news

News March 14, 2025

నాని కేరాఫ్ నయా టాలెంట్

image

నాని హీరోగా తన మార్కు చాటుతూనే నిర్మాతగా అవతారమెత్తారు. కొత్త వారికి అవకాశమిస్తూ సూపర్ హిట్లు ఖాతాలో వేసుకుంటున్నారు. అ!, హిట్, హిట్-2 సినిమాలే దీనికి ఉదాహరణ. తాజాగా ఆ జాబితాలోకి కోర్టు మూవీ చేరిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ, శైలేశ్ కొలను, తాజాగా కోర్టు సినిమాతో రామ్ జగదీశ్‌ వంటి దర్శకులను పరిచయం చేశారు. దీంతో నయా టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో నాని ముందుంటారని అంటున్నారు.

News March 14, 2025

మీరు గొప్పవారు సర్..

image

TG: సిద్దిపేట జిల్లాకు చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ టీచర్ బాల్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 1970 నుంచి 2004 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైనా పాఠాలు చెప్పడం మానట్లేదు. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి, క్యాసారం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రోజూ 15 KM సొంతడబ్బుతో ప్రయాణిస్తూ ఒక్క రూపాయి తీసుకోకుండా విద్యాదానం చేస్తున్నారు.

News March 14, 2025

SRH కెప్టెన్‌ను మార్చితే..!

image

IPL-2025లో పాల్గొనే 10 జట్లలో తొమ్మిదింటికి భారత ప్లేయర్లే కెప్టెన్లుగా ఉన్నారు. ఒక్క SRHకు మాత్రమే ఫారిన్ ప్లేయర్ కమిన్స్ సారథ్యం వహిస్తున్నారు. దీంతో SRHకు కూడా స్వదేశీ కెప్టెన్ ఉంటే బాగుంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జట్టులో తెలుగు ప్లేయర్ అయిన నితీశ్ కుమార్ రెడ్డికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 14, 2025

పబ్లిక్ ఇష్యూకు LG ఇండియా: Rs15000CR

image

రూ.15000 కోట్ల విలువతో IPOకు వచ్చేందుకు సెబీ వద్ద LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అనుమతి తీసుకుంది. ఇదే జరిగితే హ్యుందాయ్ తర్వాత NSE, BSEల్లో నమోదైన సౌత్ కొరియా రెండో కంపెనీగా అవతరిస్తుంది. 15%కి సమానమైన 10.18 కోట్ల షేర్లను OFS పద్ధతిన కేటాయించనుంది. అంటే ఈ పెట్టుబడి నేరుగా LG ఇండియాకు కాకుండా ప్రధాన కంపెనీకి వెళ్తుంది. 2024, MAR 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.64,087 కోట్ల ఆదాయం ఆర్జించింది.

News March 14, 2025

ఆరోగ్య శ్రీ.. ఐదేళ్ల పిల్లలకూ ‘కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’

image

TG: ఆరోగ్య శ్రీ కింద ఇకపై ఐదేళ్ల వయసు పిల్లలకూ ‘కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’ చేయనున్నట్లు ట్రస్ట్ CEO కర్ణన్ సర్క్యులర్ జారీ చేశారు. గతంలో 3yrs వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉండేది. పిల్లల్లో వినికిడి సమస్య నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ సర్జరీ చేస్తారు. దీని వల్ల వినికిడి సమస్య పూర్తిగా తొలగిపోనప్పటికీ కొంత ఉపశమనం ఉంటుంది. ప్రైవేటులో ఈ సర్జరీకి రూ.6-12లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు.

News March 14, 2025

ఈ నెల 19న యూకే పార్లమెంటులో చిరుకు అవార్డు

image

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 19న యూకే పార్లమెంటులో ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నారు. కల్చరల్ లీడర్‌షిప్‌తో ప్రజాసేవకు కృషి చేసినందుకు గానూ ఈ పురస్కారంతో సన్మానించనున్నారు.

News March 14, 2025

నా కెరీర్ ముగిసిందని అనుకున్నారు.. కానీ: విజయ్ సేతుపతి

image

తన కెరీర్ ముగిసిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో ‘మహారాజ’ సినిమా తనను నిలబెట్టిందని విజయ్ సేతుపతి తెలిపారు. ఓ అవార్డు కార్యకమంలో మాట్లాడుతూ ‘2-3 ఏళ్లు నా సినిమాలు బాగా ఆడలేదు. ఆ సమయంలో ‘మహారాజ’ వచ్చి నన్ను నిజంగానే ‘మహారాజ’ను చేసింది. దీనికి ఇంతలా ప్రశంసలు వస్తాయని ఊహించలేదు’ అని పేర్కొన్నారు. 2024లో రిలీజైన ఈ సినిమా చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియా సినిమాగా నిలిచింది.

News March 14, 2025

సూపర్ ఐడియా కదా..!

image

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!

News March 14, 2025

IPL-2025లో కెప్టెన్లు

image

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్

News March 14, 2025

వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

image

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.