India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రొమాంటిక్ సినిమాలంటే బాలకృష్ణ చేసిన కొన్ని సినిమాలు గుర్తొస్తాయని అన్‌స్టాపబుల్ షోలో CM చంద్రబాబు తెలిపారు. అయితే ప్రేక్షకులు బాలకృష్ణ దగ్గరి నుంచి కొన్ని, చంద్రబాబు దగ్గరి నుంచి కొన్ని కోరుకుంటారని చెప్పారు. ‘మా చెల్లితో కలిసి చూసిన ఒక రొమాంటిక్ సినిమా పేరు చెప్పండి బావ?’ అని బాలయ్య అడగ్గా ‘నువ్వు మరీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే సమస్య వస్తుంది’ అని CBN అనడంతో అంతా ఘొల్లున నవ్వారు.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్రస్తుతానికి వెనుకబడినా మళ్లీ పుంజుకుంటుందని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం బౌలర్లు శ్రమించి న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయాలి. అక్కడక్కడా మేం తడబడ్డాం. కానీ ఈ బృందం పోరాటాన్ని ఆపదు. ప్రతి అవకాశాన్నీ ఒడిసిపట్టి తిరిగి పుంజుకుంటుంది’ అని పేర్కొన్నారు.
ఎక్కువగా వర్కౌట్లు చేసేవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అతిగా వ్యాయామం చేస్తే సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందంటున్నారు. ‘ఒకవేళ స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉన్నా అవి యాక్టివ్‌గా ఉండవు. వర్కౌట్ల సమయంలో టైట్ దుస్తులు ధరించడం వల్ల వేడి ఎక్కువై ఇన్‌ఫెర్టిలిటీ సమస్య పెరిగింది’ అని పేర్కొంటున్నారు. వదులు దుస్తులతో వర్కౌట్లు చేస్తే శుక్ర కణాల నాణ్యత పెరిగినట్లు తెలిపారు.
USలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేసి గత ఏడాది కాలంలో 94,415 మంది భారతీయులు పట్టుబడ్డారు. వీరిలో సగానికి పైగా గుజరాతీలు ఉన్నారు. ఇలా ప్రతి గంటకు 10 మంది భారతీయులు పట్టుబడుతున్నారు. మెక్సికో మీదుగా ‘డాంకీ రూట్’పై అమెరికా నిఘాతో ఇలాంటివారు ఇతర మార్గాలు వెతుకుతున్నారు. గుజరాతీలు కెనడా విజిటర్స్ వీసాతో ట్యాక్సీల్లో USలో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
AP: నంద్యాలలో అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ పేరుతో రాత్రంతా తిప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. ‘మనం చేయని తప్పుకు శిక్ష అనుభవించడమే కాకుండా అరెస్ట్ చేసిన పద్ధతితో నా గుండె తరుక్కుపోయింది. వెనకాల నుంచి ‘బాధ్యత’ గుర్తొస్తోంది. నేను నిరుత్సాహపడటం సరికాదు. ఎక్కడిక్కడ అన్నింటిని ఎదుర్కొన్నాను. ఆశయం కోసం పనిచేయడమే శాశ్వతమని, ముందుకెళ్లాలని భావించాను’ అని అన్‌స్టాపబుల్ షోలో ఎమోషనల్ అయ్యారు.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత జట్టు ప్రదర్శన, రోహిత్ కెప్టెన్సీ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ ఫీల్డింగ్ ఏర్పాటు సరిగా చేయలేదని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ ఉండాలని పేర్కొన్నారు. NZ బ్యాటింగ్ చూస్తుంటే రోహిత్ కెప్టెన్సీ వైఫల్యం కనిపిస్తోందన్నారు. వెంటవెంటనే వికెట్లు తీసేలా వ్యూహం రచిస్తే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయని చెప్పారు.
AP: తానెప్పుడూ రాజకీయాల్లో కక్షసాధింపునకు పాల్పడలేదని CM చంద్రబాబు అన్నారు. ‘తొలిసారి నేను రూలింగ్‌లో ఉన్నప్పుడు YSR ప్రతిపక్షంలో ఉన్నారు. అసెంబ్లీలో ఆయన రెచ్చిపోయినా నేను సంయమనం పాటించేవాడిని. ఆ తర్వాత ఆయన సీఎం అయినప్పుడు దూకుడుగా వ్యవహరించేవాడు. అయినా నేను నిలదొక్కుకొని గట్టిగా వార్నింగ్ ఇచ్చా. దీంతో ఆయన తగ్గి నాకు క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి’ అని అన్‌స్టాపబుల్‌లో తెలిపారు.
చాలామంది రెడ్ యాపిల్‌నే తింటుంటారు. కానీ గ్రీన్ యాపిల్ తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఇందులో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరచి హైబీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. మలబద్దకం, అసిడిటీ, అజీర్ణం తగ్గుతాయి.
TG: పత్తి రైతులకు అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను ప్రారంభించింది. 8897281111 నంబరు ద్వారా కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలను రైతులు ఇంటి వద్ద ఉండే తెలుసుకోవచ్చని మంత్రి తుమ్మల తెలిపారు. అంతేకాకుండా రైతులు ఎలాంటి ఫిర్యాదు చేసినా మార్కెటింగ్ శాఖ సత్వరమే చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
తాము ఎటువంటి మతమార్పిళ్లకు పాల్పడలేదని భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తండ్రి ఇవాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ముంబైలోని ఖర్ జింఖానా సౌకర్యాలను ప్రేయర్ కోసం వాడుకున్న మాట నిజమేనని పేర్కొన్నారు. ‘జింఖానా నిబంధనలకి లోబడే మా మీటింగ్స్ పెట్టుకున్నాం. ఆ విషయాన్ని మీడియా తప్పుగా చూపించింది. మేం చట్టాన్ని గౌరవించే నిజాయితీపరులం. ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా మా విశ్వాసాల్ని మేం అనుసరిస్తున్నాం’ అని వివరించారు.
Sorry, no posts matched your criteria.