news

News October 25, 2024

జగన్ బెయిల్ రద్దు చేసే కుట్ర: వైవీ సుబ్బారెడ్డి

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసే కుట్ర జరుగుతోందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేసి ఆయనపై కేసులు పెట్టాయని విమర్శించారు. ‘ఆస్తుల్లో వాటా ఉంటే మరి షర్మిలపై ఈడీ కేసులు ఎందుకు పెట్టలేదు? చెల్లిపై ప్రేమ ఉంది కాబట్టే ఆమెతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. షర్మిల ఆస్తి కోసం పోరాడుతున్నారా? జగన్ బెయిల్ రద్దు కోసం పోరాడుతున్నారా?’ అని ఆయన ప్రశ్నించారు.

News October 25, 2024

గంగవ్వపై కేసు.. ఫైన్‌తో సరిపెట్టిన అధికారులు

image

పంజరంలో చిలుకను బంధించారని బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, మై విలేజ్ షో బృందంపై ఓ వ్యక్తి ఫిర్యాదుతో అటవీ శాఖ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో మై విలేజ్ షో బృందం రూ.25 వేల జరిమానా కట్టినట్లు డీఎఫ్ఓ తెలిపారు. దీంతో కేసును ముగించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ చట్టం గురించి తమకు తెలియదని ‘మై విలేజ్ షో’ సభ్యుడు అనిల్ చెప్పారు. చిలుక జోస్యం వీడియోను తొలగించినట్లు పేర్కొన్నారు.

News October 25, 2024

‘హైడ్రా’కు విస్తృత అధికారాలు చట్టవిరుద్ధం.. హైకోర్టులో పిల్

image

TG: ‘హైడ్రా’కు విస్తృత అధికారాలు కట్టబెట్టడం చట్టవిరుద్ధమని మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. హైడ్రా ఆర్డినెన్స్ సస్పెన్షన్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

News October 25, 2024

టీమ్ ఇండియాకు సరికొత్త ‘వాల్’ కావాలి

image

టీమ్ ఇండియాలో టాలెంటెడ్ ఆటగాళ్లకు కొదువ లేకపోయినా టెస్టుల్లో నిలదొక్కుకొని ఆడే ప్లేయర్ కొరత కొంత కాలంగా వేధిస్తోంది. ‘ది వాల్’ ద్రవిడ్ తర్వాత ఆయన స్థానాన్ని కొంత మేర పుజారా భర్తీ చేశారు. అయితే ఆయన ఫామ్ లేమితో జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు ఆ ప్లేస్‌లో కొరత ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా జట్టు యాజమాన్యం ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్‌ను అన్వేషిస్తుందా లేదా వేచి చూడాలి.

News October 25, 2024

BREAKING: పోలీసు శాఖ కీలక నిర్ణయం

image

TG: రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల విధానంపై ఇటీవల ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు ఐదేళ్లు ఒకే చోట పోస్టింగ్, ఒకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం తీసుకురావాలని కానిస్టేబుళ్ల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

News October 25, 2024

ముద్ర రుణాల పరిమితి పెంపు

image

ముద్ర రుణాల పరిమితిని కేంద్రం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని చెప్పింది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు 3 రకాలుగా రూ.50వేలు, రూ.50వేలు నుంచి రూ.5లక్షలు, రూ.5-10లక్షలు లోన్స్ అందించింది. తాజాగా రూ.10-20 లక్షల రుణాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15-12.80 వడ్డీతో పొందొచ్చు.

News October 25, 2024

పిల్లలతో ఇలాంటి నీరు తాగిస్తున్నారా.. BE CAREFUL

image

ఫ్లోరైడ్ నీటితో కాళ్లు, చేతులు వంకర్లు పోవడం, వికలాంగులు అవ్వడం తెలిసిందే. పిల్లల్లో తక్కువ IQ లెవల్స్‌కు దీనికీ సంబంధముందని HHS NTP రిపోర్టు తాజాగా పేర్కొంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో బ్రెయిన్ బ్లడ్ బారియర్ సామర్థ్యం తక్కువ. ఫ్లోరైడ్ దీనిని దాటేసి మెదడులో మెమరీ, లెర్నింగ్‌కు సంబంధించిన ప్రాంతంలో పేరుకుపోతుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు దారితీసి బ్రెయిన్ సెల్స్‌ను చంపుతుందని తెలిపింది.

News October 25, 2024

సెహ్వాగ్‌తో నాకు గొడవ.. నేటికీ మాట్లాడుకోం: మ్యాక్స్‌వెల్

image

తనకు సెహ్వాగ్‌తో గొడవైందని ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్ తన తాజా పుస్తకం ‘ది షో మ్యాన్‌’లో తెలిపారు. ‘IPL-2017లో నన్ను పంజాబ్ కెప్టెన్‌గా చేశారు. మెంటార్‌గా ఉన్న సెహ్వాగ్ అన్నింట్లో తనే తుది నిర్ణయం తీసుకునేవారు. కానీ ఆ సీజన్లో టీమ్ విఫలమయ్యాక తప్పు నామీద వేశారు. మీరు నా అభిమానాన్ని కోల్పోయారని మెసేజ్ పెడితే, నీలాంటి అభిమాని అక్కర్లేదన్నారు. అప్పటి నుంచీ మా మధ్య మాటల్లేవు’ అని వెల్లడించారు.

News October 25, 2024

US Elections: ఆ ఏడు స్వింగ్ స్టేట్స్ కీలకం

image

US అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో 7 Swing States ఫ‌లితాల్ని డిసైడ్ చేయనున్నాయి. మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్‌సిన్‌, ఆరిజోనా, జార్జియా, నెవాడా, నార్త్ క‌రోలీనా స్టేట్స్ డెమోక్రాట్లు, రిప‌బ్లిక‌న్ల‌కు కీల‌కం. 538 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌లో 93 ఇక్క‌డే ఉన్నాయి. మిగిలిన చోట్ల క‌మ‌ల‌కు 226, ట్రంప్‌న‌కు 219 ద‌క్కుతాయ‌ని అంచ‌నా. Swing Statesలోని వారు ఎవరికి మద్దతివ్వాలన్నది డిసైడ్ కాక‌పోవ‌డ‌ం టెన్ష‌న్ పెడుతోంది.

News October 25, 2024

ముగిసిన రాష్ట్ర మంత్రుల దక్షిణ కొరియా పర్యటన

image

TG: రాష్ట్ర మంత్రుల బృందం దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అధికారులు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. సియోల్‌తో పాటు ఇంచియాన్ నగరంలో నదుల ప్రక్షాళన, మురుగునీటి శుద్ధీకరణపై అధికారులతో కలిసి మంత్రులు అధ్యయనం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం సీఎం ఆదేశాలతో తాము ఆ దేశంలో పర్యటించినట్లు పొంగులేటి తెలిపారు.

error: Content is protected !!