news

News March 11, 2025

24 ఏళ్లకే అమ్మాయిల పెళ్లి చేయండి: లవ్ జిహాద్‌పై BJP నేత

image

కూతుళ్లకు 24 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి చేయాలని క్రిస్టియన్ తల్లిదండ్రులకు కేరళ BJP నేత, మాజీ MLA పీసీ జార్జ్ సూచించారు. రాష్ట్రంలో లవ్ జిహాద్ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒక్క మీనాచిల్ తాలూకాలోనే 400 యువతుల్ని కోల్పోయాం. అందులో 41 మందే దొరికారు’ అని వివరించారు. ఎరట్టుపెట్టాలో ఈ మధ్యే దొరికిన పేలుడు పదార్థాలు రాష్ట్రమంతా తగలబెట్టేందుకు సరిపోతాయని అన్నారు.

News March 11, 2025

కెనడా పార్లమెంటు నుంచి కుర్చీ ఎత్తుకెళ్లిన ట్రూడో

image

కెనడా ప్రధాని, ఎంపీ పదవులకు వీడ్కోలు పలుకుతూ జస్టిన్ ట్రూడో ప్రదర్శించిన సరదా చేష్టలు వైరల్‌గా మారాయి. నాలుక బయటకు చాపుతూ పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి తన కుర్చీని ఆయన ఎత్తుకెళ్లిపోవడం గమనార్హం. ఈ చర్య అసంతృప్తి, ప్రతీకారంతో చేసింది కాదు. పదవి నుంచి దిగిపోయేటప్పుడు అక్కడ ఇలా చేయడం ఓ సరదా ఆనవాయితీ అని తెలిసింది. కెనడా తర్వాతి ప్రధానిగా మార్క్ కార్నీని లిబరల్ పార్టీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే.

News March 11, 2025

FLASH: గ్రూప్-2 ఫలితాలు విడుదల

image

TG: గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంక్ <>జాబితాను<<>> ప్రకటించింది. మరోవైపు 1,363 గ్రూప్-3 పోస్టుల ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల పరీక్ష ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.

News March 11, 2025

సంతాన ప్రాప్తి కోసం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కత్రినా?

image

కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సందర్శించారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యేక నాగపూజలో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అయితే, సంతాన ప్రాప్తి కోసం ఈ పూజ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. సర్పాలకు అధిపతి అయిన కార్తికేయుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిగా పూజలందుకుంటున్నారు. సంతాన ప్రాప్తికోసం, ఇతర సర్ప దోషాల నివారణకు అనేకమంది ఇక్కడికి వెళ్తుంటారు.

News March 11, 2025

ఆడబిడ్డలను మోసగిస్తే తాటతీస్తాం: చంద్రబాబు

image

AP: హత్యా రాజకీయాల మరక అంటకుండా 42 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నానని CM చంద్రబాబు తెలిపారు. నేరాలు – ఘోరాలు చేసి రాజకీయాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కొందరు ఆడబిడ్డలను మాయమాటలతో మోసగిస్తున్నారని, వారి తాటతీస్తామని హెచ్చరించారు. ఆకతాయిలు వేధిస్తుంటే ‘శక్తి’ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. వైసీపీ తీసుకొచ్చిన దిశ యాప్ దిక్కుమాలిన యాప్‌ అని మండిపడ్డారు.

News March 11, 2025

తేనెటీగల గురించి ఈ విషయం తెలుసా?

image

ఓ టీస్పూన్ తేనె అందించేందుకు 12 తేనెటీగలు వాటి జీవితం మొత్తం కష్టపడతాయి. ఒక్క తేనెటీగ సగటున 30-60 రోజులు మాత్రమే జీవిస్తుంది. అది రోజుకు సుమారు 5వేల పుష్పాలను పరాగసంపర్కం చేస్తుంది. ఇలా తన జీవితంలో ఒక్క తేనెటీగ 1.5లక్షల పుష్పాలపై వాలుతుంది. వాటి నుంచి సేకరించిన తేనె టీస్పూన్‌లో పావు వంతు కూడా ఉండదు. కానీ దీనికోసమే ఇవి వాటి జీవితాంతం కష్టపడతాయి.

News March 11, 2025

అదే వారికి చివరి రోజు: సీఎం చంద్రబాబు

image

AP: లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఆడబిడ్డలపై హత్యాచారాలకు పాల్పడిన నిందితులకు అదే చివరిరోజు అవుతుందని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరిగాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పారు. తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవని వివరించారు.

News March 11, 2025

అభిషేక్ మహంతికి క్యాట్ షాక్!

image

తనను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఐపీఎస్ అభిషేక్ మహంతి చేసిన విజ్ఞప్తిని క్యాట్ తిరస్కరించింది. డీవోపీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన పిటిషన్‌పై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కరీంనగర్ సీపీగా పనిచేసిన అభిషేక్‌ను ఏపీలో రిపోర్టు చేయాలని ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే.

News March 11, 2025

ట్విస్ట్: భర్త ఫిర్యాదుతోనే దొరికిపోయిన రన్యా రావ్!

image

బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ రన్యారావ్ కేసులో మరో ట్విస్ట్. నిజానికి ఆమెపై DRI అధికారులకు ఫిర్యాదు చేసింది భర్తేనని తెలిసింది. ఆయన కుటుంబీకులతో ఆమెకు విభేదాలు ఉన్నట్టు సమాచారం. పెళ్లైన రెండు నెలల నుంచే ఆమె విదేశాల్లో పర్యటించడంతో గొడవలు మొదలైనట్టు వార్తలొస్తున్నాయి. మొదట ఆమె రష్యాకు ఆ తర్వాత దుబాయ్‌కు వెళ్లేది. భర్త సమాచారంతోనే నిఘా పెట్టిన DRI చివరకు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

News March 11, 2025

KL రాహుల్ సంచలన నిర్ణయం!

image

IPLలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న KL రాహుల్ కెప్టెన్సీపై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాటింగ్‌పై శ్రద్ధ పెట్టేందుకు సారథ్య బాధ్యతలు అప్పగించొద్దని టీం ఓనర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ కెప్టెన్ కావడం లాంఛనమే. ఇన్నాళ్లు రాహుల్, అక్షర్‌లలో ఎవరు కెప్టెన్ అవుతారనే ప్రశ్నలకు తాజా నిర్ణయంతో ఆన్సర్ దొరికినట్లయింది.