news

News March 14, 2025

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి సెటైర్

image

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని సెటైర్ వేశారు.

News March 14, 2025

WPL: ఈ సారైనా కప్పు కొట్టేనా?

image

WPL 2025లో కప్పు కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడనున్నాయి. మూడో సారి ఫైనల్ చేరిన DC జట్టు ఈ సారైనా కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు MI రెండోసారి ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ఎదురుచూస్తోంది. అయితే ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబైపై ఢిల్లీదే పైచేయి కావడం ఆ జట్టుకు సానుకూలంగా ఉంది. మరి రేపు జరిగే తుది పోరులో DC ఇదే జోరు కొనసాగిస్తుందో డీలా పడుతుందో చూడాలి.

News March 14, 2025

ట్రంప్, మోదీకి థాంక్స్: పుతిన్

image

ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రపంచ దేశాధినేతలకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, భారత ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ సహా ఇతర దేశాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వారు దీని కోసం చాలా సమయాన్ని కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తున్నామని, ఇది శాశ్వత శాంతికి దారితీయాలని ఆకాంక్షించారు.

News March 14, 2025

నేటి నుంచి విశాఖలో IPL టికెట్లు

image

AP: విశాఖపట్నంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ నెల 24న ఢిల్లీ-లక్నో మధ్య జరగాల్సిన మ్యాచ్ టికెట్లు నేడు సా.4 గంటల నుంచి డిస్ట్రిక్ట్ యాప్‌లో విక్రయించనున్నారు. ఈ సీజన్లో విశాఖను తన సెకండ్ హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకున్న ఢిల్లీ.. తమ తొలి మ్యాచ్ ఇక్కడే ఆడనుంది. ఈ నెల 30న ఢిల్లీ-SRH మ్యాచ్ టికెట్లు ఎప్పటి నుంచి అమ్ముతారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

News March 14, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 51,148 మంది భక్తులు దర్శించుకోగా 21,236 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు సమకూరింది.

News March 14, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించే పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మ.12 వరకు, మ.2.30 నుంచి సా.5.30 వరకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరుగుతాయి. పరీక్షలు ముగిశాక ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

News March 14, 2025

రోహిత్ శర్మపై వరుణ్ ప్రశంసలు

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కెప్టెన్ రోహిత్ శర్మ తనను చక్కగా ఉపయోగించుకున్నారని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పారు. ‘పవర్ ప్లేలో 2 ఓవర్లు, చివర్లో 2, 3 ఓవర్లు, మిడిల్ ఓవర్లలో వికెట్ కావాల్సినప్పుడు బౌలింగ్ చేస్తాను. ఇదే నా బలం అని రోహిత్ శర్మతో చెప్పాను. ఆయన మరో మాట మాట్లాడకుండా నేను చెప్పింది అర్థం చేసుకున్నారు. రోహిత్ శర్మ ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ఒకరు’ అని వరుణ్ ఓ ఇంటర్వ్యూలో కొనియాడారు.

News March 14, 2025

‘దిల్‌రూబా’ మూవీ రివ్యూ&రేటింగ్

image

కిరణ్ అబ్బవరం, రుక్సర్, క్యాథీ డేవిసన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ‘దిల్ రూబా’ మూవీ ప్రీమియర్ షోలు థియేటర్లలో ప్రదర్శించారు. సారీ, థాంక్స్ చెప్పని హీరో చివరికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సినిమా కథ. కిరణ్ నటన, రుక్సర్‌ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, విజువల్స్ బాగున్నాయి. పెద్దగా ట్విస్టులు లేకపోగా ఫస్టాఫ్ రొటిన్‌గా సాగుతుంది. లవ్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్, ఎమోషన్స్ అంతగా కనెక్ట్ కావు.
RATING: 2.25/5.

News March 14, 2025

నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం: రాజగోపాల్ రెడ్డి

image

TG: తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీ, ప్రజలకే లాభమని మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలిపారు. ‘నిద్రాహారాలు మాని భువనగిరి MP సీటును గెలిపించా. 2018లో నేను INC తరఫున పోటీ చేస్తే BJPకి, ఆ తర్వాత BJP నుంచి బరిలో ఉంటే INCకు డిపాజిట్ రాలేదు. 2023లోనూ INC నుంచి పోటీ చేస్తే BJPకి డిపాజిట్ దక్కలేదు’ అని పేర్కొన్నారు.

News March 14, 2025

GROUP-1 రిజల్ట్.. టీజీపీఎస్సీ కీలక సూచన

image

TG: గ్రూప్-1 ఫలితాల్లో టాప్-500లో 45.6% మంది బీసీలే ఉన్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఓసీలు 36.4%, ఎస్సీలు 10%, ఎస్టీలు 7.6% ఉన్నట్లు వెల్లడించింది. ఫలితాలపై తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించింది. మెరిట్ ప్రకారం, పారదర్శకంగా జాబితాను రిలీజ్ చేశామని తెలిపింది. రోస్టర్ ప్రకారమే పోస్టుల భర్తీ ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది. ప్రతి అన్సర్ షీట్‌ను ఇద్దరు ఎవాల్యుయేటర్లు మూల్యాంకనం చేసినట్లు పేర్కొంది.