news

News March 14, 2025

తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి: పవన్ కళ్యాణ్

image

AP: హిందీని తమిళనాడు వ్యతిరేకించడంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘అలా అయితే తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. నార్త్ సినిమాల నుంచి డబ్బులు కావాలి గానీ భాషలు వద్దా? భాషలపై వివక్ష ఎందుకు? సంస్కృతం, హిందీ మన భాషలే కదా? పనిచేసేవాళ్లు బిహార్ నుంచి రావాలి కానీ హిందీ మాత్రం వద్దా?’ అని పవన్ ప్రశ్నించారు.

News March 14, 2025

‘జియో హాట్‌స్టార్’ కీలక నిర్ణయం.. వారికి షాక్?

image

జియో, స్టార్ నెట్‌వర్క్, కలర్స్ టీవీల ప్రోగ్రామ్స్‌ను చాలామంది యూట్యూబ్‌లో చూస్తుంటారు. వారికి ‘జియో హాట్‌స్టార్’ షాకివ్వనుంది. ఆ సంస్థ యూట్యూబ్‌లో ఉన్న కంటెంట్‌ను తొలగించనుందని ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం.. తమ యాప్‌, శాటిలైట్ టీవీల్లో తప్ప వేరే ఏ స్ట్రీమింగ్ వేదికపైనా తమ కంటెంట్ రాకూడదని జియో హాట్‌స్టార్ భావిస్తోంది. యాప్‌లో చూడాలంటే పేమెంట్ చేయాల్సి ఉంటుందని సమాచారం.

News March 14, 2025

ఈ ఐదు రోజులు జాగ్రత్త!

image

TG: వేసవి వచ్చేసింది. అసలే ఓవైపు ఎండలు దంచికొడుతుంటే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ వెదర్‌మ్యాన్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19 వరకు వేడిమి మరీ ఎక్కువ ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా ఆరుబయట పని చేసే రైతాంగం చాలా అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు. అయితే ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు స్వల్ప ఉపశమనం లభిస్తుందని, ఆ 5 రోజుల పాటు స్వల్ప వర్షపాతం ఉంటుందని తెలిపారు.

News March 14, 2025

నా కంటే మా అన్నయ్యలను నాన్న ఎక్కువ కొట్టేవారు: పవన్

image

AP: సెకండ్ షో సినిమాకు వెళ్లి తన తండ్రి చేతిలో తిట్లు తిన్న తాను కోట్లమందికి సంబంధించిన పాలిటిక్స్ చేయడం భగవంతుడి రాతేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఓ రోజు సెకండ్ షోకు వెళ్లొచ్చేసరికి మా నాన్న కోపంతో ఉన్నారు. ఆయన కొడతారని భయపడ్డా. కానీ నేను హీరోనని, 4 సినిమాలు హిట్లయ్యాయని చెప్పా. ఇంకా ఎక్కువ తిట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే నా కంటే మా అన్నయ్యలను ఆయన ఎక్కువ కొట్టేవారు’ అని చెప్పుకొచ్చారు.

News March 14, 2025

ఫ్యాన్స్‌కి CSK జట్టు ఫ్రీ బస్!

image

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చెన్నైలో జరిగే మ్యాచులు ఆరంభమయ్యే 3 గంటల ముందు ప్రభుత్వ బస్సుల్లో(నాన్ ఏసీ) ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సీజన్ అంతా ఇది వర్తించనుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అభిమానులకు సీఎస్కే చాలా ప్రేమను తిరిగిస్తోందంటూ ఎల్లో ఆర్మీ పొగడ్తలు కురిపిస్తోంది.

News March 14, 2025

వర్తు వర్మ.. ‘వారి కర్మ’

image

AP: పిఠాపురంలో పవన్ గెలుపుపై నాగబాబు చేసిన తాజా <<15761376>>వ్యాఖ్యలు<<>> YCPకి అస్త్రంగా మారాయి. వర్మ సపోర్టు వల్లే తాను అక్కడ గెలిచానని చెప్పిన పవన్ ఇప్పుడు ఆయనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. తీరం దాటాక తెడ్డు తగలేసినట్లు జనసేనాని వ్యవహారం ఉందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అప్పట్లో వర్తు వర్మ అని ఇప్పుడు ’వారి కర్మ’ అంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

News March 14, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

image

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 20 నుంచి 26 వరకు జరగనున్నాయి. థియరీ పరీక్షలు రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మ. 12 గంటల వరకు, రెండో సెషన్ మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు జరుగుతుంది. అటు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభమై మే 3న ముగుస్తాయి.

News March 14, 2025

టాటా కమ్యూనికేషన్స్ ఛైర్మన్‌గా గణపతి సుబ్రహ్మణ్యం

image

తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్‌గా టాటా సంస్థ గణపతి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. నామినేషన్-రెమ్యునరేషన్ కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన 2021లో బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. టీసీఎస్‌లో ఆయన గత 40 ఏళ్లుగా సేవలందించారు. ఆ సంస్థకు సీఓఓగా పనిచేసి గత ఏడాది మేలో పదవీవిరమణ చేశారు.

News March 14, 2025

ఫ్యామిలీతో కలిసి రోహిత్ శర్మ మాల్దీవుల విహారం

image

టీమ్ ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చిపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆ టోర్నీ అనంతరం ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలో గడుపుతున్నారు. భార్యాబిడ్డలతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. దానికి సంబంధించి ఆయన ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వచ్చే 2 నెలల పాటు ఐపీఎల్‌తో తీరిక లేని షెడ్యూల్‌లో ఉండనున్న నేపథ్యంలో ఆయన ఈ బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు మూడురోజుల్లో ఆయన ముంబై జట్టుతో కలవనున్నారు.

News March 14, 2025

గుడ్ల కోసం అమెరికా యాతన, ఈయూకి యాచన

image

అమెరికాను గుడ్ల కొరత వేధిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు భారీగా చనిపోతుండటంతో గుడ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏడాది కాలంలో గుడ్ల ధర ఏకంగా 59శాతం మేర పెరగడం ట్రంప్ సర్కారుపై ఒత్తిడిని పెంచుతోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో ధరలతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్ సహా ఐరోపా సమాఖ్యలోని దేశాలు ఎన్ని వీలైతే అన్ని గుడ్లను పంపించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది.