news

News March 15, 2025

జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: BRS ఎమ్మెల్యేలు

image

TG: ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో హరీశ్ రావు, తలసాని, మాధవరం కృష్ణారావు, సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద ఆయనను కలిశారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయమని వారు పేర్కొన్నారు. స్పీకర్‌ను ఏకవచనంతో పిలవలేదని, సభా సంప్రదాయాలను ఆయన ఉల్లంఘించలేదని వారు తెలిపారు.

News March 15, 2025

‘కోర్టు’ సినిమాలోని ఈ అమ్మాయి ఎవరు?

image

నిన్న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘కోర్టు’ మూవీలో ‘జాబిలి’ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ‘శ్రీదేవి అపళ్ల’. స్వస్థలం కాకినాడ. ఆమెను ఓ ఇన్‌స్టా రీల్‌లో చూసిన డైరెక్టర్ రామ్ జగదీశ్ ఫ్రెండ్ యువరాజ్ ఆమెను ఆడిషన్‌కు రిఫర్ చేశారు. అలా కోర్టు మూవీలో ఛాన్స్ వచ్చినట్లు శ్రీదేవి తెలిపారు.

News March 15, 2025

టెస్టు క్రికెట్‌కి ‘హ్యాపీ బర్త్ డే’

image

టెస్టు క్రికెట్ మొదలై నేటికి 148ఏళ్లు పూర్తయింది. 1877, మార్చి 15న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆ దేశానికి, ఇంగ్లండ్‌కు మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆల్ఫ్రెడ్ షా(ENG) తొలి బంతి వేయగా, ఛార్ల్స్ బ్యానర్‌మ్యాన్(AUS) ఆడారు. ఆయనే తొలి టెస్టు పరుగు, తొలి సెంచరీ చేశారు. తొలి వికెట్‌ను అలాన్ హిల్(ENG) తీశారు.

News March 15, 2025

షాకింగ్.. పెళ్లయిన వారిలోనే ఆ సమస్య ఎక్కువ

image

పెళ్లికి ముందుతో పోలిస్తే తర్వాతే మగవాళ్లు లావెక్కుతారని పొలాండ్‌లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు తేల్చారు. మహిళల్లో ఇది 39 శాతమే ఉంటుందని చెప్పారు. సింగిల్స్‌తో పోలిస్తే పెళ్లయిన పురుషుల్లో ఊబకాయం సమస్యను మూడు రెట్లు పెంచుతుందని అధ్యయనంలో తెలిపారు. తినే ఆహార పరిమాణం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటివి కారణాలుగా అభిప్రాయపడ్డారు.

News March 15, 2025

బుమ్రా తెలివిగా ఆలోచించాలి: మెక్‌గ్రాత్

image

గాయాల విషయంలో భారత బౌలర్ బుమ్రా తెలివిగా వ్యవహరించాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మెక్‌గ్రాత్ సూచించారు. ‘తను యువకుడు కాదు. వయసు పెరిగే కొద్దీ ఫాస్ట్ బౌలర్లకు గాయాల ప్రమాదం మరింత ఎక్కువ. నేను తక్కువ వేగంతో బౌలింగ్ చేసేవాడిని కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్లు అప్రమత్తంగా ఉండాలి. జిమ్‌లో శరీరాన్ని దృఢపరచుకోవాలి. భారత్‌కు అతడి సేవలు అత్యవసరం’ అని పేర్కొన్నారు.

