India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

YS వివేకా హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్‌మన్ <<15674482>>రంగన్న<<>> మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమేనని సీఎం చంద్రబాబు అన్నారు. క్యాబినెట్ భేటీ అనంతరం దీనిపై చర్చించారు. రంగన్న మృతి వెనుక ఉన్న అనుమానాలను డీజీపీ మంత్రులకు వివరించారు. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్తూ వస్తున్నానని సీఎం అన్నారు. పరిటాల రవి హత్యకేసులో సాక్షులు కూడా ఇలానే చనిపోతూ వచ్చారని గుర్తు చేశారు.

సీనియర్ నటి, తన తల్లి వైజయంతీ మాల ఆరోగ్యంగా ఉన్నారని కుమారుడు సుచీంద్ర బాల స్పష్టం చేశారు. ఆమె మృతి చెందారన్న వార్తలను ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని, వాటిని షేర్ చేసే ముందు ధ్రువీకరించుకోవాలని సూచించారు. దేవదాస్, నయా దౌర్, మధుమతి, జువెల్ థీఫ్, సంగమ్ వంటి సూపర్‌హిట్ సినిమాల్లో ఆమె నటించారు. 91ఏళ్ల వయసున్న ఆమె రీసెంటుగా చెన్నైలో ఓ వేడుకలో భరతనాట్యంతో ఆశ్చర్యపరిచారు. అప్పుడామె ఆరోగ్యంగా ఉన్నారు.

బెంగళూరు యూనివర్సిటికీ మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ పేరు పెట్టనున్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. దివంగత నేత పేరును విశ్వవిద్యాలయానికి పెట్టడం దేశంలోనే తొలిసారన్నారు. మాజీ ప్రధాని సంస్కరణల వల్ల జరిగిన అభివృద్ధి భావితరాలకు తెలిసేలా రీసెర్చ్, స్టడీసెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు Dy Cm డీకే శివకుమార్ తెలిపారు. 1991లో సింగ్ తెచ్చిన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాయి.

ఆదివారం IND-NZ మధ్య జరిగే CT ఫైనల్‌కు వర్షం ముప్పులేదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకవేళ అనుకోకుండా వర్షం పడితే ఇరు జట్లు కనీసం 25 ఓవర్లపాటు ఆడితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితం ప్రకటిస్తారు. మ్యాచ్ జరిగే అవకాశం లేకుంటే రిజర్వుడేకు వాయిదా వేస్తారు. అప్పుడూ వరుణుడు కరుణించకపోతే ఇరు జట్లను సంయుక్తంగా విజేతగా ప్రకటిస్తారు. మ్యాచ్ ‘టై’ అయితే ఫలితం తేలే వరకూ సూపర్ ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.

AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ <<15680685>>పరీక్షా పత్రం లీకేజీ<<>> అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విచారణ చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

AP: నరసరావుపేట TDP MLA చదలవాడ అరవింద్ బాబుపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న ఎక్సైజ్ ఆఫీసులో హల్‌చల్ చేసినట్లు ఫిర్యాదు అందగా, ఆయన వ్యవహరించిన తీరు సరికాదని మందలించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని TDP కేంద్ర కార్యాలయం నోటీసులు జారీ చేసింది. YCP హయాంలో నియమించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేసి తనవారికి ఉద్యోగాలివ్వాలని లేఖ రాసినా స్పందించలేదని MLA హల్‌చల్ చేసినట్లు సమాచారం.

బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసే సమయంలో తనకు విశ్రాంతి కావాలని కోరారు. తాను ఇటీవల యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్, దుబాయ్, సౌదీ అరేబియాకు ట్రావెల్ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత రెస్ట్ దొరకలేదన్నారు. తప్పు ఒప్పుకోవాలని తనను ఎవరూ బలవంతం చేయలేదని, స్వయంగా ఒప్పుకున్నట్లు చెప్పారు. పోలీసులు ఫుడ్ ఇవ్వగా ఆమె తిరస్కరించారు.

రిలయన్స్ ఫౌండేషన్ గుజరాత్‌లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ‘వనతారా’ను స్థాపించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని విభిన్నమైన జంతువులను ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే, ఇక్కడున్న సఫారీ వాహనం కూడా ఎంతో స్పెషల్. అన్నిచోట్లా బొలేరో వాహనాలను సఫారీగా వాడితే ఇక్కడ మాత్రం రూ.2 కోట్ల విలువైన డిఫెండర్ కారుతో పాటు రూ.25+ లక్షల Isuzu V-Cross కారును వాడుతున్నారు. అంబానీ ఆ మజాకా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సముద్రంలో నాలుగు పడవలు మునిగి 180 మంది గల్లంతైన ఘటన యెమెన్-డిబౌటీ మధ్య జరిగింది. ఎర్రసముద్రంలో వలసదారులు ప్రయాణిస్తున్న పడవలు మునిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా ఘటన జరిగింది. గతేడాది ఇదే మార్గంలో 558 మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(IOM) తెలిపింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై కాంగ్రెస్, BRS, DMK తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఒక్క సీటు కూడా తగ్గకుండా డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.