News March 1, 2025
ఇవాళ టీవీ, ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’

అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇవాళ టీవీ, ఓటీటీలోకి రానుంది. సా.6గంటలకు జీతెలుగు ఛానల్‌లో, జీ5 యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన కొద్దిరోజులకు టీవీలో ప్రసారం చేస్తారు. కానీ ఈ మూవీని ఒకేసారి TV, OTTలోకి వదులుతుండటం గమనార్హం. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
Similar News
News March 27, 2025
2 రోజులు సెలవులు

TG: రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న (సోమవారం) ఈద్ ఉల్ ఫితర్‌తో పాటు ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న (మంగళవారం) కూడా హాలిడే ఇచ్చింది. ఇక మార్చి 28న జుమాతుల్-విదా, షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనారిటీ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో మార్చి 31న మాత్రమే సెలవు ఇచ్చారు.
News March 27, 2025
రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు: KTR

TG: ఎవ్వరు ఏమనుకున్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని BRS ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేవంత్ తెలంగాణ బూతుపిత అవుతారని ఎద్దేవా చేశారు. తుపాకుల గురించి రేవంత్‌కు తెలిసినంత తమకు తెలియదన్నారు. ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టిన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. ప్రజాపాలన విఫల పాలన అని ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. అప్పులు, అబద్దాలు, బూతులు, అన్నదాతల ఆత్మహత్యలలో తెలంగాణ రైజింగ్ అని విమర్శలు చేశారు.
News March 27, 2025
KCRను బండకేసి కొట్టారు: సీఎం రేవంత్

BRS నేతలు తెలంగాణ గాంధీగా పిలుచుకునే KCRను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టారని సీఎం రేవంత్ అసెంబ్లీలో అన్నారు. ‘నాకు ఓడిపోవడం కొత్త కాదు. కామారెడ్డిలో నేను పోతూ పోతూ.. నిన్ను కూడా తీసుకెళ్తానని చెప్పా. అనుకున్నట్టుగానే అక్కడి ప్రజలు సామాన్యుడిని గెలిపించారు. ప్రజలు తిరస్కరించినా BRS నేతలు ఎందుకు బుకాయిస్తున్నారు? KCR వందేళ్లు ఆరోగ్యంగా ఉండి ప్రతిపక్ష నేత బాధ్యత నిర్వర్తించాలి’ అని ఆకాంక్షించారు.