India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టిక్‌టాక్ రీల్ అనుకరిస్తూ ఓ బాలిక కోమాలోకి వెళ్లింది. USలోని మిస్సోరి ఫెస్టస్‌కు చెందిన స్కార్లెట్ సెల్బీ(7) టిక్‌టాక్‌లో నీడో క్యూబ్ ఆకృతిని మార్చే రీల్ చూసింది. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని రీల్‌లో చూపించినట్లు ఆ క్యూబ్‌ను తొలుత ఫ్రీజ్ చేసి ఆపై ఒవెన్‌లో ఉంచింది. దానిని బయటికి తీసినప్పుడు క్యూబ్ పేలి, అందులోని వేడి ద్రవం ఆమె ముఖం, ఛాతిపై పడింది. కొంత నోరు, ముక్కులోకి చేరడంతో కోమాలోకి వెళ్లింది.

AP: భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, DRDO మాజీ చీఫ్ సతీశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులయ్యారు. చేనేత, హస్తకళల అభివృద్ధికి సంబంధించి సుచిత్ర, ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అడ్వైజర్‌గా సతీశ్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. క్యాబినెట్ ర్యాంకుతో రెండేళ్లపాటు వీరు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.

AP: విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియం పేరును తొలగించడాన్ని నిరసిస్తూ రేపు నగరంలో వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. ‘వైజాగ్ ప్రగతికి రాచబాటలు వేసిన వైఎస్సార్‌ను కూటమి ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది. ఆయన ఆనవాళ్లను చెరిపేసేలా సర్కారు చేస్తున్న కుట్రను ప్రజలకు తెలియజెప్పేందుకు రేపు వైఎస్ అభిమానులు, పార్టీ నాయకులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు’ అని ట్వీట్ చేసింది.

రెండేళ్లలో కర్ణాటక CM సిద్దరామయ్య విమాన ప్రయాణానికి రూ.31 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. ఢిల్లీకి రానుపోనూ విమాన ఛార్జీ రూ.70 వేలకు మించదని, అలాంటిది ఛార్టర్ ఫ్లైట్‌లో వెళ్తూ ఒక ట్రిప్‌కే రూ.44.40 లక్షలు వృథా చేస్తున్నారని మండిపడుతోంది. రూ.10.85 లక్షలు ఖర్చు చేసి బెంగళూరు నుంచి మైసూరుకు కూడా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారని విమర్శిస్తోంది.

AP: గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ ఛైర్మన్ కాంతారావు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు 2 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి, రూ.18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంస్థలో భారీగా నల్లధనం చేరుతున్నట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. లావాదేవీలపై స్పష్టత కోసం కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ‘బ్రౌన్ రైస్(దంపుడు బియ్యం)లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. అధిక ఫైబర్ ఉన్న బ్రౌన్ రైస్ ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఇది బ్లడ్‌లో షుగర్ స్థాయులను స్థిరంగా ఉంచడమే కాకుండా మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది’ అని తెలిపారు. SHARE IT

AP: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఈ నెల 21న ఉ.10 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే రోజు మ.3గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల మే నెల కోటా టికెట్లు రిలీజ్ అవుతాయి. అలాగే, మార్చి 22న ఉ.10 గంటలకు జూన్ నెల అంగప్రదక్షిణం టోకెన్లు, అదే రోజు ఉ.11 గంటలకు మే నెల శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను TTD విడుదల చేయనుంది.

TG: హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఘాటుగా స్పందించింది. పేద, మధ్య తరగతి ప్రజలే దాని లక్ష్యమా? అని ప్రశ్నించింది. పెద్దల అక్రమ భవనాలనూ కూల్చినప్పుడే భూములను రక్షించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉందా? అని నిలదీసింది. దుర్గంచెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలగించలేదని దుయ్యబట్టింది. మీరాలం చెరువు పరిసరాల్లో ఆక్రమణలుంటే చర్యలు తీసుకోవాలంది.

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. దీంతో ఆమె పూర్వీకుల గ్రామం ఝూలాసన్‌లో బంధువులు సంబరాలు చేసుకున్నారు. 9 నెలల తర్వాత సునీత సేఫ్‌గా భూమిపైకి తిరిగిరావడం సంతోషంగా ఉందని ఆమె సోదరి ఫాల్గుణి పాండ్య తెలిపారు. తామంతా ఓ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇందులో పాల్గొనేందుకు సునీత ఇండియాకు వస్తారని పేర్కొన్నారు.

AP: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. ప్రజలు చెల్లించిన పన్నుల్లో రూపాయి కూడా అమరావతికి ఖర్చు చేయొద్దని సీఎం ఆదేశించారన్నారు. దీని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ADB రూ.15,000 కోట్లు, హడ్కో రూ.15వేల కోట్లు, కేఎఫ్ డబ్ల్యూ రూ.5వేల కోట్ల రుణం దశలవారీగా తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో రూ.31,600 కోట్లు వెచ్చిస్తామని మండలిలో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.