News March 15, 2025

సిRAW: భావోద్వేగాలే.. బాగోగుల్లేవిక్కడ

image

ఎన్నికలంటే ఐదేళ్ల ప్రోగ్రెస్ కార్డుతో ప్రచారాలుండాలి. ఇటీవల పాలకులు ప్రాంతం, జాతి, మతం, భాష అని ఎమోషనల్ కార్డు ప్లే చేస్తున్నారు. భావోద్వేగ డ్రామాతో పోల్ ఘట్టం గట్టెక్కేస్తున్నారు. ప్రశ్నించాల్సిన విపక్షాలూ కుర్చీ కోసం ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అని పండగ సేల్‌లా ఆఫర్లిస్తున్నాయి. ప్రజల కోసం ఫలానా చేశామని చెప్పట్లేదు. ఎవరికి పవర్ వచ్చినా ప్రసాదం తినలేని ప్రజాస్వామ్య దేవుళ్లకే ఎగనామం. ఏమంటారు ఫ్రెండ్స్?

News March 15, 2025

అమ్మానాన్నా.. ఆలోచించండి!

image

ఆర్థిక, మానసిక ఇబ్బందులతో ఎంతోమంది బలవన్మరణాలపాలవుతున్నారు. పిల్లలున్నవారు బిడ్డల్నీ చంపేస్తున్నారు. <<15717792>>హబ్సిగూడ<<>>, <<15765431>>కాకినాడ<<>> ఘటనలు అందర్నీ కలచివేస్తున్నాయి. పసిప్రాణాలను చిదిమేసే హక్కు తల్లిదండ్రులకు లేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మీ కష్టాలకు మీ పసివాళ్లను కూడా బలిచేయడం ఎంతవరకూ న్యాయమో అమ్మానాన్నలు ఆలోచించాలని కోరుతున్నారు.
*సమస్య ఎలాంటిదైనా ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదు.

News March 15, 2025

‘ప్రపంచంతో పోటీ పడటంలేదు.. నా పిల్లల్ని చంపేస్తున్నా’

image

AP: 1వ తరగతి, UKG చదివే ఇద్దరు పిల్లల్ని అత్యంత క్రూరంగా హతమార్చాడో తండ్రి. ఈ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని, చంపేస్తున్నానంటూ సూసైడ్ నోట్ రాశాడు. కాకినాడ(D) సర్పవరం ONGCలో పనిచేస్తున్న చంద్రకిశోర్ భార్య, పిల్లలతో కలిసి నిన్న ఆఫీస్‌లో హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. తర్వాత పిల్లలను ఇంటికి తీసుకెళ్లి కాళ్లూ చేతులు తాళ్లతో కట్టేసి, నీటి బకెట్లో తలలు ముంచి చంపేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 15, 2025

సౌతాఫ్రికా రాయబారికి ట్రంప్ సర్కారు షాక్

image

తమ దేశంలోని దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్‌కు ట్రంప్ సర్కారు షాకిచ్చింది. ఆయన తమ దేశంలో ఉండటానికి వీల్లేదని, వెంటనే స్వదేశానికి పయనమవ్వాలని తేల్చిచెప్పింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘ఇబ్రహీం ఓ జాత్యహంకార రాజకీయ నేత. అమెరికన్లను, మా అధ్యక్షుడిని ద్వేషిస్తున్నారు. ఆయనతో మాట్లాడేదేం లేదు. దేశం నుంచి పంపించేయడమే’ అని పేర్కొన్నారు.

News March 15, 2025

హిందీ భాషపై కామెంట్స్.. పవన్‌పై వైసీపీ విమర్శలు

image

AP: జయకేతనం సభలో ‘హిందీ మన భాషే కదా?’ అన్న పవన్ <<15763560>>కళ్యాణ్‌పై<<>> YCP విమర్శలు గుప్పిస్తోంది. అప్పట్లో ‘హిందీ గో బ్యాక్’ అనే పేపర్ ఆర్టికల్‌ను పవన్ ట్వీట్ చేయడాన్ని గుర్తుచేస్తోంది. ఆ ఆర్టికల్‌పై స్పందించిన ఆయన ‘నార్త్ ఇండియా రాజకీయ నేతలు మనదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకొని, గౌరవించాలి’ అని రాసుకొచ్చారు. మరి ఇప్పుడేమో జనసేనానికి హిందీపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అంటూ ప్రశ్నలు సంధిస్తోంది.