితే పాలసీ మొత్తాన్ని బట్టి ఈ తగ్గింపు వర్తించే అవకాశముంది. ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్ తొలివారంలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది.

2024-25కు గాను ఉమెన్స్ క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులను బీసీసీఐ ప్రకటించింది. గ్రేడ్-Aలో హర్మన్, స్మృతి, దీప్తి చోటు దక్కించుకున్నారు. గ్రేడ్-Bలో రేణుక, జెమీమా, రిచా, షఫాలీ, గ్రేడ్-Cలో యస్తిక, రాధ, శ్రేయాంకా, టిటాస్, అరుంధతీరెడ్డి, అమన్‌జోత్, ఉమ, స్నేహ్ రాణా, పూజ ఉన్నారు. గ్రేడ్ల వారీగా వీరికి వరుసగా రూ.50L, రూ.30L, రూ.10L వార్షిక వేతనం అందుతుంది. ప్రతి మ్యాచ్‌కూ ఇచ్చే శాలరీ అదనం.

ప్రస్తుత, మాజీ పార్లమెంట్ సభ్యులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వారి జీతాలు, రోజువారీ భత్యం పెంచింది. ఇప్పటివరకూ ఉన్న రూ.లక్ష జీతాన్ని రూ.1.24 లక్షలకు పెంచింది. డైలీ అలవెన్స్ రూ.2వేల నుంచి రూ.2500కు, పెన్షన్‌ను రూ.25వేల నుంచి రూ.31వేలకు పెంచింది. అలాగే అదనపు పెన్షన్‌ను రూ.2500 చేసింది. ఇది APR 1, 2023 నుంచే అమల్లోకి రానుంది. కాగా, రెండేళ్ల బకాయిలను త్వరలో చెల్లించనుంది.

బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే అనుకున్న తేదీ కన్నా ముందుగానే రానున్నట్లు తాజాగా తెలిపారు. ఏప్రిల్ 4న ఈ చిత్రం రీరిలీజ్ అవుతుందని పేర్కొన్నారు. భారత దేశ సినీ చరిత్రలోనే తొలి టైమ్ ట్రావెల్ సినిమాగా ఇది రికార్డులకెక్కింది.

స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 23,658 (+307), సెన్సెక్స్ 77,984 (+1078) వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లు ₹5లక్షల కోట్లమేర సంపద పోగేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, PSE, రియాల్టి, చమురు, ఇన్ఫ్రా, ఎనర్జీ, ఐటీ, ఆటో, ఫార్మా, మెటల్ షేర్లు దుమ్మురేపాయి. కొటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. టైటాన్, ఇండస్‌ఇండ్, ట్రెంట్, ఎం&ఎం, ఎయిర్‌టెల్ టాప్ లూజర్స్.

కెమెరాలతో కూడిన సరికొత్త వాచ్‌లను యాపిల్ తీసుకురానుంది. AI సాంకేతికతతో ఇవి పనిచేయనున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి. కెమెరాల ద్వారా పరిసరాల గురించి సమాచారం అందించడంలో ఇవి ఉపయోగపడుతాయని పేర్కొన్నాయి. స్టాండర్డ్ మోడల్స్‌లో ముందు వైపు, అల్ట్రా మోడల్స్‌లో పక్కకు కెమెరాలు ఉంటాయని పేర్కొన్నాయి. అయితే ఇవి ఫేస్ టైమ్ కాల్స్ కోసం కాకుండా AI ఫీచర్స్ ను ఉపయోగించుకునేలా ఉంటాయని వెల్లడించాయి.

పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ మొదలైంది. ఇది ఓ సెక్యూర్ డాక్యుమెంట్. ఇకపై PAN కోసం అప్లై చేసుకుంటే ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ పాన్ 2.0 జారీ అవుతుంది. దీనిపై ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్, చిప్ ఉంటుంది. సైబర్ మోసాల బారిన పడకుండా రక్షించడంలో ఈ కార్డు కీలక పాత్ర పోషించనుంది. ఫ్రీగానే ఈ కార్డు పొందవచ్చు. పాత పాన్ కార్డులూ పనిచేస్తాయని, ఆ కార్డులో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

రోహిత్ శర్మ ఐపీఎల్‌లో కొంచెం ఆచితూచి ఆడాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డారు. ‘పిచ్‌పై ఓ ఐడియా వచ్చేవరకూ కనీసం 6 బంతుల పాటు రోహిత్ టైమ్ తీసుకోవాలి. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం అంత సులువు కాదు. చెన్నైతో మ్యాచ్‌లో పిచ్ నెమ్మదిగా ఉంది. అయినా షాట్ ఆడేందుకు యత్నించి ఆయన ఔట్ అయ్యారు. అన్ని సమయాల్లోనూ దూకుడు పనికిరాదు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.