news

News March 21, 2025

BIG UPDATE.. త్వరలో 55,418 పోస్టుల భర్తీ!

image

TG: రాష్ట్రంలో కొలువుల జాతర మొదలుకానుంది. త్వరలోనే 55,418 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. అంగన్వాడీ, గ్రామ పరిపాలన అధికారులతో పాటు హోం, వైద్యారోగ్య, విద్యా శాఖల్లో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్థిక శాఖతో చర్చలు జరిపిన తర్వాత వీటిపై నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే 58,868 పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

News March 21, 2025

జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. నెక్స్ట్ ఏంటి?

image

ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా నగదు బయటపడింది. ఇది లెక్కల్లో చూపని డబ్బు కావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఆగ్రహించింది. ఈ ఘటన న్యాయ వ్యవస్థను దెబ్బతీస్తుందని, వర్మ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆయనను ఢిల్లీ నుంచి అలహాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ ఘటనపై వర్మ నుంచి CJI వివరణ కోరనున్నారు. ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే అంతర్గత విచారణకు ఆదేశిస్తారు.

News March 21, 2025

హనీట్రాప్: కర్ణాటక కాంగ్రెస్‌లో చీలిక!

image

కర్ణాటకలో 48 మంది నేతలు హనీట్రాప్‌లో చిక్కినట్టు స్వయంగా కాంగ్రెస్ మంత్రే బయటపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు మంత్రులు, MLAలు వలపు వలలో చిక్కారని, దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేయడం వర్గపోరుకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. సొంతపార్టీ నేతలపై విచారణ కోరడమే ఇందుకో ఉదాహరణగా చెప్తున్నారు. CM సిద్దరామయ్య, DYCM శివకుమార్ విభేదాలు పార్టీలో చీలికను సూచిస్తున్నాయని పేర్కొంటున్నారు. మీరేమంటారు?

News March 21, 2025

REWIND: ‘జనతా కర్ఫ్యూ’ గుర్తుందా?

image

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదేరోజున ‘జనతా కర్ఫ్యూ’ విధించిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశమంతటా స్వచ్ఛంద బంద్‌కు కేంద్రం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ విధించింది. ఎక్కడికక్కడ దేశం స్తంభించడంతో వలస జీవులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరోనా మీపై ఎలాంటి ప్రభావం చూపింది? COMMENT

News March 21, 2025

ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు

image

AP: అలిపిరిలో ముంతాజ్, మరో హోటల్‌కు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని రద్దు చేస్తున్నట్లు CM చంద్రబాబు తిరుమలలో ప్రకటించారు. ఏడుకొండలను ఆనుకొని కమర్షియలైజేషన్ ఉండకూడదన్నారు. శ్రీవారి ఆస్తులన్నీ కాపాడటమే లక్ష్యమన్నారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయం కట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. సీఎంలు ముందుకొస్తే నిర్మాణాలు చేపడతామన్నారు. అంతకుముందు ఆయన దేవాన్ష్ బర్త్‌డే సందర్భంగా అన్నవితరణ చేశారు.

News March 21, 2025

వారం రోజుల్లో ‘కోర్ట్’ కలెక్షన్లు ఎంతంటే?

image

థియేటర్లలో ‘కోర్ట్’ సినిమా కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన తొలి వారంలోనే ఈ సినిమా రూ.39.60+ కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు, విమర్శకులు ఇచ్చిన బ్లాక్ బస్టర్ తీర్పుతో రెండో వారంలోకి ప్రవేశించిందని పేర్కొంది. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.

News March 21, 2025

చాహల్-ధనశ్రీ విడాకులు.. అప్పటి నుంచే దూరం!

image

చాహల్ – ధనశ్రీ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేయగా, రూ.4.75కోట్ల భరణం చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. కాగా 2020 డిసెంబర్‌లో వీరికి పెళ్లవగా, ఏడాదిన్నరకే (2022 జూన్) సపరేట్ అయినట్లు విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ధనశ్రీ ఫేమ్ కోసం చాహల్‌ను వాడుకున్నారని కొందరు అంటుండగా, ఆమె ఎలాంటి తప్పు చేయలేదని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.

News March 21, 2025

ట్రంప్‌కు ఎదురుదెబ్బ

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. భారతీయ రీసెర్చర్ బాదర్ ఖాన్‌ను US నుంచి బహిష్కరించొద్దని వర్జీనియా కోర్టు ఆదేశించింది. బాదర్ ఖాన్‌కు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ట్రంప్ ప్రభుత్వం అతడిని గత సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అరెస్టును సవాల్ చేస్తూ బాదర్ ఖాన్ కోర్టును ఆశ్రయించగా అతడికి కోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.

News March 21, 2025

భారీగా తగ్గిన సిల్వర్ రేటు

image

బంగారం ధరలు కాస్త తగ్గి సామాన్యుడికి ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.82,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.90,200కు చేరింది. అటు వెండి ధర ఏకంగా రూ.2100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.

News March 21, 2025

హనీ‌ట్రాప్: అసెంబ్లీకి వీడియో CDలు తీసుకొచ్చిన BJP నేతలు

image

కర్ణాటక అసెంబ్లీని హనీట్రాప్ వివాదం కుదిపేస్తోంది. వలపు వలలో చిక్కిన 48 నేతల పేర్లను బయటపెట్టాలని ప్రతిపక్ష BJP డిమాండ్ చేస్తోంది. ఇదిగో ప్రూఫ్ అంటూ వీడియో CDలు పట్టుకొని CM సిద్దరామయ్య ముందు నిరసన వ్యక్తం చేసింది. నేతలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన నిర్వహిస్తున్నా పట్టించుకోని సీఎం తలదించుకొని యథావిధిగా తన ప్రసంగం కొనసాగించారు. వివాదంపై అత్యున్నత స్థాయిలో విచారణ జరిపిస్తామని ప్రకటించారు.