news

News March 20, 2025

ఉద్యోగులకు రేపు రూ.6,200 కోట్ల బకాయిల చెల్లింపు

image

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు వారికి రూ.6,200 కోట్ల CPS, GPF, APGAI బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న దాదాపు రూ.1,033 కోట్ల బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే.

News March 20, 2025

నన్ను కలిసేందుకు డబ్బులు అవసరం లేదు: చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి లండన్ టూర్‌ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్ మీట్ పేరుతో చిరును కలిసే అవకాశం కల్పిస్తామంటూ కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై చిరు Xలో స్పందించారు. ‘ఫ్యాన్ మీటింగ్‌ పేరుతో ఇలా డబ్బులు వసూలు చేయడాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. వారి డబ్బులు వెనక్కి ఇచ్చేయండి. నన్ను కలవడానికి ఎవరికీ డబ్బులు చెల్లించనక్కర్లేదు’ అని ఫ్యాన్స్‌కు సూచించారు.

News March 20, 2025

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

IPL ఫ్యాన్స్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో KKR, RCBకి మధ్య ఎల్లుండి జరగనున్న మ్యాచ్‌కు వర్షం ముప్పు 90శాతం మేర ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఒకవేళ వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ రద్దైతే ఇరు జట్లూ పాయింట్లు పంచుకుంటాయి.

News March 20, 2025

MF హుస్సేన్ పెయింటింగ్‌కు రూ.118 కోట్లు

image

ఎంఎఫ్ హుస్సేన్ ‘అన్‌టైటిల్డ్(గ్రామ్ యాత్ర)’ పెయింటింగ్‌ను న్యూయార్క్‌లో వేలం వేయగా రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. భారత గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే 13 రకాల చిత్రాలను 14 అడుగుల కాన్వాస్‌లో ఆయన 1954లో చిత్రీకరించారు. భారత చరిత్రలో అత్యంత ఖరీదైన పెయింటింగ్‌గా ఇది రికార్డు సృష్టించింది. అమృతా షెర్గిల్ 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ పెయింటింగ్‌కు 2023లో రూ.61.8 కోట్ల ధర పలికింది.

News March 20, 2025

IPL: KKRvsLSG మ్యాచ్ రీషెడ్యూల్

image

ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన KKRvsLSG మ్యాచ్‌ను గువాహటికి బీసీసీఐ మార్చింది. ఆ రోజున శ్రీరామనవమి సందర్భంగా కోల్‌కతాలో భారీగా ఊరేగింపులు జరగనున్నాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేశారు. గత ఏడాది KKRvsRR మ్యాచునూ ఇదే కారణంతో వాయిదా వేశారు.

News March 20, 2025

547 కేంద్రాల ద్వారా పంట సేకరణ: మార్క్‌ఫెడ్

image

AP: రాష్ట్రంలో 547 కొనుగోలు కేంద్రాల ద్వారా పంట సేకరణ పారదర్శకంగా జరుగుతోందని మార్క్‌ఫెడ్ వెల్లడించింది. కందికి క్వింటాల్‌కు రూ.7,550, శనగలకు రూ.5,650, పెసలుకు రూ.8,682 మద్దతు ధర ఇస్తున్నట్లు పేర్కొంది. CMAPP ద్వారా ఎప్పటికప్పుడు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపింది. అన్నదాతలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

News March 20, 2025

సామర్థ్యం ఉన్న మహిళకు భరణం ఎందుకు: హైకోర్టు

image

సంపాదించే చదువు, అర్హత, వయసు ఉన్న మహిళలు భర్త నుంచి భరణం కోరడానికి వీలు లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇలాంటి మహిళలకు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశించలేమని స్పష్టం చేసింది. తన పోషణకు మధ్యంతర భరణం ఇవ్వాలని ఓ మహిళ కోర్టులో పిటిషన్‌ వేయగా తిరస్కరించింది. భరణం పేరుతో మహిళలు పనీపాట లేకుండా ఉండటాన్ని కోర్టు ఎప్పటికీ ఆమోదించదని పేర్కొంది. భర్త ఇచ్చే భరణంపై ఆధారపడడం సబబు కాదని తేల్చిచెప్పింది.

News March 20, 2025

GOOD NEWS: షుగర్, ఊబకాయానికి మందు వచ్చేస్తోంది!

image

డయాబెటిస్, అధిక బరువుతో బాధపడేవారికి ఎలీ లిల్లీ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. వాటి చికిత్సకు ఉపకరించే ఔషధాన్ని మౌంజారో పేరిట భారత మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఔషధం 2.5 మి.గ్రా ధరను రూ.3500గా, 5 మి.గ్రా ధరను రూ.4375గా నిర్ణయించింది. ఇది ఇప్పటికే పలు దేశాల్లో అందుబాటులో ఉండగా భారత్‌లోకి రావడం ఇదే తొలిసారి. దేశంలో షుగర్, ఒబేసిటీ బాధితులు 10కోట్లకు పైగానే ఉంటారని ఓ అంచనా.

News March 20, 2025

ALERT: ఆ జిల్లాల్లో ఉరుములు.. వడగండ్ల వానలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో <>రేపు, ఎల్లుండి<<>> ఉరుములు, మెరుపులు, తీవ్రగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News March 20, 2025

ఐపీఎస్ అభిషేక్ మహంతికి స్వల్ప ఊరట

image

TG: ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి రాష్ట్ర హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. ఆయన్ను ఏపీకి అటాచ్ చేస్తూ కేంద్ర సిబ్బంది శాఖ చేసిన ఉత్తర్వులను ఈ నెల 24 వరకు నిలిపివేసింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అంతకుముందు సిబ్బంది శాఖ నిర్ణయంపై ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా అక్కడ చుక్కెదురైంది. అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.