India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగారం ధరలు కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకుంటున్నాయి. తొలిసారిగా నేడు ఔన్స్ (28.35గ్రా) విలువ $3002ను టచ్ చేసింది. ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేసిన $3000 రెసిస్టెన్సీని బ్రేక్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్, డాలర్ తగ్గుదల, ట్రేడ్‌వార్, అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డులో పెట్టుబడి పెట్టడమే ఇందుకు కారణాలు. ప్రస్తుతం HYDలో 24K 10Gr ధర నిన్నటితో పోలిస్తే రూ.1200 పెరిగి రూ.₹89,780 వద్ద ఉంది.

AP: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌కళ్యాణ్ అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు. రాష్ట్ర ఆర్థిక, సంక్షేమాభివృద్ధిలో జనసేన నిబద్ధత అనిర్వచనీయం. ఆ పార్టీ కృషి అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని పేర్కొన్నారు. దీనికి ‘జనసేన జయకేతనం’ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచంలోని అత్యుత్తమ ప్రాంతాలు’ జాబితాలో భారత్ నుంచి జైపూర్ రాఫిల్స్, బాంధవ్‌గఢ్‌లోని ఒబెరాయ్ వింధ్యావిలాస్ వైల్డ్‌లైఫ్ రిసార్ట్స్ చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ అద్భుతమైన ప్రాంతాలని చెప్పిన టైమ్, ముంబైలోని పాపాస్ రెస్టారెంట్‌ను చూడాల్సిన చోటుగా పేర్కొంది. ఈ జాబితాలో మ్యూజియాలు, పార్కులు, పర్యాటక ప్రదేశాలు తదితర ప్రాంతాలను టైమ్ పరిగణించింది.

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా, 3 రోజుల ముందే రిలీజ్ చేశారు. ఇందులో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. ఈ సినిమాతో పాటు రాషా తడానీ, అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘ఆజాద్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

RSS, BJPకి క్షమాపణ చెప్పనని, వాటిపై వ్యాఖ్యలనూ వెనక్కి తీసుకోనని మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ తెలిపారు. అవి రెండూ ప్రమాదకరం, విషపూరితం, దేశానికి అంతర్గత శత్రువులంటూ ఈ మధ్యే ఆయన విమర్శించారు. ఆయన సారీ చెప్పాలని, కేసు నమోదు చేయాలని సంఘ్, BJP నేతలు డిమాండ్ చేశారు. ‘ద్రోహులను మరింత బయటపెట్టాలన్న నా పట్టుదలకు జరిగిన ఘటన బలం చేకూర్చింది. స్వతంత్ర పోరాటం కన్నా ఇదే అతి ముఖ్యం’ అని తుషార్ అన్నారు.

టీజీపీఎస్సీ వరుసగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల చేస్తోంది. మూడు రోజుల క్రితం గ్రూప్-1, రెండు రోజుల కిందట గ్రూప్-2 రిజల్ట్స్ ఇవ్వగా తాజాగా గ్రూప్-3 ఫలితాలు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్‌తో పాటు మాస్టర్స్ క్వశ్చన్ పేపర్స్, ఫైనల్ కీ కూడా విడుదల చేసింది. 1365 గ్రూప్-3 పోస్టులకు గతేడాది నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా 2.69 లక్షల మంది హాజరయ్యారు.
Results PDF: <

ఐపీఎల్-2025 ప్రారంభంలో ముంబై ఆడే కొన్ని మ్యాచులకు బుమ్రా దూరం కానున్నారు. ఏప్రిల్ తొలి వారంలో ఆయన జట్టులో చేరతారని క్రీడా వర్గాలు తెలిపాయి. వెన్ను గాయంతో బాధపడుతున్న ఆయన ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన సంగతి తెలిసిందే. కాగా MI తన తొలి మ్యాచును మార్చి 23న CSKతో ఆడనుంది. ఆ తర్వాత 29న గుజరాత్ టైటాన్స్, 31న KKRతో తలపడనుంది. బుమ్రా లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.

AP: టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తాను ఇలా చెబితే.. వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని వ్యాఖ్యానించారు.

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్‌మెంట్-2) ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న పరీక్షలు ముగుస్తాయని, అనంతరం జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి అదే నెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.

అమెరికాలో NRIలు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మాస్ డీపోర్టేషన్ కోసం వార్‌టైమ్ ఏలియన్స్ చట్టాన్ని ట్రంప్ ప్రతిపాదిస్తుండటం, గ్రీన్‌కార్డు హోల్డర్స్ శాశ్వత నివాసులు కాదని VP JD వాన్స్ చెప్పడాన్ని వారు ఉదహరిస్తున్నారు. లీగల్‌గా అక్కడికి వెళ్లినా తొలి ప్రాధాన్యం వైట్స్‌కేనని అంటున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోకుంటే తరిమేస్తామన్న ట్రంప్ పాలకవర్గం మాటల్ని గుర్తుచేస్తున్నారు. COMMENT.
Sorry, no posts matched your criteria.