news

News March 22, 2025

కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా

image

ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ECB ధ్రువీకరించింది. 9 ఏళ్లపాటు సేవలందించినందుకు థ్యాంక్స్ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 2016లో కెప్టెన్‌గా ఎంపికైన హీథర్ ఏకంగా 199 మ్యాచ్‌(టెస్టు, వన్డే, టీ20)లకు నాయకత్వం వహించారు. ఆమె సారథ్యంలోనే ఇంగ్లండ్ 2017 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. హీథర్ 3 ఫార్మాట్లలో 7వేలకు పైగా రన్స్, 84 వికెట్లు తీశారు.

News March 22, 2025

IPL: ఈసారైనా వీరికి టైటిల్ దక్కేనా?

image

ఐపీఎల్‌లో కొన్ని జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాయి. వాటిలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, RCB, LSG ఉన్నాయి. ఈ సారైనా తమ ఫేవరెట్ జట్లు కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ 18వ సీజన్ నేటి నుంచి మే 25 వరకు కొనసాగనుంది. 64 రోజులపాటు 74 మ్యాచులు జరగనున్నాయి. ప్రస్తుతం టైటిల్ కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి.

News March 22, 2025

ALERT: రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం

image

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని APSDMA తెలిపింది. మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని పేర్కొంది. కూలీలు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇవాళ అత్యధికంగా కర్నూలు జిల్లా ఆస్పరి, సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.

News March 22, 2025

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ

image

AP: విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ను పునరుద్ధరించారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని కలెక్టర్‌కు సంస్థ ప్రతినిధులు అందించారు. బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయంటూ పర్యాటకులు ఫిర్యాదులు చేయడంతో ఇటీవల ఆ హోదాను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీచ్‌లో సౌకర్యాలను కల్పించింది.

News March 22, 2025

తొలి సినిమాకే ప్రెసిడెంట్ అవార్డు.. ప్రముఖ నటుడి మృతి

image

వెటరన్ యాక్టర్ రాకేశ్ పాండే (77) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో జుహూలోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. థియేటర్ ఆర్టిస్టుగా విశేష అనుభవం గల ఆయన 1969లో బసు ఛటర్జీ తీసిన క్లాసిక్ ‘సారా ఆకాశ్’తో తెరంగేట్రం చేశారు. తన నటనతో మెప్పించి ప్రెసిడెంట్ అవార్డునూ పొందారు. సినిమాలే కాకుండా ఆయన ఛోటీ బాహు, దెహ్లీజ్, భారత్ ఏక్ ఖోజ్ వంటి TV షోల్లోనూ నటించారు. రియాల్టీకి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకోవడంలో ఆయన దిట్ట.

News March 22, 2025

రుణమాఫీ విషయమై బీఆర్ఎస్ వాకౌట్

image

TG: రుణమాఫీ విషయంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం ఆ పార్టీ నేత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘అందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ అని సీఎం రేవంత్ ప్రకటించారు. రూ.2 లక్షలపైన ఉన్నవారు మిగతావి కడితే సరిపోతుందన్నారు. కానీ ఇప్పుడు రూ.2 లక్షలలోపు వారికే రుణమాఫీ అని బుకాయిస్తున్నారు. ఇందుకు నిరసనగానే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నాం’ అని హరీశ్ పేర్కొన్నారు.

News March 22, 2025

BREAKING: కాసేపట్లో భారీ వర్షం

image

TG: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 11 గంటల వరకు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 41-61 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

News March 22, 2025

వైసీపీ పాలనలో రైతులకు ఇబ్బందులు: నాదెండ్ల

image

AP: రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వైసీపీ పాలనలో పంటలు అమ్ముకునేందుకు అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. తాము ఇప్పటి వరకు రూ.8వేల కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు తెలిపారు. 17-20 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల అకౌంట్లలో 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

News March 22, 2025

IPL: మీ కుటుంబాన్ని రోడ్డున పడేయకండి!

image

ఈజీగా డబ్బులు సంపాదించేందుకు కొందరు బెట్టింగ్‌కు మొగ్గుచూపుతుంటారు. ముఖ్యంగా IPL వేళ విపరీతంగా డబ్బులు చేతులు మారుతుంటాయి. ఎవరో ఒకరు బెట్టింగ్‌లో డబ్బులు గెలుచుకున్నారనే వెర్రితనంతో మీరూ ఆ వలలో చిక్కుకోకండి. ఈ మహమ్మారి వలలో పడి ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రసవత్తరంగా సాగే మ్యాచులను చూసి ఎంజాయ్ చేయండి. కానీ బెట్టింగ్ జోలికి వెళ్లకండి. DONT ENCOURAGE BETTING

News March 22, 2025

మూడో దఫా నామినేటెడ్ పోస్టులపై కసరత్తు

image

AP: రాష్ట్రంలో మూడో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 21 ప్రముఖ దేవాలయాల పాలకమండళ్లు, 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో పోస్టుకు 2-3 పేర్లు పరిశీలిస్తున్నారని, సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇప్పటికే సిఫార్సులు అందజేశారని వార్తలు వస్తున్నాయి.