India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: BRS హయాంలో GST వృద్ధి రేటు 8.54 ఉంటే తమ హయాంలో 12.3 శాతంగా ఉందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేశామని అసెంబ్లీలో చెప్పారు. ‘ఆరు గ్యారంటీలకే రూ.56 వేల కోట్లు ఖర్చు పెడతాం. బడ్జెట్‌ను కుదించి వాస్తవ లెక్కలు చెప్పాం. చేయగలిగినవే మేం బడ్జెట్‌లో పొందుపరిచాం. పదేళ్లలో రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసి BRS ఏం సాధించింది?’ అని పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ దక్షిణాది సినిమాలో నటిస్తున్న సమయంలో నా అనుమతి లేకుండానే ఓ డైరెక్టర్ నా క్యారవాన్ డోర్ తీశాడు. అప్పుడు నేను బట్టలు మార్చుకుంటున్నా. అతడిపై నేను గట్టిగా కేకలు వేయడంతో వెళ్లిపోయారు. డైరెక్టర్ తీరుతో నేను ఎంతో బాధపడ్డా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా షాలినీ పలు సినిమాల్లో నటించారు.

AP: అనంతపురం(D) తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. YCP నేత ఫయాజ్ బాషా ఇల్లు అక్రమ నిర్మాణమనే ఆరోపణతో మున్సిపల్ అధికారులు జేసీబీతో తరలివచ్చారు. దానివెంట టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వందలాది మంది అనుచరులతో వచ్చారు. ఈ క్రమంలో ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ శ్రేణులూ భారీగా వచ్చి ఎదురుదాడి చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

TG: రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను BRS నాశనం చేసిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లపాటు ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా ముందే లాక్కుంది’ అని ఫైర్ అయ్యారు.

TG: HYDలోని పలు హోటళ్లలో కుళ్లిన మాంసం ప్రజలను హడలెత్తిస్తోంది. ఇటీవల మంగళ్‌హట్‌లో అధికారులు 12 టన్నుల మేక మాంసాన్ని సీజ్ చేయగా, ఇవాళ డబీర్‌పురలో 2 టన్నుల మటన్‌ను గుర్తించారు. పాడైన మేక, గొర్రె మాంసాన్ని వివాహాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడు మిస్సాహుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో మటన్, హలీం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిన మాంసం సరఫరాను అరికట్టాలని కోరుతున్నారు.

AP: ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో పస లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే YCP MLAలు సభకు వెళ్లలేదని చెప్పారు. కూటమి నేతలను పొగుడుకునేందుకే సభా సమయం సరిపోయిందన్నారు. స్కిట్స్‌లోనూ జగన్ పేరు మర్చిపోలేకపోయారని, CBN శకుని పాత్ర వేస్తే బాగుండేదని సెటైర్లు విసిరారు. YSR స్నేహితుడినని చెప్పుకునే ఆయన ఇప్పుడు వైఎస్సార్ జిల్లా పేరు మార్చారని మండిపడ్డారు.

ఒత్తిళ్లో, ఆర్థిక ఒడిదుడుకులో, అనారోగ్యాలో.. కారణాలేవైనా ఎన్నో జంటలు తమ రోజువారీ జీవితంలో దాంపత్య సుఖానికి దూరంగా ఉంటుంటాయి. అది ఏమాత్రం మంచిది కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల ఉపయోగం లేకపోగా వారి మధ్య దూరం పెరిగి చికాకులు తోడవుతాయని వివరిస్తున్నారు. ఎన్ని బాధలు ఉన్నా పడకపై భాగస్వామి చెంతచేరి సేదతీరాలని, మరుసటిరోజుకు ఇది కొత్త ఉత్సాహాన్నిస్తుందని సూచిస్తున్నారు.

ప్రతి ఏటా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ జరుపుతుంటారు. ఆ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో లైట్లను ఆపేస్తారు. పర్యావరణ పరిరక్షణకు, భూతలతాపాన్ని నియంత్రించేందుకు ఈరోజును ప్రారంభించారు. ప్రజలు స్వచ్ఛందంగా లైట్లు ఆపి ఈరోజును పాటించాలని AP గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. కాగా.. ఢిల్లీ ప్రభుత్వం ఎర్త్ డేను పాటిస్తూ రేపు రాత్రి ఆ గంట సేపు లైట్లను ఆపేయనుంది.

దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్‌కు సెలక్ట్ అయినవారి తొలి మెరిట్ జాబితాను పోస్టల్ శాఖ ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు INDIAPOSTGDSONLINE.GOV.IN వెబ్‌సైట్లో జాబితాను చూసుకోవచ్చు. ఏపీలో 1215, తెలంగాణలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 21,413 పోస్టులకు ఈ నెల 3వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది.

అనర్హులైన రైతుల నుంచి కేంద్రం పీఎం కిసాన్ యోజన డబ్బులను వెనక్కి తీసుకుంటోంది. ఇప్పటికే ₹416 కోట్లను వారి నుంచి రికవరీ చేసింది. ఆదాయపన్ను చెల్లింపుదారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవుల్లో కొనసాగుతున్న వారిని వడగట్టి నగదును తిరిగి రాబట్టింది. రానున్న రోజుల్లో ఈ ప్రక్రియను మరింత కఠినంగా చేపట్టనుందని సమాచారం. రైతులకు కేంద్రం ఏటా 3 విడతల్లో ₹6000 అందించే సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.