news

News March 23, 2025

అమెరికాలో కాల్పులు.. భారత్‌కు చెందిన తండ్రి, కూతురు మృతి

image

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో గుజరాత్‌కు చెందిన ప్రదీప్(56), ఆయన కుమార్తె ఊర్మి(26) మృతిచెందారు. వీరు వర్జీనియాలో డిపార్ట్‌మెంటల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. నిందితుడు ఉదయాన్నే ఆ షాపు వద్దకు వచ్చి గొడవకు దిగారు. రాత్రి నుంచి మద్యం కోసం వేచి ఉంటే షాపు ఎందుకు మూసేశారని గన్‌తో కాల్పులకు దిగాడు. ప్రదీప్ అక్కడికక్కడే చనిపోగా, ఊర్మి ఆస్పత్రిలో మరణించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News March 23, 2025

జూన్‌లో సూర్య-అట్లూరి మూవీ షురూ?

image

వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య నటించనున్న సినిమా జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, ప్రీప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని టాక్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే లేదా కయాదు లోహర్‌‌ను తీసుకునే అవకాశం ఉంది. ఈ మూవీని నాగవంశీ నిర్మిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు.

News March 23, 2025

భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: జైశంకర్

image

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలకమైనవని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఐరోపా, US, UK, న్యూజిలాండ్‌తో ట్రేడ్ చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇకపై భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. గతంలో ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం పోటాపోటీగా జరిగిందన్నారు. అయితే గల్ఫ్, పశ్చిమ దేశాలతో ఒప్పందాల్లోనే ఆర్థికంగా మిగులు సాధించినట్లు వివరించారు.

News March 23, 2025

IPL-2025: 300 స్కోర్ లోడింగ్?

image

ఉప్పల్‌లో SRH బ్యాటర్ల ముందు బౌండరీలు చిన్నబోతున్నాయి. ఫోర్లు, సిక్సులే లక్ష్యంగా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతుండటంతో 17 ఓవర్లకు స్కోర్ 230 దాటింది. ఈ క్రమంలో IPL చరిత్రలో తొలిసారి 300 స్కోర్ చేసే ఛాన్స్ కన్పిస్తోంది. గత సీజన్లో ఇదే SRH జట్టు బెంగళూరుపై లీగ్ చరిత్రలో 287/3 భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. తొలి ఓవర్ నుంచే బ్యాటర్లు హిట్టింగ్ ప్రారంభించగా RR బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది.

News March 23, 2025

స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన లోకేశ్ ఫ్యామిలీ

image

AP: మంత్రి లోకేశ్ కుటుంబ సమేతంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను సందర్శించే అదృష్టం కలిగింది. అందరికీ శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించాను. స్వర్ణ దేవాలయం దైవిక ప్రశాంతత నిజంగా స్ఫూర్తిదాయకం. వాహెగురు ఆశీస్సులు మనందరికీ మార్గనిర్దేశం చేస్తాయి’ అని ట్వీట్ చేశారు.

News March 23, 2025

సీట్లే కాదు పార్లమెంటులో ప్రాధాన్యత కోసం పోరాటం: కేకే

image

TG: పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని ప్రభుత్వ సలహాదారు K కేశవరావు ఆకాంక్షించారు. ఎంపీ సీట్ల గురించే కాకుండా పార్లమెంటులో తమ గళానికి ప్రాధాన్యత కోసం రాష్ట్రాలు పోరాడుతున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే కేంద్రం డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలని సూచించారు. పార్లమెంటులో చట్టం ఆమోదం పొందాకే పునర్విభజన చేయాలన్నారు.

News March 23, 2025

మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్ కీలక నిర్ణయాలు

image

మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణసాయం కింద రూ.50వేలు, ఆయుధాలు సరెండర్ చేస్తే వాటి స్థాయిని బట్టి రూ.5లక్షల వరకు ఇవ్వనుంది. రూ.5లక్షలకు ఆపై రివార్డు ఉన్న నక్సల్స్ లొంగిపోతే ఇంటి లేదా వ్యవసాయ భూమి ఇస్తుంది. భూమి అందుబాటులో లేకపోతే రూ.2లక్షల నగదు అందజేయనుంది. అలాగే పెళ్లి కాని, వితంతు మహిళలకు రూ.లక్ష సాయం చేయాలని నిర్ణయించింది.

News March 23, 2025

BREAKING: కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి 7 గంటల వరకు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌లో వాన పడుతుందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 23, 2025

ఆ 2 రోజులు VIP బ్రేక్ దర్శనాలు రద్దు

image

AP: తిరుమలలో ఈ నెల 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో 24, 29వ తేదీల్లో సిఫారసు లేఖలు అనుమతించబోమని తెలిపింది. మరోవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలను 23వ తేదీ స్వీకరించి 24న దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.

News March 23, 2025

KCRకు దొంగ నోట్లు ముద్రించే ప్రెస్: బండి సంజయ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నకిలీ నోట్లనే ఓటర్లకు పంచారన్నారు. ప్రస్తుతం భూములు అమ్మితే గానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. అలాగే రాష్ట్రంలో ప్రతి పనికీ కమీషన్ల వ్యవహారం నడుస్తోందని విమర్శించారు.