News March 9, 2025
CSK ఫ్యాన్స్..‘తలా’ వచ్చేశాడు!

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కి ఆ జట్టు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ‘తలా’ ధోనీ జట్టుతో చేరారని పేర్కొంది. తెల్లటి పంచెకట్టులో ధోనీ వస్తున్న ఫొటోను షేర్ చేసింది. ఇప్పటికే మహీ ప్రాక్టీస్‌కు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ధోనీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్న యెల్లో ఫ్యాన్స్ నెట్టింట ఫుల్ జోష్‌లోకి వచ్చేశారు. పంచెకట్టు సూపర్‌గా ఉందంటూ ఫొటోను వైరల్ చేస్తున్నారు.
Similar News
News March 19, 2025
శుభ ముహూర్తం (19-03-2025)

☛ తిథి: బహుళ పంచమి రా.8.58 వరకు తదుపరి షష్టి ☛ నక్షత్రం: విశాఖ సా.5.44 వరకు తదుపరి అనురాధ☛ శుభ సమయం: లేదు ☛ రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు ☛ యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు ☛ దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు ☛ వర్జ్యం: రా.10.05నుంచి 11.49వరకు ☛ అమృత ఘడియలు: ఉ.7..52 నుంచి 9.39 వరకు
News March 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 19, 2025
యుద్ధం ముగింపుకు అంగీకరించిన పుతిన్ : వైట్‌హౌస్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు పుతిన్ అంగీకరించినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. రష్యా అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈమేరకు యుద్ధానికి స్వస్థి పలకాలని విజ్ఞప్తి చేయగా పుతిన్ అంగీకరించినట్లు శ్వేతసౌధం తెలిపింది. గత కొంతకాలంగా యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.