news

News February 27, 2025

భయమెరుగని కవయిత్రి

image

తుపాకి కంటే కలంతో ఎక్కువ మందిని కదిలించొచ్చని తన సాహిత్యంతోనే స్వాతంత్ర్యం కోసం పోరాడారు కవయిత్రి మహాదేవి. UPలో 1907లో జన్మించి.. మహిళలు ఇంటికే పరిమితమవ్వాలన్న నిబంధనలను బద్దలు కొట్టారు. తొమ్మిదేళ్లకే పెళ్లియినప్పటికీ చదువు కోసం భర్తను వదిలి పలు డిగ్రీలు పూర్తిచేశారు. విప్లవ పత్రికలతో పాటు మహిళా హక్కుల కోసం పాటుపడ్డారు. స్వాతంత్ర్య పోరాట రచనలతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన భయమే ఎరుగని మహాదేవి.

News February 27, 2025

డిగ్రీ అర్హతతో 650 బ్యాంకు ఉద్యోగాలు

image

IDBI బ్యాంకులో 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లికేషన్లకు మార్చి 12 లాస్ట్ డేట్. అభ్యర్థులు డిగ్రీ పాసై, 20-25 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు SC, ST, PWD అభ్యర్థులకు రూ.250, మిగతా వారికి రూ.1050.
వెబ్‌సైట్: https://www.idbibank.in/

News February 27, 2025

‘కూలీ’లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమాలో స్టార్ నటి పూజా హెగ్డే జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌‌గా, శివ కార్తికేయన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ‘కూలీ’పై అంచనాలు భారీగా పెరిగాయి.

News February 27, 2025

స్కీముల కోసం ఆలయాలను డబ్బు అడిగిన ప్రభుత్వం

image

సుఖ్ అభయ్ స్కీముకు ఆలయాలు నిధులు అందించాలంటూ హిమాచల్ ప్రదేశ్ జిల్లా యూనిట్లు కోరడం వివాదాస్పదంగా మారింది. OPS, ఫ్రీబీస్ సహా అప్పుల పాలవ్వడంతో అక్కడి ఖజానా ఒట్టిపోయింది. నిధుల కొరత వల్ల తమ పరిధిలోని 35 మందిరాల నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆలయాల డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తూ BJP ఆందోళనకు దిగడంతో CM సుఖ్వీందర్ సింగ్‌కు ఏం చేయాలో తోచడం లేదు. మీ కామెంట్?

News February 27, 2025

స్టూడెంట్స్ బుక్స్‌లో ₹3.5కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!

image

పుణే ఎయిర్‌పోర్టులో భారీ హవాలా రాకెట్ బయటపడింది. ముగ్గురు స్టూడెంట్స్ దుబాయ్ వెళ్లేందుకు ట్రావెల్ ఏజెంట్ ఖుష్బూ అగర్వాల్ వద్ద టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫ్లయిట్ ఎక్కే 2hrs ముందు వారికామె 2 బ్యాగుల్లో బుక్స్ పెట్టి దుబాయ్‌లోని తమ బ్రాంచ్‌లో ఇవ్వమన్నారు. విషయం తెలుసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని అక్కడి నుంచి మళ్లీ పుణేకి రప్పించారు. చెక్ చేసి బుక్స్‌లోని $4L (Rs 3.5CR)ను స్వాధీనం చేసుకున్నారు.

News February 27, 2025

ముగిసిన మహాకుంభ్‌.. మోదీ ట్వీట్!

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళా నిన్నటితో ముగిసింది. ఈక్రమంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘మహాకుంభ్ ముగిసింది. ఐక్యతతో కూడిన గొప్ప ఆచారం ముగిసింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ మహాకుంభ్‌లో 1.4 బిలియన్ల మంది విశ్వాసం ఏకమైంది. గత 45 రోజులుగా దేశ నలుమూలల నుంచి కోట్ల మంది తరలిరావడాన్ని నేను చూస్తూనే ఉన్నా’ అని తన మదిలో మెదిలిన కొన్ని <>విషయాలను<<>> పంచుకున్నారు.

News February 27, 2025

భారత్‌కు చెప్పే స్థాయి పాక్‌కు లేదు: క్షితిజ్‌ త్యాగి

image

ఇండియాకు నీతులు చెప్పే స్థాయిలో పాక్ లేదని భారత్ రాయబారి క్షితిజ్ త్యాగి తేల్చిచెప్పారు జమ్మూకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఐరాస మానవహక్కుల మండలిలో పాక్ మంత్రి అజం నజీర్ తరార్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. మైనారిటీలను చిత్రహింసలు పెడుతూ, తరచుగా మానవహక్కుల ఉల్లంఘన చేసే దేశానికి భారత్‌కు చెప్పే స్థాయి లేదన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాక్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే అని నొక్కిచెప్పారు.

News February 27, 2025

ఉద్యోగులకు EPFO వడ్డీరేటు తగ్గింపు షాక్?

image

FY25కి గాను EPFO వడ్డీరేటును తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది. FRI జరిగే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగులో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం 8.25% ఉన్న వడ్డీరేటును 8కి తగ్గిస్తారని అంచనా. స్టాక్‌మార్కెట్లు డౌన్‌ట్రెండులో ఉండటం, బాండ్‌యీల్డులు తగ్గడం మరోవైపు సెటిల్మెంట్లు పెరగడమే ఇందుకు కారణాలు. ట్రస్టీస్ నిర్ణయం 30 కోట్ల చందాదారులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనుంది.

News February 27, 2025

మహాకుంభమేళా ముగిసినా కొనసాగుతున్న రద్దీ

image

మహాకుంభమేళా ముగిసినా ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివెళ్లారు. దీంతో సంగమం ప్రాంతంలోని పలు సెక్టార్లలో భక్తులు కనిపిస్తున్నారు. నిన్నటితో కుంభమేళా ముగియగా, 45 రోజుల్లో 66.21 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

News February 27, 2025

తగ్గిన బంగారం ధరలు

image

కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.80,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.87,380కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,06,000గా ఉంది.