news

News March 12, 2025

బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టుకు రాజమహేంద్రవరం పోలీసుల లేఖ

image

AP: మధ్యంతర బెయిల్ గడువు మంగళవారంతో ముగిసినా బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోలేదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులు రాష్ట్ర హైకోర్టుకు సమాచారాన్ని అందించారు. ఈ మేరకు లేఖ రాశారు. రిమాండ్ ముద్దాయిగా ఉన్న అనిల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. తన తల్లికి వైద్య చికిత్స కోసమని చెప్పి అనిల్ మధ్యంతర బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే.

News March 12, 2025

ఎంగేజ్మెంట్ రింగ్‌ను సమంత ఏం చేశారంటే?

image

హీరోయిన్ సమంత తన నిశ్చితార్థపు ఉంగరపు డైమండ్‌ను లాకెట్‌గా మార్చుకున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. విడాకుల అనంతరం ఎంగేజ్మెంట్ రింగ్స్‌ను సరికొత్తగా మార్చుకోవడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారిపోయిందని తెలిపాయి. లైఫ్‌లో ముందుకు సాగేందుకు ప్రముఖులు ఇదొక మార్గంగా ఎంచుకుంటున్నట్లు వెల్లడించాయి. తన వివాహ గౌన్‌ను కూడా బోల్డ్ బ్లాక్ బాడీకాన్‌గా మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నెట్టింట చర్చ జరుగుతోంది.

News March 12, 2025

అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా?

image

కొందరికి అర్ధరాత్రి 12 గంటలైనా నిద్ర పట్టదు. కానీ అంతసేపు నిద్రపోకుండా ఉండడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 5 గంటలు ఫోన్ చూసేవారిలోనే ఈ సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు. రాత్రి తక్కువగా తినాలి. నిద్రకు 2 గంటల ముందే భోజనం తీసుకోవాలి. గది ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉంచుకోవాలి. మ్యూజిక్ వినడం, బుక్స్ చదవాలి. నిద్రకు గంట ముందే ఫోన్‌ను దూరంగా పెట్టి పడుకుంటే నాణ్యమైన నిద్ర దొరుకుతుంది.

News March 12, 2025

ఇండియాకు రూ.20.80 కోట్లు.. పాక్‌కి ఎంతంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన భారత జట్టుకు ICC రూ.20.80 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చింది. ఇక రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.10.40 కోట్లు చెల్లించింది. కాగా, సెమీస్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా& సౌతాఫ్రికా జట్లకు రూ.5.20కోట్లు, 5, 6 స్థానాల్లో నిలిచిన అఫ్గాన్ & బంగ్లాదేశ్‌లకు రూ.3 కోట్లు, ఇక చివరి రెండు స్థానాల్లో ఉన్న పాకిస్థాన్ & ఇంగ్లండ్ టీమ్స్‌కు రూ.1.20 కోట్లు అందించింది.

News March 12, 2025

సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలం: KCR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని, మూడో వంతు సమయం పూర్తైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దళితబంధు నిలిపివేయడం, గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు.

News March 12, 2025

మహేశ్ బాబు-రాజమౌళి సినిమా కథ ఇదేనా?

image

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రానున్న సినిమా గురించి బాలీవుడ్ పోర్టల్ పింక్ విల్లా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం.. ఈ మూవీ కథ కాశీ చరిత్రకు సంబంధించిందిగా ఉండనుంది. పురాణాలకు, నేటి కాలానికి ముడిపెడుతూ సినిమా సాగుతుంది. దీని కోసమే మూవీ టీమ్ హైదరాబాద్‌లో కాశీ సెట్ వేశారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి అని తెలుస్తోంది.

News March 11, 2025

ఈ ప్రాంతాల్లో సూర్యుడు అస్తమించడు!

image

రాత్రి కాగానే చీకటవ్వడం సర్వసాధారణం. కానీ సూర్యుడు అస్తమించకుండా, అర్ధరాత్రి వేళల్లోనూ ప్రకాశించే ప్రాంతాల గురించి విన్నారా? నార్వేలోని ట్రామ్సో, స్వాల్‌బార్డ్, ఐస్‌లాండ్‌లోని రెయ్క్‌జావిక్, కెనడాలోని యుకోన్, ఫిన్లాండ్, రష్యాలోని సెయింట్ పీటర్స్‌బెర్గ్‌లో సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఆ ప్రాంతాల ప్రజలు కిటికీలకు తెరలు వేసో, కళ్లకు మాస్కులు ధరించో నిద్రపోతుంటారు. కొంతమంది మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు.

News March 11, 2025

సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ లేఖ

image

TG: తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో <<15712556>>తెలంగాణ<<>> ప్రజా ప్రతినిధుల సిఫారసులను పట్టించుకోవాలని AP CM చంద్రబాబుకు మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. ‘టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంతో గందరగోళం నెలకొంటుంది. వారి తీరుతో ప్రజాప్రతినిధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలి’ అని ఆమె చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

News March 11, 2025

భార్యాభర్తల ❤️ బాండింగ్ మరింత పెరగాలంటే..

image

ప్రేమ జంటలు, కొత్త దంపతులను చూస్తే ముచ్చటేస్తుంది. భాగస్వాముల పట్ల కేరింగ్, ఎమోషన్, ఇంటీమసీ బాగుంటుంది. సంసారంలో పడి, ఆఫీసులో బిజీ అయ్యాక లైఫ్ బోరింగ్, రొటీన్‌గా అనిపిస్తుంది. మళ్లీ హనీమూన్ తరహా శృంగారానుభూతులు పొందాలంటే 2:2:2 రూల్ పాటించాలని చెప్తున్నారు నిపుణులు. 2 వారాలకోసారి డేట్‌నైట్, 2 నెలలకోసారి వీకెండ్ గెట్‌అవే, 2 ఏళ్లకోసారి లాంగ్ వెకేషన్ ప్లాన్‌చేస్తే దాంపత్యం అత్యంత సుఖమయం అంటున్నారు.

News March 11, 2025

150 మంది సైనికుల ఊచకోత!

image

పాకిస్థాన్‌లో BLA (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) నరమేధం సృష్టించింది. తమ అధీనంలో ఉన్న 450 మందిలో 150 మంది సైనికులను ఊచకోత కోసినట్లు బీఎల్ఏ స్వయంగా ప్రకటించింది. తమపై సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బీఎల్ఏ హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ రైలులో ప్రయాణిస్తున్న వందలాదిమందిని బందీలుగా తీసుకున్నారు.