news

News March 18, 2025

SHOCKING.. మోమోస్ తయారీ కేంద్రంలో కుక్క మాంసం!

image

పంజాబ్‌లో మటౌర్‌లోని ఓ ఫ్యాక్టరీలో కుక్క మాంసం కలకలం రేపింది. మోమోస్, స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో అధికారులు తనిఖీలు చేయగా ఫ్రిడ్జిలో కుక్క తల కనిపించింది. దీంతో పాటు కొంత మాంసాన్ని గుర్తించారు. ఆ తలను టెస్టుల కోసం పంపించారు. కాగా ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా చోట్లకు మోమోస్, స్ప్రింగ్ రోల్స్ పంపిస్తారని సమాచారం. మోమోస్ తయారీలో కుక్క మాంసాన్ని ఉపయోగించారా? అనేది తెలియాల్సి ఉంది.

News March 18, 2025

జపాన్‌లో ‘దేవర’ స్పెషల్ షోకు అనూహ్య స్పందన

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా జపాన్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈనెల 28న జపాన్‌లో ‘దేవర’ రిలీజ్ కానుండగా మేకర్స్ స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. దీనికి భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. మూవీ అద్భుతంగా ఉందంటూ వారు SMలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్, మేకర్స్ ఈనెల 22న జపాన్‌కు వెళ్లనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.

News March 18, 2025

అలా చేస్తే పృథ్వీ షాను మించిన వారు లేరు: శశాంక్ సింగ్

image

ముంబై క్రికెటర్ పృథ్వీషాపై పంజాబ్ కింగ్స్ ఫినిషర్ శశాంక్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ‘షాతో నాకు 13ఏళ్ల పరిచయం. జైస్వాల్, గిల్ వంటివారు మంచి ఆటగాళ్లే. కానీ షా గనుక తిరిగి తన బ్యాటింగ్ బేసిక్స్‌ను గుర్తుతెచ్చుకుని ఆడితే తనను మించినవారు లేరు. కష్టం, ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ఆటిట్యూడ్.. వీటి విలువ తెలుసుకుని తను గాడిలో పడాలి’ అని అభిలషించారు.

News March 18, 2025

నేటి నుంచే అంగన్వాడీల్లో ఒంటి పూట: మంత్రి

image

AP: ఎండల తీవ్రత నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచే ఒంటి పూట అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం 8 నుంచి 12 వరకు పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

News March 18, 2025

మంచు లక్ష్మి, కాజల్‌, రానాపై కేసుకు డిమాండ్!

image

టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చొరవతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న కూడా 11 మందిపై కేసు నమోదైంది. అయితే, మంచు లక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని విమర్శలొస్తున్నాయి. బెట్టింగ్ యాప్ యాడ్స్‌లో నటించిన రానా, కాజల్, ప్రకాశ్‌రాజ్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 18, 2025

సెలబ్రిటీలపై కేసు.. పోలీసుల కీలక ఆదేశాలు

image

TG: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌, శ్యామల, కిరణ్ గౌడ్‌, సన్నీ యాదవ్‌, సుధీర్ రాజు, అజయ్‌ ఉన్నారు.

News March 18, 2025

రేపు బిల్‌ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఇంట్లో జరిగే వివాహ వేడుకకు హాజరుకానున్నారు. రేపు ఆయన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్‌గేట్స్‌తో భేటీ కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సహకారంపై చర్చించనున్నారు. పలు ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. రేపు సాయంత్రం CBN తిరిగి అమరావతికి రానున్నారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.

News March 18, 2025

పిటిషనర్‌కు షాకిచ్చిన హైకోర్టు.. రూ.కోటి జరిమానా

image

TG: హైకోర్టును తప్పు దోవ పట్టించాలని చూసిన ఓ వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని దాచి వేరే బెంచ్‌లో ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ సీరియస్ అయ్యారు. హైకోర్టును తప్పు దోవ పట్టించేలా పిటిషన్ వేసినందుకు రూ.కోటి జరిమానా విధించారు. దీంతో అక్రమ మార్గాల్లో ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలన్న పిటిషనర్‌కు కోర్టు చెక్ పెట్టింది.

News March 18, 2025

వీకెండ్‌లోపు రూ.50 కోట్ల క్లబ్‌లోకి ‘కోర్టు’ మూవీ!

image

నేచురల్ స్టార్ నాని నిర్మించిన ప్రతి సినిమా సక్సెస్ అవుతోంది. తాజాగా ఆయన నిర్మించిన ‘కోర్టు’ సినిమా విమర్శల ప్రశంసలు పొంది భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం నిన్న రూ. 4 కోట్ల వరకు వసూలు చేయడంతో నాలుగు రోజుల్లో రూ.28.9 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ వీక్‌లో రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది. ‘వాల్ పోస్టర్ సినిమా’ నుంచి వచ్చిన awe, hit1&2, కోర్టు భారీ విజయాలను అందుకున్నాయి.

News March 18, 2025

సిRAW: తప్పెవరిది? లోపం ఎక్కడుంది..?

image

‘<<15797491>>JNTUH సెమిస్టర్-1లో 75% స్టూడెంట్స్ ఫెయిల్<<>>’ అనే విషయం అనేక ప్రశ్నల్ని సంధిస్తోంది. ఇంటర్ వరకు బాగా చదివేందుకు అప్పటివరకు ఉన్న పర్యవేక్షణ, కాలేజీల ఒత్తిడి కారణమా? లేక బట్టీ విధానమా? బీటెక్‌లోకి రావడంతోనే వచ్చిన స్వేచ్ఛా రెక్కలతో విహరిస్తున్నారా? తల్లిదండ్రుల కోసం తప్పక చేరిన MPCని ఎలాగోలా గట్టెక్కి ఇక్కడ తేలిపోతున్నారా? కారణమేదైనా కాబోయే ఇంజినీర్ల నుంచి కాంక్షించేది ఇది కాదు.