India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, HMDA పరిధిని రీజినల్ రింగ్ రోడ్ వరకు విస్తరించడం సహా మరికొన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే పంచాయతీ ఎన్నికల నిర్వహణపైనా సమాలోచనలు చేసే అవకాశం ఉంది.

AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దేందుకు ‘యాక్టివ్ ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిడమర్రు (మంగళగిరి) స్కూల్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనుంది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడిస్తారు. ఏ విద్యార్థికి ఏ క్రీడల్లో ఆసక్తి ఉందో అందులో శిక్షణ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా మార్చడమే లక్ష్యమన్నాయి.

TG: HYD కంచి గచ్చిబౌలిలో అత్యంత విలువైన 400 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దాదాపు రూ.30వేల కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు లేఅవుట్ల అభివృద్ధికి కన్సల్టెంట్ల నుంచి TGIIC ప్రతిపాదనలు కోరింది. ఎల్లుండి ప్రీబిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చింది. వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో 0.003 శాతం సదరు సంస్థకు వాటాగా ఇవ్వనుంది.

మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న IPL సీజన్‌లో BCCI కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ప్లేయర్లు, స్టాఫ్ కుటుంబసభ్యులను డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్లేయర్లు మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లకు జట్టు బస్సులోనే ప్రయాణించాలని పేర్కొంది. అవార్డు ప్రదాన కార్యక్రమంలో స్లీవ్‌లెస్ జెర్సీలను ధరించొద్దని తెలిపింది. రూల్స్ ఉల్లంఘిస్తే తొలుత వార్నింగ్, తర్వాత ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.

AP: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు 5 శాతం వడ్డీతో రూ.లక్ష రుణం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల కోసం వీటిని అందించనుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలకు సీఎంవో ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం ఏటా రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.

CISFలో 1,161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 వరకు ఛాన్స్ ఉంటుంది. టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో పాసైన 18-23 ఏళ్లలోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రూ.21,700-69,100 జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://cisfrectt.cisf.gov.in/

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఏపీలో 27 వేలు, టీజీలో 28 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదు. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్ల ఎదురుగా ఉన్న బాక్సుల్లో ప్రాధాన్య క్రమంలో అంకెలుగా ఓటు వేయాలని పదే పదే చెప్పినా ఓటర్లు పొరబాట్లు చేశారు. నిబంధనలు పాటించకపోతే ఓటు మురిగిపోతుందని ప్రచారం చేసినా పట్టభద్రులు అదే తప్పు చేశారు. దీనిపై మీ కామెంట్.

జీతాల పెంపుపై ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కీలక ప్రకటన చేసింది. పెంపులో ఆలస్యం చేయబోమని, అర్హత కలిగిన ఉద్యోగులకు ఆగస్టులో మెరిట్ పెంపు అమలు చేస్తామని తెలిపింది. అసోసియేట్లకు ఈ నెల మధ్యలో బోనస్ కూడా చెల్లిస్తామని వెల్లడించింది. వేతనాలు, మెరిట్ పెంపు, బోనస్‌లకు సంబంధించి తమ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదంది. ఉద్యోగుల కష్టం, అంకితభావాన్ని బోనస్, జీతాల పెంపు ద్వారా గుర్తిస్తామని సంస్థ పేర్కొంది.

AP: E-KYC నిర్వహణ కారణంగా రేషన్ కార్డులకు సంబంధించిన సేవలు నిలిపేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో వెల్లడించారు. కొత్త బియ్యం కార్డులు, కార్డుల విభజన సేవలు ప్రారంభించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. ఏదైనా కారణాలతో కార్డు నుంచి సభ్యుల పేర్లు తొలగించాలనుకుంటే జేసీకి అర్జీ పెట్టుకోవచ్చని తెలిపారు. సొంత వాహనం కాకుండా ట్యాక్సీ కలిగిన వారికీ రేషన్ కార్డు పొందేందుకు అర్హత ఉందని చెప్పారు.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో విరాట్ 746 పరుగులు చేశారు. ఈ క్రమంలో శిఖర్ ధవన్ (701) రికార్డును చెరిపేశారు. వీరి తర్వాత గంగూలీ (665), ద్రవిడ్ (627) ఉన్నారు. అలాగే 2000 తర్వాత వన్డేల్లో అత్యధిక సింగిల్స్ తీసిన ప్లేయర్‌గా కోహ్లీ (5,868) నిలిచారు. ఆయన తర్వాత సంగక్కర (5,688) ఉన్నారు.
Sorry, no posts matched your criteria.