News March 7, 2025
రూ.2 కోట్ల కారులో జూ సఫారీ!

రిలయన్స్ ఫౌండేషన్ గుజరాత్‌లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ‘వనతారా’ను స్థాపించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని విభిన్నమైన జంతువులను ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే, ఇక్కడున్న సఫారీ వాహనం కూడా ఎంతో స్పెషల్. అన్నిచోట్లా బొలేరో వాహనాలను సఫారీగా వాడితే ఇక్కడ మాత్రం రూ.2 కోట్ల విలువైన డిఫెండర్ కారుతో పాటు రూ.25+ లక్షల Isuzu V-Cross కారును వాడుతున్నారు. అంబానీ ఆ మజాకా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 21, 2025
సరికొత్త వివాదంలో OLA!

విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓలా వెల్లడించిన వాహన విక్రయాల సంఖ్య, వాహన రిజిస్ట్రేషన్ల సంఖ్యకు సరిపోలడం లేదని కేంద్రం గుర్తించింది. దీనిపై దర్యాప్తు చేయాలని ARAIని ఆదేశించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా FEBలో 25వేల వాహనాలు అమ్మినట్లు OLA పేర్కొనగా వాహన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 8,652గా ఉండటం గమనార్హం.
News March 21, 2025
కార్యకర్తల సమస్యలు తెలుసుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: ప్రతి బుధవారం నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్‌లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కృషి చేయాలని తెలిపారు. అదే రోజు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకోవాలన్నారు. ఇంఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని సీఎం అన్నారు.
News March 21, 2025
మాకూ ఆ పథకాన్ని వర్తింపజేయండి: ఈబీసీలు

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని తమకూ వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఈబీసీ సంక్షేమ సంఘం లేఖ రాసింది. అగ్రవర్ణ పేద యువతను సీఎం విస్మరించడం బాధకరమని లేఖలో పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరింది. కాగా ఈ పథకంతో రాష్ట్రంలో 5 లక్షల మందికి గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.