News March 22, 2025

వైసీపీ పాలనలో రైతులకు ఇబ్బందులు: నాదెండ్ల

image

AP: రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వైసీపీ పాలనలో పంటలు అమ్ముకునేందుకు అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. తాము ఇప్పటి వరకు రూ.8వేల కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు తెలిపారు. 17-20 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల అకౌంట్లలో 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News April 17, 2025

మంత్రి వివాదాస్పద కామెంట్స్.. FIR ఫైల్ చేయాలని కోర్టు ఆదేశం

image

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన TN మంత్రి కె.పొన్ముడిపై ఈనెల 23లోపు FIR నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. లేదంటే తామే ఈ కేసును సమోటోగా స్వీకరిస్తామని స్పష్టం చేసింది. ఓ సెక్స్ వర్కర్ తమ వద్దకు వచ్చిన వారిని శైవులా, వైష్ణవులా అని అడిగిందంటూ ఆయన అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో పొన్ముడిని డీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించింది.

News April 17, 2025

ఘనంగా అర్జున్ సర్జా కుమార్తె ఎంగేజ్‌మెంట్

image

ప్రముఖ నటుడు అర్జున్ సర్జా చిన్న కూతురు అంజన త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. తాజాగా ఇటలీలో ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు. 13 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అనే అర్థంలో ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేశారు. వరుడు విదేశీయుడు కాగా ఇతర వివరాలేవీ తెలియరాలేదు. అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య నటుడు ఉమాపతి రామయ్యను గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

News April 17, 2025

ఆ ప్లేయర్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్?

image

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో యువ ఆటగాళ్లు చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జాతీయ జట్టులో సత్తా చాటిన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాకు కాంట్రాక్ట్ దక్కవచ్చని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. అభిషేక్‌కు సీ-గ్రేడ్‌లో చోటు దక్కవచ్చని అభిప్రాయపడింది. కాగా BCCI పాలసీ ప్రకారం కాంట్రాక్ట్‌లో చోటు దక్కాలంటే ప్లేయర్ కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20Iలు ఆడి ఉండాలి.

error: Content is protected !!