India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: MLA కోటా MLC ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఐదుగురు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కూటమికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనమే. వారి ఆస్తుల వివరాలిలా..
* బీద రవిచంద్ర- రూ.41కోట్లు
* బీటీ నాయుడు- రూ.5.68కోట్లు
* కావలి గ్రీష్మ- రూ.1.78కోట్లు
* సోము వీర్రాజు- రూ.2.81కోట్లు
* నాగబాబు- రూ.70.32కోట్లు

TG: తెలంగాణ భవన్‌లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడంపై మార్గనిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 17 లేదా 19న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,746 మంది దర్శించుకోగా, 23,649 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, పుష్కరిణిలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

HYDలో పిల్లల్ని చంపి దంపతులు ఉరివేసుకున్న <<15717792>>ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగుచూశాయి. కుమారుడు విశ్వాన్‌కు విషమిచ్చి, కూతురు శ్రీతకు ఉరివేసిన తర్వాత చంద్రశేఖర్, కవిత ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘మా చావుకు ఎవరూ కారణం కాదు. కెరీర్, మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా. వేరే మార్గం లేక చనిపోతున్నాం క్షమించండి’ అని చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాశారు. ఆయన 6 నెలల క్రితం లెక్చరర్‌గా జాబ్ మానేశారు.

తాను ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం జట్టులో కొనసాగాలనుకుంటున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. ‘2027 వన్డే వరల్డ్ కప్‌కి ఇంకా చాలా సమయం ఉంది. ఆ టోర్నీలో ఆడతానో లేదో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం నేను బాగా ఆడుతున్నా. టీమ్ కూడా నాతో ఆడటాన్ని ఇష్టపడుతోంది. ప్రస్తుతం జట్టు ఆడుతున్న తీరును చూస్తుంటే ఈ జట్టును వదలాలని అనిపించడం లేదు’ అని పేర్కొన్నారు.

TG: ప్రణయ్ <<15710208>>హత్య కేసులో<<>> కోర్టు నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రణయ్ భార్య అమృత ఇన్‌స్టాగ్రాంలో ఆసక్తికర పోస్ట్ చేశారు. నిన్నటి తేదీని ఉద్దేశించి ‘రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్’ అని రాసుకొచ్చారు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత తండ్రి మారుతీరావు 2018లో సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు.

ప్రపంచవ్యాప్తంగా X (ట్విటర్) సేవల్లో అంతరాయానికి తామే కారణమని హ్యాకింగ్ గ్రూప్ ‘Dark Storm Team’ ప్రకటించుకుంది. ఈ సైబర్ అటాక్ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, తమ బలాన్ని నిరూపించుకునేందుకే చేశామని స్పష్టం చేసింది. ఈ Dark Storm Team పాలస్తీనాకు అనుకూలంగా ఉంటుంది. హై సెక్యూరిటీ సిస్టంలను కూడా సులభంగా హ్యాక్ చేస్తుందన్న గుర్తింపు ఉంది. నాటో, ఇజ్రాయెల్, దాని అనుకూల దేశాల సైట్లను టార్గెట్ చేసింది.

‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 నెలలుగా వైద్యం అందిస్తున్నా నరాల పనితీరులో ఎలాంటి పురోగతి లేదని డాక్టర్లు తెలిపారు. కళ్లు మాత్రమే తెరుస్తున్నాడని, ఎవరినీ గుర్తుపట్టట్లేదని చెప్పారు. ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ప్రాసెస్‌లో ఫుడ్ ఇస్తున్నామన్నారు. శరీర కదలిక కోసం ఫిజియోథెరపీ చేస్తున్నామని చెప్పారు.

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. అక్కడి అయ్యప్ప గుడిలోని సన్నిధానంలో 18 మెట్లను ఎక్కగానే స్వామి దర్శనం అయ్యేలా మార్పులు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, విజయవంతమైతే రానున్న మండల మకరవిళక్కు సీజన్ నుంచి కొనసాగిస్తామంది. సాధారణంగా మెట్లు ఎక్కగానే భక్తులను ఓ వంతెన మీదికి మళ్లించి కొంత సమయం క్యూలో ఉంచిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు.

WPL 2025లో ముంబై ఇండియన్స్ మరోసారి ఫైనల్‌కి చేరువైంది. ఇవాళ బెంగళూరుతో జరిగే మ్యాచులో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరనుంది. నిన్నటి మ్యాచులో గుజరాత్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో MI(10P) రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఢిల్లీకీ 10 పాయింట్లే ఉన్నా NRR ఎక్కువ ఉండటంతో తొలి స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచులో MI ఓడితే ఎలిమినేటర్‌లో గుజరాత్‌తో తలపడనుంది.
Sorry, no posts matched your criteria.