news

News October 24, 2024

రూ.50 వేల కోట్లతో పనులు: చంద్రబాబు

image

AP: రాబోయే రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 47 పనులు కొనసాగుతున్నాయి. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో కొన్నిటికి భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్యలు ఉన్నాయి. బెంగళూరు-కడప, విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు సంబంధించి పర్యావరణ అనుమతులు సాధించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News October 24, 2024

తొలి వన్డేలో భారత్ 227 పరుగులకు ఆలౌట్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత మహిళల జట్టు 227 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా కెప్టెన్ మంధాన(5) విఫలమయ్యారు. హసబ్నిస్(42), దీప్తి శర్మ(41), యస్తిక(37), షఫాలీ(33) ఫర్వాలేదనిపించడంతో మోస్తరు స్కోరు చేసింది. న్యూజిలాండ్ టార్గెట్ 228.

News October 24, 2024

INDvsNZ: తొలిరోజు ముగిసిన ఆట

image

భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న 2వ టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ ఒక పరుగుకే రోహిత్ వికెట్ కోల్పోయింది. సౌథీ వేసిన అద్భుతమైన బంతికి ఆయన బౌల్డ్ అయ్యారు. మొత్తంగా 11 ఓవర్లు ఆడిన ఇండియా 16 రన్స్‌ చేసింది. గిల్(10), జైస్వాల్(6) క్రీజులో ఉన్నారు.

News October 24, 2024

హిట్‌మ్యాన్‌కు ఏమైంది? మళ్లీ ఫెయిల్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆయన డకౌటయ్యారు. ఈ సిరీస్‌లో ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ హిట్‌మ్యాన్ క్లీన్ బౌల్డ్‌‌గా వెనుదిరిగారు. గత 4 టెస్టుల రన్స్ అన్నీ కలిపి కూడా 100లోపే ఉండటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆడుతున్న ఈ సిరీస్‌లో రాణించాలని వారు కోరుతున్నారు.

News October 24, 2024

ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన TV షో ఇదే

image

ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన TV షోగా ‘The Lord of the Rings: The Rings of Power’ నిలిచింది. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయ్యింది. దీని మేకింగ్‌కు ₹3,800cr ఖర్చవగా, రైట్స్, ప్రమోషన్స్‌తో కలిపి మొత్తం ఖర్చు ₹8,300crకు చేరింది. ఒక్కో ఎపిసోడ్ తీయడానికి ₹480cr పెట్టారు. కల్కి, RRR, ఆదిపురుష్(₹588cr-₹630cr) బడ్జెట్‌తో పోల్చితే ఈ సిరీస్ బడ్జెట్ 15రెట్లు అధికం.

News October 24, 2024

ఎంత తెలివి: JioHotstar.com డొమైన్‌ను ముందే కొనేశాడు

image

Jio సినిమాస్‌, Hotstar విలీనాన్ని ముందే ఊహించిన ఓ యాప్ డెవ‌లప‌ర్ <>JioHotstar.com<<>> డొమైన్‌ను కొనేసి ఇప్పుడు దాన్ని అమ్మ‌కానికి పెట్టాడు. కేంబ్రిడ్జ్‌లో త‌న చ‌దువుకు అయ్యే ఖ‌ర్చును రిల‌య‌న్స్ భ‌రిస్తే డొమైన్ రైట్స్ ఇచ్చేస్తాన‌ని ష‌ర‌తు పెట్టాడు. జీ సినిమాస్‌-సోనీ విలీన‌ంతో, Hotstarనూ రిల‌య‌న్స్ కొనేస్తుంద‌ని భావించి డొమైన్ కొన్న‌ట్టు తెలిపాడు. ఈ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన రిల‌య‌న్స్ లీగల్ యాక్ష‌న్‌కు ఉపక్రమించినట్లు తెలిసింది.

News October 24, 2024

‘రాజాసాబ్’ మోషన్ పోస్టర్‌.. 24 గంటల్లో 8.3M వ్యూస్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా నుంచి నిన్న మోషన్ పోస్టర్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన 24 గంటల్లోనే దీనికి 8.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రికార్డ్స్ & ప్రభాస్ ఒకే పేజీలో ఉంటారని, యూట్యూబ్‌లో ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.

News October 24, 2024

Stock Market: ఫ్లాట్‌గా ముగిశాయి

image

వ‌రుస న‌ష్టాల‌తో డీలాప‌డిన దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. 80,170 వ‌ద్ద బ‌ల‌మైన రెసిస్టెన్స్‌ను దాట‌లేక‌పోయిన సెన్సెక్స్ చివ‌రికి 16 పాయింట్ల న‌ష్టంతో 80,065 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఉద‌యం అర‌గంట న‌ష్టాల‌ను 24,350 వ‌ద్ద స‌పోర్ట్ తీసుకొని అధిగ‌మించిన నిఫ్టీ చివ‌ర‌కు 36 పాయింట్లు కోల్పోయి 24,399 వ‌ద్ద నిలిచింది. Ultratech 2.66% లాభ‌ప‌డ‌గా, HindUnilvr 5.8% న‌ష్ట‌పోయింది.

News October 24, 2024

ఒక్కో కార్మికుడికి రూ.93,750.. దీపావళి బోనస్ రిలీజ్

image

TG: ఒక్కో కార్మికుడికి దీపావళి బోనస్‌గా సింగరేణి యాజమాన్యం రూ.93,750 ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా యాజమాన్యం బోనస్ అమౌంట్ రూ.358 కోట్లు రిలీజ్ చేసింది. అంతకుముందు లాభాల వాటా రూ.796 కోట్లను కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు అందజేసిన సంగతి తెలిసిందే.

News October 24, 2024

సంచలనం.. 256 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే చేధించారు

image

మహారాష్ట్ర ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనం నమోదైంది. పీబీజీతో జరిగిన మ్యాచులో జెట్ జట్టు భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన PBG 20 ఓవర్లలో 256 పరుగులు చేసింది. ఛేదనలో జెట్ 18.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. జెట్ బ్యాటర్లలో దివ్యాంగ్(49 బంతుల్లో 93*), రోహిత్ పాటిల్(30 బంతుల్లో 80) పరుగులు చేశారు.

error: Content is protected !!