News March 11, 2025
ట్విస్ట్: భర్త ఫిర్యాదుతోనే దొరికిపోయిన రన్యా రావ్!

బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ రన్యారావ్ కేసులో మరో ట్విస్ట్. నిజానికి ఆమెపై DRI అధికారులకు ఫిర్యాదు చేసింది భర్తేనని తెలిసింది. ఆయన కుటుంబీకులతో ఆమెకు విభేదాలు ఉన్నట్టు సమాచారం. పెళ్లైన రెండు నెలల నుంచే ఆమె విదేశాల్లో పర్యటించడంతో గొడవలు మొదలైనట్టు వార్తలొస్తున్నాయి. మొదట ఆమె రష్యాకు ఆ తర్వాత దుబాయ్‌కు వెళ్లేది. భర్త సమాచారంతోనే నిఘా పెట్టిన DRI చివరకు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Similar News
News March 18, 2025
ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు, లోకేశ్

AP: మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఎల్లుండి తిరుమల వెళ్లనున్నారు. ఆయన వెంట మంత్రి లోకేశ్ సహా కుటుంబ సభ్యులు ఉండనున్నారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాన పథకానికి వారి కుటుంబం విరాళం ప్రకటించనుంది. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించనుంది. ఆ తర్వాతి రోజు టీటీడీ పరిపాలనా వ్యవహారాల్ని CBN సమీక్షిస్తారని తెలుస్తోంది.
News March 18, 2025
భారీ లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల లాభంతో 75,047 వద్ద ట్రేడ్ అవుతుంటే, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 22,764 వద్ద కదలాడుతోంది. జొమాటో, ఐసీఐసీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, HUL, L&T షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News March 18, 2025
9 నెలలు అంతరిక్షంలోనే ఎందుకున్నారంటే?

గత ఏడాది జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్ దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉన్నారు. 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా వీళ్లను తీసుకెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్‌లో సమస్యలు తలెత్తాయి. ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది. దీంతో SEP 7న వ్యోమగాములు లేకుండానే స్టార్ లైనర్ భూమికి తిరిగి రాగా వారు అక్కడే ఉండిపోయారు.