India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్‌లో పర్యటిస్తారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 22,549 (+153), సెన్సెక్స్ 74,275 (+470) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్, ఆటో, మెటల్, ఎనర్జీ, PSE, CPSE, వినియోగం, చమురు, బ్యాంకు షేర్లకు గిరాకీ ఉంది. మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు ఎగిశాయి. ఇండస్‌ఇండ్, బజాజ్ ట్విన్స్, SBI లైఫ్, Dr రెడ్డీస్ టాప్ గెయినర్స్. నెస్లే, BPCL టాప్ లూజర్స్.

TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్ తోడవ్వడంతో తారాస్థాయికి చేరింది. తాజాగా పలువురు నెటిజన్లు వీటిని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి సజ్జనార్ తోడవ్వడంతో ప్రమోటర్స్‌పై ప్రభుత్వం చర్యలకు దిగింది.

TG: బీజేపీ ఎంపీ డీకే అరుణ <<15780375>>ఇంట్లో ఆగంతకుడు<<>> ప్రవేశించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులను సీఎం ఆదేశించారు. భద్రత పెంచాలని పోలీస్ శాఖకు సూచించారు.

చివరి మూడేళ్లలో ఏటా బంగారం 17% రాబడి అందించింది. ఔన్స్ రేటు $3000ను తాకడంతో ప్రాఫిట్ బుక్ చేసుకోవడంపై ఇన్వెస్టర్లు సందిగ్ధంలో పడ్డారు. Sensex to Gold రేషియోను బట్టి నిర్ణయించుకోవడం బెటర్ అంటున్నారు Edelweiss SVP నిరంజన్ అవస్థి. 1999 నుంచి ఈ రేషియో 1కి దిగువన ఉంటే తర్వాతి మూడేళ్లలో ఈక్విటీస్, 1 కన్నా ఎక్కువుంటే తర్వాతి మూడేళ్లలో గోల్డ్ రాణిస్తోంది. ప్రస్తుతమిది లాంగ్‌టర్మ్ సగటు 0.96కు దిగువన ఉంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. మెగాస్టార్‌తో తీయబోయే మూవీ స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. సినిమా కథలకు వైజాగ్‌ను తాను సెంటిమెంట్‌గా భావిస్తానని చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ సెలవు ఉంది. రంజాన్ హాలిడేలో ఏదైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పు చేయనున్నారు. అంటే మార్చి 31 లేదా ఏప్రిల్ 1న నిర్వహిస్తామని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. అటు తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వెంకన్నను 82,721 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు సమకూరింది.

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిన్న అనకాపల్లి జిల్లా నాతవరంలో అత్యధికంగా 42.1 డిగ్రీలు నమోదైంది. ఇవాళ 202 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, పల్నాడు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, ఏలూరు, కృష్ణా, విజయనగరం, అల్లూరి, కోనసీమ, NTR, పశ్చిమగోదావరి, వైజాగ్, బాపట్లలో వడగాలులు వీస్తాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.