news

News March 13, 2025

IPL: సూపర్ పవర్స్ ఉంటే మీరేం చేస్తారు?

image

క్రికెట్ అభిమానుల పండుగైన ‘IPL’ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో ఈ సీజన్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. ఈసారైనా కప్ కొట్టేలా RCB వ్యూహాలను రచిస్తోంది. అయితే, మీకే సూపర్ పవర్స్ ఉంటే కిందివాటిలో ఏది చేస్తారు? 1.RCB తొలి ట్రోఫీని గెలవటం. 2. ధోనీ తన తొలి IPL సెంచరీని కొట్టడం. 3. రోహిత్ బ్యాటింగ్‌తో అదరగొట్టి ఆరెంజ్ క్యాప్ సాధించడం. 4. SRH 300 రన్స్‌ను దాటేయడం. COMMENT

News March 13, 2025

ఆ పాత సామాను ఎవరు?

image

అవసరమైతే పార్టీపైనే విమర్శలు చేసే BJP MLA రాజాసింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కాషాయ దళంలోని పాత సామాను బయటకు వెళ్లాలన్నారు. కొన్ని సామాజిక వర్గాల్లోని కొందరు పార్టీని సొంత జాగీరుగా భావిస్తున్నారని ఆరోపించారు. దీంతో నాయకుల్లో రెడ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్ర కమలదళ నేతల్లో ఎవరిని ఉద్దేశించి గోషామహల్ నేత ఈ పాత సామాను కామెంట్లు చేశాడని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది.

News March 13, 2025

‘XXX’ సబ్బుల కంపెనీ అధినేత మృతి

image

AP: ‘XXX’ సబ్బుల కంపెనీ అధినేత మాణిక్కవేల్ అరుణాచలం మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు అరండల్ పేటలోని స్వగృహంలో మృతి చెందారు. తమిళనాడుకు చెందిన అరుణాచలం గుంటూరులో స్థిరపడ్డారు. ఇక్కడి నుంచే సబ్బుల వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. తెలుగు రాష్ట్రాల్లో XXX సోప్, ఈ బ్రాండ్ ఇతర ఉత్పత్తుల ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

News March 13, 2025

ఉద్యోగుల మధ్య జీతాల తేడాలొద్దు: నారాయణ మూర్తి

image

ఉద్యోగుల మధ్య జీతాల తేడా ఉండకూడదని, వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అన్నారు. తక్కువ, ఎక్కువ వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ‘టై కాన్ ముంబై 2025’ ఈవెంట్‌లో అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఉద్యోగి గౌరవం, హుందాతనాన్ని కాపాడాలి. వారిని ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, మందలించేటప్పుడు ఏకాంతంగా చెప్పాలి. కంపెనీ లాభాలను ఉద్యోగులందరికీ సమానంగా అందించాలి’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

హోళీ రంగులు పోవాలంటే ఇలా చేయండి

image

– బయటకు వెళ్లే ముందు పెట్రోలియం జెల్లీ లేదా నూనె రాసుకుంటే లేయర్‌లా కాపాడుతుంది
– రంగులు పడ్డాక వీలైనంత త్వరగా నీటితో కడుక్కోండి
– చేతికి హానికర కెమికల్ కలర్స్ అంటితే సీ సాల్ట్, గ్లిజరిన్, ఆల్మండ్ ఆయిల్‌తో రుద్దండి
– రంగులు చల్లుకున్నాక నేరుగా షాంపూతో తలను శుభ్రం చేయకుండా ముందుగా నీళ్లతో కడగండి
– పెరుగు, నిమ్మరసం కలిపి రంగులు బాగా అంటిన చోట రుద్ది గోరువెచ్చని నీటితో స్నానం చేయండి

News March 13, 2025

IPLకు మార్క్‌వుడ్ దూరం!

image

IPL టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ టోర్నీకి దూరం కానున్నారు. మోకాలికి గాయం కావడంతో ఆయన సర్జరీ చేయించుకున్నారు. దీంతో 4 నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. IPL మెగా వేలంలో వుడ్‌ను రూ.7.50 కోట్లు వెచ్చించి లక్నో కొనుగోలు చేసింది. కానీ ఆయన ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడం లేదు. ఫ్రాంచైజీ ఆయన స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంది.

News March 13, 2025

నాసిరకం మద్యానికి 33 వేల మంది బలి: జీవీ

image

AP: YCP హయాంలో నాసిరకం మద్యం సేవించి 33 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అసెంబ్లీలో కోరారు. ‘జగన్ హయాంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువగా మద్యం కుంభకోణం జరిగింది. ఈ స్కామ్ ద్వారా YCP నేతలు రూ.వేల కోట్లు గడించారు. దీనిపై EDతో విచారణ చేయించాలి. దోచుకున్న సొమ్మును రికవరీ చేసి ప్రజలకు పంచాలి’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు

image

AP: వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఇంటర్‌ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఒకే సబ్జెక్ట్‌గా మ్యాథ్స్ ఎ-బి, బోటనీ-జువాలజీని చేయనున్నారు. జూనియర్‌ కాలేజీల్లో ఎంబైపీసీ కోర్సుకు అనుమతి ఇవ్వనున్నారు. జూన్‌ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 7 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించారు.

News March 13, 2025

అంబానీలు ఎవరో తెలియదు.. అయినా పెళ్లికి వెళ్లా: నటి

image

అసలు అంబానీలు ఎవరో కూడా తనకు తెలియదని, అయినా వారి ఇంట్లో పెళ్లికి హాజరయ్యానని హాలీవుడ్ నటి, మోడల్ కిమ్ కర్దాషియాన్ అన్నారు. ‘నా ఫ్రెండ్, జువెలరీ డిజైనర్ లారైన్ స్క్వార్జ్‌కు అంబానీలతో అనుబంధం ఉంది. ఆమె ద్వారా నాకు వారు ఆహ్వానం పంపారు. ఇన్విటేషన్ గిఫ్ట్ బాక్స్ బరువే 20 కిలోలు ఉంది. అది చూసే కచ్చితంగా పెళ్లికి వెళ్లాలని అనుకున్నా. ఇండియాకు వచ్చి అనంత్-రాధికను ఆశీర్వదించా’ అని చెప్పుకొచ్చారు.

News March 13, 2025

మాధురీ దీక్షిత్ సెకండ్ గ్రేడ్ నటి: కాంగ్రెస్ MLA

image

నటి మాధురీ దీక్షిత్‌పై రాజస్థాన్ INC MLA తికారామ్ జుల్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. IIFA వేడుకలపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ‘IIFA వల్ల రాష్ట్రానికి ఏం ఒరిగింది? ఈ కార్యక్రమం పేరిట రూ.100 కోట్ల ప్రజాధనం వృథా చేశారు. వేడుకకు వచ్చిన ఒక్కరు కూడా ఇక్కడి టూరిస్ట్ ప్లేస్‌ని విజిట్ చేయలేదు. అయినా షారుక్ తప్ప పెద్ద స్టార్లెవరూ రాలేదు. మాధురీ దీక్షిత్ సహా మిగతా వాళ్లంతా సెకండ్ గ్రేడ్ నటులే’ అని అన్నారు.