News March 15, 2025
టెస్టు క్రికెట్‌కి ‘హ్యాపీ బర్త్ డే’

టెస్టు క్రికెట్ మొదలై నేటికి 148ఏళ్లు పూర్తయింది. 1877, మార్చి 15న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆ దేశానికి, ఇంగ్లండ్‌కు మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆల్ఫ్రెడ్ షా(ENG) తొలి బంతి వేయగా, ఛార్ల్స్ బ్యానర్‌మ్యాన్(AUS) ఆడారు. ఆయనే తొలి టెస్టు పరుగు, తొలి సెంచరీ చేశారు. తొలి వికెట్‌ను అలాన్ హిల్(ENG) తీశారు.
Similar News
News April 19, 2026
‘జైలర్-2’కు రికార్డ్ బ్రేకింగ్ OTT డీల్?

రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. మొదటి పార్ట్ కంటే రెట్టింపు ధరకు డీల్ కుదరడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.
News April 19, 2026
అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
News April 19, 2026
వీళ్లు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగొద్దు!

ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగితే ఆయా అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి కడుపులో ఇబ్బంది కలగొచ్చు. ఒంట్లో నీరు చేరి వాపులు వచ్చే వారు కూడా వైద్యుల సలహా మేరకే నీటిని తీసుకోవాలి.


