news

News March 18, 2025

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. 325 పాయింట్లు లాభ పడిన నిఫ్టీ 22,824 వద్ద ట్రేడ్‌ను ముగించింది. మరోవైపు, 1131 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 75,301 వద్ద ముగిసింది. అశోక్ లేల్యాండ్, వేదాంత, డీఎల్ఎఫ్, జిందాల్ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించాయి.

News March 18, 2025

ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ

image

AP: సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి ఒక రోజు సీఐడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. మరోసారి ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది.

News March 18, 2025

భార్య, అత్త వేధింపులు.. భర్త ఆత్మహత్య

image

TG: భార్యల వేధింపులతో తనువు చాలిస్తున్న భర్తల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా HYDలో అబ్దుల్ జమీర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరివేసుకున్నాడు. భార్య, అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని అతను స్నేహితులతో చెప్పుకునేవాడని సమాచారం. అబ్దుల్ సూసైడ్ చేసుకున్న రోజు ఇంట్లో వారిద్దరూ ఉన్నారని, అతను చనిపోయాక అనంతపురానికి వెళ్లారని తెలుస్తోంది. శనివారం ఈ ఘటన జరగగా సోమవారం చెడువాసన రావడంతో విషయం బయటికొచ్చింది.

News March 18, 2025

IPL-2025: తక్కువ జీతమున్న కెప్టెన్ ఇతడే!

image

మరికొన్ని రోజుల్లో IPL-2025 మొదలుకానుండగా కెప్టెన్ల జీతాలపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందులో అత్యధికంగా LSG కెప్టెన్ పంత్ రూ.27 కోట్లు జీతం పొందనున్నారు. అలాగే అత్యల్పంగా KKR కెప్టెన్ రహానె రూ.1.5 కోట్లు తీసుకోనున్నారు. పంత్ తర్వాత అయ్యర్(PBKS) రూ.26.75Cr, గైక్వాడ్ (CSK) ₹18 Cr, సంజూ(RR) ₹18Cr, కమిన్స్(SRH) ₹18Cr, అక్షర్(DC) ₹16.50 Cr, గిల్(GT) ₹16.50Cr, పాండ్య(MI) ₹16.35Cr, రజత్(RCB) ₹11Cr.

News March 18, 2025

అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం

image

AP: అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాఫీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు స్వయంగా పవన్‌కు కాఫీ అందించారు. దీంతో అక్కడున్నవారంతా చిరునవ్వులు చిందించారు. కాగా <<15795599>>పార్లమెంటులోనూ<<>> అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటుకు ఆమోదం లభించింది.

News March 18, 2025

ఏప్రిల్ 11న ‘ఆదిత్య 369’ రీరిలీజ్!

image

సోషియో ఫాంటసీ చిత్రం ‘ఆదిత్య 369’ మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు పాత్రల్లో బాలకృష్ణ నటనను మరోసారి థియేటర్లలో ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?

News March 18, 2025

విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

image

AP: కాకినాడ పోర్టు షేర్ల బదలాయింపు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ నెల 12న ఆయన తొలిసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

News March 18, 2025

క్రిమినల్ కేసుల్లో టీడీపీ ఎమ్మెల్యేలదే అగ్రస్థానం: ADR

image

దేశంలో క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల జాబితాలో టీడీపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. 134 మందికిగాను 115 మంది(86%)పై క్రిమినల్ కేసులు, 82 మంది(61%)పై తీవ్రమైన కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇక 1,653 మంది బీజేపీ ఎమ్మెల్యేలకుగాను 638 మంది(39%)పై కేసులు ఉన్నట్లు పేర్కొంది. 52 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల(339/646)పై, 41% TMC(95/230) ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయంది.

News March 18, 2025

‘దమ్ముంటే పట్టుకోరా’.. ఇన్విజిలేటర్‌కు సవాల్

image

AP: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతున్న వేళ ఓ పరీక్షా కేంద్రం వద్ద రాసిన రాతలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. శ్రీకాకుళం (D) టెక్కలిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్’ అనే రాతలు కనిపించాయి. దీన్ని చూసిన ఇన్విజిలేటర్లు మండిపడ్డారు. ఇది ఆకతాయిల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ పిచ్చిరాతలపై మీ COMMENT.

News March 18, 2025

సునీత.. మీరు భారత్ రావాలి: ప్రధాని మోదీ

image

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు PM మోదీ లేఖ రాశారు. తొలుత భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపిన ఆయన వేల మైళ్ల దూరంలో ఉన్నా ఎప్పుడూ తమ హృదయాలకు దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. తానెప్పుడు బైడెన్, ట్రంప్‌ను కలిసినా సునీత బాగోగుల గురించి అడిగినట్లు తెలిపారు. భూమి మీదకు తిరిగొచ్చిన తర్వాత భారత్‌ సందర్శనకు రావాలని కోరారు. తనకు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తామని మోదీ తెలిపారు.