India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్చి 20, గురువారం ఫజర్: తెల్లవారుజామున 5.08 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

☛ తిథి: బహుళ షష్టి రా.10.36 వరకు తదుపరి సప్తమి ☛ నక్షత్రం: అనురాధ రా.7.58 వరకు తదుపరి జ్యేష్ట☛ శుభ సమయం: ఉ.10.49 నుంచి 11.23 వరకు, తిరిగి సా.5.47నుంచి 6.35వరకు ☛ రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు ☛ యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు ☛ దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు తిరిగి మ.2.48నుంచి 3.36వరకు ☛ వర్జ్యం: రా.2నుంచి 3.42 ☛ అమృత ఘడియలు: ఉ.8.35 నుంచి 10.19వరకు

* బిల్‌గేట్స్‌ను APకి ఆహ్వానించిన CM చంద్రబాబు
* ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు: CM రేవంత్
* ఎకరానికి ₹25వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి: KTR
* అమరావతికి రూ.31,600 కోట్ల ఖర్చు: మంత్రి నారాయణ
* టీచర్ల బదిలీల చట్టంతో చరిత్ర సృష్టించబోతున్నాం: లోకేశ్
* బడ్జెట్‌లో పేజీలే పెరిగాయి.. సంక్షేమం కాదు: హరీశ్ రావు
* తెలంగాణలో ‘ఇందిర గిరి జల వికాసం’ పథకం ప్రారంభం
* భూమిపై అడుగుపెట్టిన సునీతా విలియమ్స్

AP: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో ఇద్దరు MLAలు, ఓ MLC గాయపడ్డారు. రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి కబడ్డీ ఆడుతూ వెనక్కి పడిపోవటంతో తలకు స్వల్పగాయమైంది. అలాగే రైల్వేకోడూరు MLA అరవ శ్రీధర్ కూడా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. దీంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. క్రికెట్ ఆడుతూ MLC రాంభూపాల్ రెడ్డి కింద పడిపోయారు. వీరందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

AP: రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. పరిశ్రమలు, పరిశోధనలు, స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై సలహాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అడ్వైజర్‌గా కేపీసీ గాంధీని నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.

ప్రతి ఒక్కరూ సాధారణంగా పడుకునే ముందు పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుని నిద్రిస్తారు. అయితే తలపైన నీళ్లను పెట్టుకోకూడదని, ఇది అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రతికూలత వ్యాపించి మానసిక స్థితి దెబ్బతింటుందని పేర్కొంటున్నాయి. అలాగే నెగటివ్ ఎనర్జీ వ్యాపించి ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతాయట. రాత్రి పూట గొంతెండిపోయే సమస్య ఉన్నవారు కాళ్ల వైపు వాటర్ బాటిల్ పెట్టుకోవడం ఉత్తమం.

ఐపీఎల్ 2025 కోసం మహ్మద్ షమీ సన్నద్ధమవుతున్నారు. SRH జెర్సీ ధరించి ఆయన ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్ మెగా వేలంలో షమీని SRH రూ.10 కోట్లకు దక్కించుకుంది. జట్టు పేస్ దళాన్ని షమీ నడిపించనున్నారు.

AP: రాష్ట్రంలోని 59 మండలాల్లో రేపు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం-15, విజయనగరం-20, మన్యం-14, అల్లూరి-2, కాకినాడ-3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రంలోనే అత్యధికంగా ఇవాళ నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా అట్లూరులో 41.2, ప్రకాశం జిల్లా గోళ్లవిడిపిలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.