News March 13, 2025

‘XXX’ సబ్బుల కంపెనీ అధినేత మృతి

image

AP: ‘XXX’ సబ్బుల కంపెనీ అధినేత మాణిక్కవేల్ అరుణాచలం మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు అరండల్ పేటలోని స్వగృహంలో మృతి చెందారు. తమిళనాడుకు చెందిన అరుణాచలం గుంటూరులో స్థిరపడ్డారు. ఇక్కడి నుంచే సబ్బుల వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. తెలుగు రాష్ట్రాల్లో XXX సోప్, ఈ బ్రాండ్ ఇతర ఉత్పత్తుల ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Similar News

News March 21, 2025

BREAKING: పరీక్ష వాయిదా

image

AP: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కీలక ప్రకటన చేసింది. డాక్టర్ అంబేడ్కర్ గురుకులాల్లో 2025-26కు గాను ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌‌లో ప్రవేశాలకు ఏప్రిల్ 6న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు వెల్లడించింది. దీన్ని అదే నెల 13న నిర్వహిస్తామని తెలిపింది.

News March 21, 2025

‘టాక్సిక్’ కోసం రూ.15 కోట్లు తీసుకుంటున్న కియారా!

image

రాకింగ్ స్టార్ యశ్, కియారా కాంబోలో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం కియారా ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆమె భారీ పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా మారనున్నట్లు వెల్లడించాయి. కాగా, SSMB29 కోసం ప్రియాంకా చోప్రా రూ.30 కోట్లు తీసుకుంటున్నారని టాక్.

News March 21, 2025

IPL టీమ్స్.. వాటి ఓనర్లు!

image

*KKR – షారుఖ్, జూహీ చావ్లా, జయ్ మెహ్తా. *MI – ముకేశ్ & నీతా అంబానీ. *CSK – N. శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్. *SRH – కళానిధి మారన్ (సన్ టీవీ). *DC- సజ్జన్ జిందాల్ & పార్థ్ జిందాల్, GMR. *PBKS – ప్రీతి జింతా, మోహిత్ బర్మన్, కరణ్ పాల్. *RCB- యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్. *RR- మనోజ్ బడలే, లచ్లన్ ముర్దోచ్. *GT- టొరెంట్ గ్రూప్, CVC క్యాపిటల్ పార్ట్నర్స్. *LSG- సంజీవ్ గోయెంకా, RPSG గ్రూప్.

error: Content is protected !!