News March 14, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

image

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 20 నుంచి 26 వరకు జరగనున్నాయి. థియరీ పరీక్షలు రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మ. 12 గంటల వరకు, రెండో సెషన్ మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు జరుగుతుంది. అటు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభమై మే 3న ముగుస్తాయి.

Similar News

News April 20, 2025

ఆసుపత్రిలో ప్రముఖ యాంకర్.. కారణమిదే

image

ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల తనకు సర్జరీ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ హాస్పిటల్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. జనవరి నుంచి రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో ఇబ్బందిపడినట్లు చెప్పారు. వర్క్ కమిట్మెంట్ పూర్తి చేసుకుని ఆసుపత్రిలో చేరితే ఏప్రిల్ 18న సర్జరీ జరిగిందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, మరో 3 వారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు వెల్లడించారు.

News April 20, 2025

వారానికి పైగా తల్లి, సోదరుడి శవాల మధ్య ఇంట్లోనే చిన్నారి

image

న్యూయార్క్‌(US)లోని ఓ ఇంట్లో తల్లి, సోదరుడు మృతిచెందగా నాలుగేళ్ల చిన్నారి శవాల మధ్యే వారానికి పైగా గడిపిన హృదయవిదారక ఘటన ఇది. లీసా(38), నాజిర్(8) అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే మరణించారు. లీసా కూతురు ప్రామిస్‌ ఆ మృతదేహాల మధ్యే ఉండిపోయింది. అసలేం జరిగిందో తెలియని ఆ చిన్నారి కొన్ని రోజులపాటు చాక్లెట్లు తింటూ సర్వైవ్ అయింది. లీసా సోదరి ఇంటికి వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది.

News April 20, 2025

‘నిన్ను చాలా మిస్ అవుతున్నా’.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్

image

తన తల్లి ఇందిరా దేవిని గుర్తుచేసుకుని హీరో మహేశ్‌బాబు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘అమ్మా.. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నా. హ్యాపీ బర్త్‌డే’ అని అమ్మతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. కాగా 2022లో ఇందిరా దేవి చనిపోయిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!