India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రేఖాచిత్రం’ ఓటీటీలోకి వచ్చేసింది. సోనీ లివ్‌లో ఈ మూవీ తెలుగుతోపాటు మొత్తం ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఆసిఫ్ అలీ లీడ్ రోల్‌లో నటించారు. గత జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది మలయాళంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

AP: రాష్ట్రంలోని వర్సిటీల్లో 3,282 ఉద్యోగాలను ఈ ఏడాదే భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇవ్వగానే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. విశ్వవిద్యాలయాల్లో 4,330 శాంక్షన్డ్ పోస్టులంటే గత ప్రభుత్వం 1,048 ఉద్యోగాలనే భర్తీ చేసిందని తెలిపారు. వర్సిటీల బలోపేతానికి రూ.2వేల కోట్లు కేటాయించామని చెప్పారు. న్యాయ వివాదాలను తావులేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని వివరించారు.

అక్కినేని అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో నటిస్తున్నారు. దాని తర్వాత ఆయన పూరీ జగన్నాథ్‌తో ఓ మూవీ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. పూరీ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నా.. హీరోలకు మేకోవర్ ఇవ్వడంలో ఆయన స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలో అఖిల్ కోసం మంచి మాస్ స్టోరీని రెడీ చేయమని నాగార్జున పూరీకి సూచించినట్లు సినీ వర్గాలంటున్నాయి. నాగ్‌తో పూరీ సూపర్, శివమణి సినిమాలు తీసిన సంగతి తెలిసిందే.

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి అక్కడే ఉండి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. రెండు రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రానున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి, మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 10 నుంచి మే 3 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 లేట్ ఫీజుతో మే 26 వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 8, 9 తేదీల్లో పరీక్ష ఉంటుంది. జులై 7న ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550, మిగతా వారికి రూ.750గా నిర్ణయించారు.

AP: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మూడో శనివారం GOVT ఆఫీసులు, ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర దివస్ నిర్వహించాలని సూచించారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో పనిచేయాలన్నారు. చేనేత, జౌళి శాఖలు, MSMEల భాగస్వామ్యంతో పర్యావరణ హితమైన వస్తువుల తయారీని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

TG: ఇసుక లోడింగ్, రవాణాకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా 155242 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని తెలిపారు. సమస్యకు ప్రత్యేకంగా ట్రాకింగ్ నంబర్‌ను కేటాయిస్తామన్నారు. ఈ నంబర్ ఏడాదంతా 24/7 అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కాగా ప్రజలకు డోర్ డెలివరీ ద్వారా ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.

AP: ఇవాళ రాష్ట్రంలోని 84 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం-9, విజయనగరం-13, మన్యం-11, అల్లూరి-9, అనకాపల్లి-1, కాకినాడ-4, తూర్పుగోదావరి-8, పశ్చిమగోదావరి-1, ఏలూరు-8, కృష్ణా-7, గుంటూరు-8, బాపట్ల జిల్లాల్లోని 5 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది.

ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేందుకు ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థనలను నేరుగా యాప్‌లో ఆమోదించదని తెలుస్తోంది. నెలలో 10 రోజులు కచ్చితంగా కార్యాలయానికి రావాల్సిందేనని ఉద్యోగులకు స్పష్టం చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ రాకపోతే వారి సెలవులను కట్ చేస్తారంటున్నాయి. దీనిపై త్వరలో ఇన్ఫోసిస్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

TG: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను గుర్తించేందుకు కేరళకు చెందిన క్యాడవర్ జాగిలాలు లోపలికి వెళ్లనున్నాయి. మానవ అవశేషాలను పసిగట్టడంలో ఇవి దిట్ట. భూగర్భంలో 15 అడుగుల లోతులో ఉన్న మనుషులు, మృతదేహాలను ఇవి సులభంగా గుర్తిస్తాయి. గాలి, భూమి లోపలి నుంచి వచ్చే వాసనను ఇవి ఇట్టే పసిగట్టగలవు. అలాగే నీటి అడుగున ఉన్న మృతదేహాలు, కుళ్లిపోయిన శరీర భాగాలు, అస్థిపంజర అవశేషాలనూ పసిగడతాయి.
Sorry, no posts matched your criteria.