news

News March 6, 2025

SRH ప్లేయర్‌కు గాయం.. రీప్లేస్‌మెంట్ ఎవరంటే?

image

ఇంగ్లండ్ క్రికెటర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఐపీఎల్-2025కి దూరమయ్యారు. గత ఏడాది జరిగిన వేలంలో అతడిని SRH కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడి స్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్ విల్లెమ్ ముల్డర్‌ను రూ.75లక్షలకు తీసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ముల్డర్ 11 టీ20లు, 18 టెస్టులు, 25 వన్డేలు ఆడారు. 60 వికెట్లు తీయడంతో పాటు 970 రన్స్ చేశారు. ఐపీఎల్ 18వ సీజన్ ఈనెల 22న ప్రారంభం కానుంది.

News March 6, 2025

వరుసగా రెండో రోజూ స్టాక్‌మార్కెట్లు అదుర్స్

image

స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండోరోజూ భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 22,544 (+207), సెన్సెక్స్ 74,340 (+609) వద్ద ముగిశాయి. క్రూడాయిల్ ధరలు తగ్గడం, పాజిటివ్ సెంటిమెంటు పెరగడమే ఇందుకు కారణాలు. రియాల్టీ సూచీ తగ్గింది. O&G, మెటల్, ఎనర్జీ, కమోడిటీస్, PSE, ఫార్మా, ఇన్ఫ్రా, హెల్త్‌కేర్, FMCG షేర్లు ఎగిశాయి. ఏషియన్ పెయింట్స్, కోల్ఇండియా, హిందాల్కో, BPCL, NTPC టాప్ గెయినర్స్. TECHM, BEL, ట్రెంట్ టాప్ లూజర్స్.

News March 6, 2025

రాహుల్‌ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడారు: సిద్ధూ

image

భారత క్రికెటర్ KL రాహుల్‌పై మాజీ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. కెప్టెన్ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలని కోరినా సిద్ధంగా ఉండే నిస్వార్థమైన ప్లేయర్ అన్నారు. T20ల్లో ఓపెనర్‌గా, BGTలో పేసర్లను ఎదుర్కొనేందుకు 3వ స్థానంలో, CTలో కీపింగ్‌తో పాటు 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా రాహుల్‌ను స్పేర్ టైర్‌ కంటే దారుణంగా వాడారని మేనేజ్‌మెంట్‌కు సెటైర్ వేశారు.

News March 6, 2025

భయం.. భయం: అంతుచిక్కని వ్యాధితో నెలలో 13 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్, సుక్మా జిల్లాలోని ధనికోర్టాలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు భయపడుతున్నారు. చెస్ట్ పెయిన్, దగ్గుతో ఇక్కడ నెల రోజుల్లోనే 13 మంది చనిపోయారు. వ్యాధేంటో, దాని కారణాలేంటో తెలియక వైద్యాధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. సీజన్ మారడం, ఇప్పపూల కోసం రోజంతా అడవిలో పనిచేసి డీహైడ్రేషన్‌తో చనిపోతున్నారని వారు భావిస్తున్నారు. క్యాంపు వేసి ORS ఇస్తూ అవే లక్షణాలున్న బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

News March 6, 2025

సత్తా చాటుతున్న బీజేపీ.. BRSకు దెబ్బేనా?

image

TG: కాంగ్రెస్, BRSను బీజేపీ భయపెడుతోంది. ప్రధాన ప్రతిపక్షం BRS ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. BSP అభ్యర్థికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ నేరుగా పోటీ చేసింది. అయినా బీజేపీ సంచలన విజయం సాధించింది. అటు కేసీఆర్ జనంలోకి రాకపోవడంతో తామే ప్రతిపక్షం అని క్షేత్రస్థాయిలో కాషాయపార్టీ విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ వల్ల BRSకే పెద్ద ముప్పు అని విశ్లేషకుల అంచనా. మీ కామెంట్?

News March 6, 2025

ఇకపై ‘మనమిత్ర’లో 200 సేవలు: లోకేశ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో ఇకపై ప్రజలకు 200 సేవలు అందుతాయని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మన మిత్ర’ అద్భుత మైలురాయి దాటిందన్నారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్‌కు ఇదో నిదర్శనం అని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.

News March 6, 2025

ఏపీలో ‘ఛావా’ సినిమాపై వివాదం

image

‘ఛావా’ సినిమాను ఏపీలో రిలీజ్ చేయొద్దని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హక్ డిమాండ్ చేశారు. ఈ మూవీలో చరిత్రను వక్రీకరించారని, రిలీజ్‌ను ఆపాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం ఇచ్చారు. ఇందులో ముస్లింలను తప్పుగా చూపారని ఆయన ఆరోపించారు. మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.

News March 6, 2025

‘ప్యారడైజ్’లో నాని లుక్ వెనుక కథ ఇదే!

image

‘ప్యారడైజ్’ టీజర్‌లో నేచురల్ స్టార్ నాని ఊరమాస్ లుక్‌తో పాటు జడలు వేసుకొని కనిపించారు. అందరినీ ఆకర్షించిన ఆ లుక్‌పై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్పందించారు. రెండు జడలకు, తన బాల్యానికి కనెక్షన్ ఉందని చెప్పారు. చిన్నప్పుడు తనను తల్లి అలాగే జడలు వేసి పెంచిందని, ఆ స్ఫూర్తితోనే నాని పాత్రను డిజైన్ చేశానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్యారడైజ్’ మూవీ 2026 మార్చిలో విడుదల కానుంది.

News March 6, 2025

అధికారంలోకి వచ్చేది వైసీపీనే: గోరంట్ల మాధవ్

image

AP: కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పక్కకు పెట్టి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పైనే దృష్టి పెట్టిందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు.

News March 6, 2025

19 ఏళ్లకే 400 భాషల్లో ప్రావీణ్యం!

image

మాతృ భాషతో పాటు మరో రెండు భాషలు రావడమే గొప్ప. కానీ, చెన్నైకి చెందిన 19ఏళ్ల మహ్మద్ అక్రమ్ ఏకంగా 400 భాషలను చదవడం, రాయడం, టైప్ చేయడం నేర్చుకొని ఔరా అనిపించారు. ఈయన 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. తనకు 4 ఏళ్లు ఉన్నప్పటి నుంచే ఇతర భాషలు నేర్చుకోవడం స్టార్ట్ చేసి 8 ఏళ్లకే బహుభాషా టైపిస్ట్‌గా ప్రపంచ రికార్డు సృష్టించారు. వర్క్‌షాప్స్ ఏర్పాటు చేసి చాలా మంది విద్యార్థులకు తన నైపుణ్యాన్ని పంచుతున్నారు.