news

News March 9, 2025

తప్పిన పెను రైలు ప్రమాదం

image

AP: తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ వద్ద హౌరా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. అడవయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరగడంతో సునీల్ అనే వ్యక్తి రెడ్ క్లాత్‌తో లోకోపైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో రైలును ఆపేశారు. అధికారులు మరమ్మతులు చేపట్టడంతో సుమారు గంటపాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

News March 9, 2025

ఇది 2000 ఏళ్ల నాటి జీవన వృక్షం!

image

పై ఫొటోలోని భారీ వృక్షాన్ని చూశారా? దాని వయసు 2వేల సంవత్సరాలు. సౌతాఫ్రికాలోని లింపోపో ప్రాంతంలో ఉంది. స్థానికులు దీన్ని జీవన వృక్షంగా పిలుస్తారు. ఆ మొండెంలో 80శాతం వరకూ నీళ్లుంటాయి. కరవు సమయంలో ప్రజలకు, జంతువులకు అవే ఆధారం. ఏనుగులకు దీని బెరడు, కోతులకు, మనుషులకు దీని పళ్లు ఆహారం. ఎన్నో జాతుల పక్షులకు ఆ కొమ్మలు ఆవాసం. ఇక దాని బెరడుతో తాళ్లు, బుట్టలు, చాపలు, దుస్తులు, కాగితం తయారుచేస్తారు.

News March 9, 2025

BREAKING: టన్నెల్‌లో మృతదేహం

image

SLBC టన్నెల్‌లోని టీబీఎం మెషీన్ ముందు భాగంలో ఓ మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. వారికి కుడి చేయి, ఎడమ కాలు కనిపించింది. చేతికి ఉన్న కడియాన్ని బట్టి అతడు ఇంజినీర్ గుర్‌ప్రీత్‌ సింగ్‌గా అనుమానిస్తున్నారు. సాయంత్రంలోపు మృతదేహాన్ని బయటికి తీయనున్నారు. మరిన్ని మృతదేహాలు కూడా టీబీఎం మెషీన్‌లోనే చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.

News March 9, 2025

రేపు డ్యూటీలు బంద్

image

AP: తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్ రేపు విధులు బహిష్కరించనున్నారు. దీర్ఘకాలంగా తమ డిమాండ్లు పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. NTR వైద్యసేవా ట్రస్ట్ పరిధిలో పనిచేసే ఫీల్డ్ సిబ్బంది, వైద్యమిత్ర, టీం లీడర్స్, జిల్లా మేనేజర్, ఆఫీస్ అసోసియేట్స్, CC కెమెరా మానిటర్ సిబ్బంది ఈ నెల 10, 17, 24 తేదీల్లో విధులు బహిష్కరించనున్నారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే ఛాన్సుంది.

News March 9, 2025

అధిక పని గంటల వల్ల నాణ్యత తగ్గుతుంది: సౌమ్య స్వామినాథన్

image

అధికపని గంటల వల్ల నాణ్యత తగ్గుతుందని WHO మాజీ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. 12గంటలు నిర్విరామంగా పనిచేయవచ్చు, కానీ 8గంటల తర్వాత ఎంత నాణ్యతతో పనిచేస్తున్నామనేది పరిశీలించుకోవాలన్నారు. కొవిడ్ సమయంలో నిరంతరంగా పనిచేసిన వారు తరువాతి కాలంలో తమ వృత్తులనే విడిచిపెట్టారన్నారు. ఉద్యోగులకు సరైన నిద్ర తప్పనిసరిగా ఉండాలన్నారు. కొంతకాలంగా దేశవ్యాప్తంగా పనిగంటలపై చర్చ నడుస్తున్నసంగతి తెలిసిందే.

News March 9, 2025

CSK ఫ్యాన్స్..‘తలా’ వచ్చేశాడు!

image

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కి ఆ జట్టు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ‘తలా’ ధోనీ జట్టుతో చేరారని పేర్కొంది. తెల్లటి పంచెకట్టులో ధోనీ వస్తున్న ఫొటోను షేర్ చేసింది. ఇప్పటికే మహీ ప్రాక్టీస్‌కు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ధోనీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్న యెల్లో ఫ్యాన్స్ నెట్టింట ఫుల్ జోష్‌లోకి వచ్చేశారు. పంచెకట్టు సూపర్‌గా ఉందంటూ ఫొటోను వైరల్ చేస్తున్నారు.

News March 9, 2025

దారుణం: మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించి..

image

ప్రభుత్వంపై <<15698741>>తిరుగుబాటు<<>> చేస్తున్న సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారులపై భద్రతా బలగాలు ‘రివెంజ్ కిల్లింగ్స్’ మొదలుపెట్టాయి. దొరికినవారిని దొరికినట్లు కాల్చి చంపుతున్నాయి. బనీయాస్ పట్టణంలో మహిళలను నగ్నంగా ఊరేగించి, తర్వాత హతమార్చినట్లు ప్రత్యక్ష సాక్షులు అంతర్జాతీయ మీడియాతో చెప్పారు. ఎక్కడపడితే అక్కడ శవాలు పడి ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా మరణించారు.

News March 9, 2025

TDPలో ఉత్కంఠగా మారిన అభ్యర్థుల ఎంపిక

image

AP: MLA కోటా MLC అభ్యర్థుల ఎంపిక టీడీపీలో ఉత్కంఠగా మారింది. నామినేషన్ల దాఖలుకు రేపటితో గడువు ముగుస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై ఇవాళ స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఐదింటిలో ఒక దాని కోసం నాగబాబు నామినేషన్ వేయగా, మిగతా 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సీఎం చంద్రబాబు సామాజికవర్గాల వారీగా కసరత్తు చేస్తున్నారు. దాదాపు <<15649237>>25 మందికి<<>> పైగా MLC సీటు కోసం ప్రయత్నిస్తున్నారు.

News March 9, 2025

IND-NZమ్యాచుకు రూ.5వేల కోట్ల బెట్టింగ్?

image

నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే CT ఫైనల్ మ్యాచ్‌పై రూ.5వేల కోట్ల బెట్టింగ్ జరగనున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఈ బెట్టింగ్ ముఠాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు తెలిపాయి. దుబాయి వేదికగా బెట్టింగ్ నడుస్తుండగా మనీశ్ సాహాని అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. IND-AUS సెమీస్ మ్యాచుకు బెట్టింగ్‌‌కు పాల్పడిన పలువురు బుకీలను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు.

News March 9, 2025

చిరును సరికొత్తగా చూపించనున్న అనిల్ రావిపూడి?

image

‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో తన తర్వాతి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీలో చిరును సరికొత్తగా చూపించనున్నట్లు సమాచారం. టాలీవుడ్ వర్గాల ప్రకారం.. గ్యాంగ్ లీడర్ తరహాలో మేకోవర్ చేయడమే కాకుండా డైలాగ్ డెలివరీ కూడా యాసతో పెట్టాలని అనిల్ భావిస్తున్నారు. చిరుకు రొమాంటిక్ ట్రాక్‌ ఉండదని మూవీ టీమ్ చెబుతుండటం ఆసక్తికరం.