News March 21, 2025

SHOCKING: మాంసం, హలీం తింటున్నారా?

image

TG: HYDలోని పలు హోటళ్లలో కుళ్లిన మాంసం ప్రజలను హడలెత్తిస్తోంది. ఇటీవల మంగళ్‌హట్‌లో అధికారులు 12 టన్నుల మేక మాంసాన్ని సీజ్ చేయగా, ఇవాళ డబీర్‌పురలో 2 టన్నుల మటన్‌ను గుర్తించారు. పాడైన మేక, గొర్రె మాంసాన్ని వివాహాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడు మిస్సాహుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో మటన్, హలీం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిన మాంసం సరఫరాను అరికట్టాలని కోరుతున్నారు.

Similar News

News April 19, 2025

మరోసారి థియేటర్లలోకి ‘బాషా’

image

రజినీకాంత్ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒకటైనా ‘బాషా’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 25న రీరిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రజిని స్వాగ్, స్టైల్‌ను థియేటర్లలో చూసేందుకు సిద్ధమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడొస్తున్న చాలా చిత్రాలకు ‘బాషా’ స్క్రీన్ ప్లేను రిఫరెన్స్‌గా వాడతారని సినీ విశ్లేషకులు చెబుతారు.

News April 19, 2025

హెరాల్డ్ కేసులో మేం భయపడేది లేదు: ఖర్గే

image

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై పెట్టిన కేసులకు తాము భయపడేది లేదని AICC చీఫ్ ఖర్గే పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకే వారిని ఈ కేసులో ఇరికించారని ఆయన వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ చట్టం విషయంలో సుప్రీం కోర్టు తమ పార్టీ లేవనెత్తిన కీలక పాయింట్లకు ప్రాముఖ్యతనిచ్చిందని అన్నారు. బీజేపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, ప్రజలకు కాంగ్రెస్ నేతలు వాస్తవాలు చెప్పాలని ఖర్గే పిలుపునిచ్చారు.

News April 19, 2025

కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

image

AP: విశాఖ <<16147304>>మేయర్ పీఠం కూటమి<<>> ప్రభుత్వం దక్కించుకోవడంపై వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు రాజకీయాలకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. YCP 58 స్థానాలు గెలిస్తే, కూటమి 30 సీట్లే గెలిచిందని, ఏ రకంగా మేయర్ పదవి వస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.

error: Content is protected !!