news

News March 18, 2025

హౌతీల వల్ల నెలకు 800 మిలియన్ డాలర్ల నష్టం: ఈజిప్ట్

image

సూయజ్ కెనాల్‌లో నౌకల్ని హౌతీ రెబెల్స్ అడ్డుకుంటుండటం వల్ల తమకు నెలకు 800 మిలియన్ డాలర్ల నష్టం వస్తోందని ఈజిప్ట్ అధ్యక్షుడు సిసీ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కాగా.. యెమెన్‌లోని హౌతీలపై అమెరికా ముమ్మర దాడుల్ని కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 24మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వారిలో 9మంది పౌరులున్నారని యెమెన్ ఆరోగ్యశాఖ చెబుతోంది.

News March 18, 2025

నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

image

TG: ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. నిన్న ఈ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. దీంతో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

News March 18, 2025

టీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే

image

తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో పొత్తు సరికాదన్నారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఖరుల మధ్య తేడాలుంటాయని పేర్కొన్నారు.

News March 18, 2025

నెలకు రూ.5,000.. UPDATE

image

యువతకు నైపుణ్యాన్ని అందించి ఉపాధి కల్పనే లక్ష్యంగా తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి కేంద్రం ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రారంభించారు. యువతను ఇందులో భారీగా చేరేలా ప్రోత్సహించాలని MPలకు సూచించారు. ఇంటర్న్‌కు ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు రూ.5వేలు ఇవ్వనున్నారు. ఈ పథకం <<15723056>>రెండో దశ దరఖాస్తు గడువును<<>> కేంద్రం ఈ నెల 31 వరకు పొడిగించింది.

News March 18, 2025

7 సెకన్లలోనే గుండె జబ్బుల నిర్ధారణ.. NRIకి సీఎం ప్రశంసలు

image

AP: గుండె జబ్బులను నిర్ధారించే సిర్కాడియావీ యాప్‌ను రూపొందించిన NRI విద్యార్థి సిద్ధార్థ్(14) CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్‌ను కలిశారు. యాప్ గురించి అడిగి తెలుసుకున్న సీఎం విద్యార్థిని ప్రశంసించారు. వైద్యరంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ యాప్‌ను సిద్ధార్థ్ ఏఐ సాయంతో రూపొందించారు. దీంతో ఇప్పటికే గుంటూరు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు.

News March 18, 2025

రేపు భూమిపై అడుగుపెట్టనున్న సునీతా విలియమ్స్

image

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రేపు భూమి మీదకు రానున్నారు. మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్‌తో కలిసి ఉదయం 3.27నిమిషాలకు భూమిపైకి చేరుకుంటారని నాసా ప్రకటించింది. వీరు ప్రయాణించే వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో గల సాగర జలాల్లో దిగుతుందని వివరించింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉ. 8:15 గంటలకు వీరి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

News March 18, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరింది.

News March 18, 2025

బీటెక్ ఫస్టియర్ రిజల్ట్.. 75% విద్యార్థులు ఫెయిల్!

image

TG: జేఎన్టీయూహెచ్ అనుబంధ కాలేజీల బీటెక్ ఫస్టియర్ సెమిస్టర్ ఫలితాల్లో 75 శాతం మంది కనీసం ఒక్క సబ్జెక్ట్ ఫెయిలయ్యారు. మొత్తం 40 వేల మంది విద్యార్థుల్లో 10వేల మంది(25%) మాత్రమే అన్ని సబ్జెక్టులూ పాసైనట్లు సమాచారం. అత్యధికంగా మ్యాథ్స్(M1), డ్రాయింగ్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారని తెలుస్తోంది. ఫస్ట్ సెమిస్టర్(రెగ్యులర్), రెండో సెమిస్టర్(సప్లిమెంటరీ) ఫలితాలు వెబ్‌సైట్‌లో ఉంచారు.

News March 18, 2025

రెండు రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

image

TG: రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లా బేలలో గరిష్ఠంగా 42 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 21 నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.

News March 18, 2025

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మళ్లీ మొదలు!

image

ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య కుదిరిన సీజ్‌ఫైర్ ఒప్పందం నేటితో ముగిసింది. ఇరు వర్గాలూ పొడిగించకపోవడంతో యుద్ధం మళ్లీ మొదలైంది. హమాస్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ గగనతల దాడులు ప్రారంభించగా పిల్లలు సహా 34మంది మరణించారు. పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయమిస్తున్న పాఠశాలపైనా అటాక్ చేసింది. అటు లెబనాన్, సిరియాల్లోని దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 10 మంది చనిపోయారు.