news

News March 13, 2025

అసెంబ్లీ వద్ద భారీగా మార్షల్స్ మోహరింపు

image

తెలంగాణ అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి <<15744584>>వ్యాఖ్యలు<<>> తీవ్ర దుమారం రేపాయి. దీంతో సభను స్పీకర్ వాయిదా వేయగా కొద్దిసేపటి క్రితమే తిరిగి పున:ప్రారంభం అయింది. జగదీశ్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అటు సభ వద్ద భారీగా మార్షల్స్‌ను మోహరించారు.

News March 13, 2025

రోహిత్ శర్మ ఎందుకు రిటైరవుతారు?: డివిలియర్స్

image

రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్లపై మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించారు. ‘ప్రస్తుతం రోహిత్ ఆట మామూలుగా లేదు. కెప్టెన్సీ కూడా అద్భుతంగా చేస్తున్నారు. ఇలాంటి దశలో ఆయనెందుకు రిటైరవుతారు? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ఆడిన తీరు అసాధారణం. నాయకుడిగా ముందుండి నడిపించారు. రిటైర్ కావడానికి కారణమే లేదు. ఆయనపై విమర్శలకూ స్కోప్ లేదు. ఆయన రికార్డులే ఆ మాట చెబుతాయి’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

‘కోర్ట్’కు పాజిటివ్ టాక్.. ప్రియదర్శి ఎమోషనల్

image

ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రియదర్శి ఎమోషనల్ అయ్యారు. థియేటర్‌లో నేలపై కూర్చొని నిర్మాత నానిని హత్తుకొని తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను నాని షేర్ చేశారు.

News March 13, 2025

₹ చిహ్నం తొలగింపుతో TN పరువు తీసిన స్టాలిన్: అన్నామలై ఫైర్

image

భారత్‌లో TN హాస్యాస్పదంగా మారిపోయిందని ఆ రాష్ట్ర BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీకి వ్యతిరేకంగా DMK, CM స్టాలిన్ మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రూపీ సింబల్ తొలగించి తమిళ పదం పెట్టడంపై ఘాటుగా స్పందించారు. ‘రూపీ చిహ్నం రూపొందించింది తమిళుడైన ఉదయ్. ఆయన తండ్రి 1971లో DMK MLA. తమిళుడు రూపొందించిన ఈ చిహ్నాన్ని దేశం సగర్వంగా స్వీకరించింది. ఇప్పుడు స్టాలిన్ వల్ల పరువు పోతోంది’ అని అన్నారు.

News March 13, 2025

గాయపడ్డ నటి.. నుదిటిపై 13 కుట్లు!

image

సీనియర్ నటి, ఎవర్‌గ్రీన్ బ్యూటీగా పేరొందిన భాగ్యశ్రీ గాయపడ్డారు. పికిల్‌బాల్ ఆడుతుండగా ఆమె నుదిటిపై లోతైన గాయం తగిలింది. దీంతో నుదిటిపై 13 కుట్లు పడ్డాయని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. భాగ్యశ్రీ ‘మైనే ప్యార్‌ కియా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా చివరగా ‘రాధేశ్యామ్’, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రాల్లో నటించారు.

News March 13, 2025

కిడ్నీలను కాపాడుకుందామిలా

image

శరీరంలో మూత్రపిండాల పనితీరు చాలా కీలకం. వాటిని కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి:
రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. పంచదార, ఉప్పు, కొవ్వులు పరిమితంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నీరు పుష్కలంగా తాగాలి. డీహైడ్రేషన్ కిడ్నీలకు ప్రమాదకరం. ఇష్టారాజ్యంగా ఔషధాల్ని వాడకూడదు. రక్తపోటు, మధుమేహం, క్రియేటినిన్ స్థాయులపై కన్నేసి ఉంచాలి.
* నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం

News March 13, 2025

ఇలా చదివితే ఈజీగా గుర్తుంటాయ్!

image

ఇది పరీక్షల సమయం. సిస్టమేటిక్‌గా చదువుకుంటే ఈజీగా పరీక్షలు రాయొచ్చు. దీనికి పోమోడోర్ టెక్నిక్‌ (టైమ్ మేనేజ్‌మెంట్) ఎంతో యూజ్‌ఫుల్ అని నిపుణులు చెబుతున్నారు. ‘చదవాల్సిన విషయాన్ని ఎంచుకోండి. దీనికోసం టైమర్‌ని 25 ని.లకు సెట్ చేసుకోండి. టైమర్ పూర్తవగానే ఓ 10 ని.లు బ్రేక్ ఇవ్వండి. నాలుగు సార్లు ఇలా చేశాక 30 ని.లు బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే దృష్టి మెరుగై పరధ్యానం తగ్గుతుంది’ అని తెలిపారు. SHARE IT

News March 13, 2025

ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ

image

తెలంగాణలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడవనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో ఒంటి గంట నుంచి సా.5 వరకు తరగతులు నిర్వహిస్తారు. అటు ఏపీలోనూ ఎల్లుండి నుంచి ఒంటిపూట స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

News March 13, 2025

మహిళలతో తప్పుడు ప్రవర్తన.. చెంప చెళ్లుమనిపించా: హీరో

image

మహిళలతో తప్పుగా ప్రవర్తించిన ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించానని హిందీ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘2008లో సంతోష్ అనే అభిమాని నా కోసం సెట్స్‌కు వచ్చాడు. అతడు మహిళలతో తప్పుగా ప్రవర్తించడం చూసి చెంప మీద కొట్టాను. దీంతో అతడు నాపై కేసు పెట్టాడు. 9ఏళ్లపాటు ఆ కేసు సాగింది. ఎట్టకేలకు అతడిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఆధారాలు సంపాదించి కేసు గెలిచాను’ అని తెలిపారు.

News March 13, 2025

తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

image

త్రిభాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కాపీపై రూపీ సింబల్‌(₹)ను తొలగించింది. రూపీ సింబల్‌కు బదులు తమిళ ‘రూ’ అక్షరాన్ని పేర్కొంది.