news

News March 18, 2025

TODAY HEADLINES

image

* ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
* CM చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
* 11 మంది సెలబ్రిటీలపై కేసులు
* ఏ ప్రభుత్వమూ ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్
* అప్పుడు నావల్లే పార్టీ ఓడిపోయింది: చంద్రబాబు
* సీనియర్ నటి బిందు ఘోష్ కన్నుమూత
* వైసీపీ పాలనలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి: పవన్
* TG ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం: TTD

News March 18, 2025

ఓయూలో ఆంక్షలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

image

TG: ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై ప్రభుత్వం నిషేధం విధించడం అప్రజాస్వామికమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుల హక్కులకు సంబంధించిన ఎన్నో పోరాటాల్లో కీలకపాత్ర పోషించింది ఓయూ విద్యార్థులే అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అని, పోలీసుల పహారాలో ఆ హక్కును అణచివేయాలని చూస్తే తెలంగాణ సమాజం అంగీకరించదని హెచ్చరించారు.

News March 18, 2025

మొబైల్ రేడియేషన్ పెరిగితే.. ప్రమాదమే!

image

సెల్‌ఫోన్‌ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్. SAR ప్రకారం రేడియేషన్ కిలోగ్రాముకు 1.6వాట్‌లకు మించొద్దు. *#07# డయల్ చేసి రేడియేషన్ చెక్ చేయొచ్చు. పక్షులు, చెట్లపై కూడా ఇది ప్రభావం చూపుతుంటుంది. రేడియేషన్ వల్ల చర్మ వ్యాధులొస్తాయి. NCBI సర్వే ప్రకారం రేడియేషన్ కారణంగా ముఖంపై మచ్చలు, కళ్ల చుట్టూ వలయాలొస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఎదురవ్వొచ్చు. SHARE IT

News March 18, 2025

డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదు: KTR

image

TG: డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని కేటీఆర్ అన్నారు. ‘దేశంలో అందరికంటే ముందు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకి, దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి మాట్లాడింది మా పార్టీనే. డీలిమిటేషన్ విషయంలో కేంద్రంపై పోరాడుతాం. ఈనెల 22న చెన్నైలో జరిగే డీఎంకే సమావేశానికి హాజరై, మా పార్టీ విధానాన్ని బలంగా వినిపిస్తా’ అని తెలిపారు.

News March 18, 2025

ఉగ్రవాదులపై దాడులు.. నెక్స్ట్ టార్గెట్ అతడేనా?

image

PAKలో లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్ హతమవడంతో ఆ సంస్థకు పెద్ద దెబ్బే తగిలింది. అయితే తర్వాతి దాడి LET వ్యవస్థాపకుడు, 26/11 దాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌పైనే జరిగే ఛాన్సుందని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 2023 రాజౌరి, 2024 రియాసి దాడుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఖతల్‌ను శనివారం గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడులు LET ఆపరేషన్స్‌ను దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు.

News March 17, 2025

పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటుకు అనుమతి

image

పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 2 కాంప్లిమెంటరీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్‌సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. సంగం, నలంద లైబ్రరీ వద్ద వాటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు AP MP కలిశెట్టికి లోక్‌సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ లేఖ రాశారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు TDP ఎంపీలు గతంలో లోక్‌సభ స్పీకర్‌ను కోరగా తాజాగా అనుమతి లభించింది.

News March 17, 2025

రన్యారావు కేసులో మరో ట్విస్ట్

image

బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో అరెస్టైన నటి రన్యా రావు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య రన్యా రావుతో తనకు సంబంధం లేదని ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టులో పిటిషన్ వేశారు. తమకు గతేడాది నవంబర్‌లో పెళ్లి కాగా, డిసెంబర్ నుంచే తాము వేర్వేరుగా ఉంటున్నామని తెలిపారు. ఈ కేసులో తనను అరెస్ట్ నుంచి మినహాయించాలని పేర్కొన్నారు. కాగా ఇదే కేసులో జతిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు.

News March 17, 2025

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ

image

TG: ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు లేఖ రాశారు. అఖిల పక్ష నేతలతో కలిసి ఆయనతో భేటీ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతుతో పాటు అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా చొరవ చూపాలని కోరేందుకు రేవంత్ పీఎంకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

News March 17, 2025

రాత్రి ఈ టెక్నిక్స్ పాటిస్తే..

image

త్వరగా నిద్రపోయేందుకు ఇటీవల చాలామంది మిలిటరీ మెథడ్ ఫాలో అవుతున్నారు. తక్కువ సమయంలో నిద్రకు సైనికులు పాటించే ఈ విధానంతో 10 సెకన్లలోనే నిద్ర వస్తుందట. పడుకుని ముఖంలోని కండరాలతో పాటు భుజాలు, చేతులు, కాళ్లు సహా శరీరాన్నంతా వదులుగా ఉంచాలి. దీర్ఘ శ్వాసలతో పది సెకన్ల పాటు ప్రశాంత ఘటనను ఆలోచిస్తూ కళ్లు మూసుకోవాలి. ఒకవేళ నిద్ర రాలేదంటే మనసులోకి వచ్చే ఆలోచనలను ‘ఆలోచించకు’ అని ఆపేస్తూ తిరిగి ప్రయత్నించాలి.

News March 17, 2025

ఏడు వారాల నగలంటే ఏంటో తెలుసా?

image

ప్రతి మహిళకు ఏడువారాల నగలు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ చాలా మందికి 7 వారాల నగలేంటో తెలియదు. ఆదివారం(సూర్యుడు) ధరించేవి కెంపుల కమ్మలు & హారాలు, సోమవారం(చంద్రుడు) ముత్యాల హారం & గాజులు, మంగళవారం(కుజుడు) పగడాల దండలు& ఉంగరాలు, బుధవారం(బుధుడు) పచ్చల పతకాలు& గాజులు, గురువారం(బృహస్పతి) పుష్యరాగం& కమ్మలు& ఉంగరాలు, శుక్రవారం(శుక్రుడు) వజ్రాల హారాలు& వజ్రపు ముక్కుపుడక, శనివారం(శని) నీలమణి హారాలు. share it