News March 1, 2025
మూడు రోజుల్లో రూ.1200 తగ్గిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే తులం బంగారం ధర రూ.1200 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గడంతో రూ.86,620కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,05,000గా ఉంది.
Similar News
News April 14, 2026
దేశంలో 16 మంది బీజేపీ సీఎంలు.. లిస్ట్ ఇదే

⋆ అస్సాం-హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్‌ప్రదేశ్-పెమా ఖండూ
⋆ ఛత్తీస్‌గఢ్-విష్ణుదేవసాయ్, ఢిల్లీ-రేఖా గుప్తా
⋆ గోవా-ప్రమోద్ సావంత్, గుజరాత్-భూపేంద్ర పటేల్
⋆ హరియాణా-నాయబ్ సింగ్ సైనీ, UP-యోగి ఆదిత్యనాథ్
⋆ MP-మోహన్ యాదవ్, మహారాష్ట్ర-దేవేంద్ర ఫడణవీస్
⋆ మణిపుర్-యుమ్నాం ఖేమ్‌చంద్ సింగ్, ఉత్తరాఖండ్-పుష్కర్ సింగ్ ధామి
⋆ ఒడిశా-మోహన్ చరణ్ మాఝీ, త్రిపుర-మాణిక్ సాహా
⋆ రాజస్థాన్-భజన్‌లాల్ శర్మ, బిహార్-సామ్రాట్ చౌదరి
News April 14, 2026
చమురు భగభగతో భారత్ జీడీపీకి ఎఫెక్ట్: S&P

చమురు ధరల భగభగ నేపథ్యంలో మరో ఏజెన్సీ భారత్ GDP గ్రోత్‌పై తన అంచనాలు ప్రకటించింది. ఈ ఏడాది బ్యారెల్ ధర సగటున 130 డాలర్లుగా కొనసాగితే FY27లో గ్రోత్ 0.8% తగ్గొచ్చని S&P గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. FY27లో భారత్ జీడీపీ గ్రోత్ 7.1% ఉండొచ్చని గత నెల అంచనా వేసింది. ఇటీవల మోర్గాన్ స్టాన్లీ <<19592068>>సంస్థ<<>> కూడా మూడు నెలల పాటు చమురు ధర $150 వద్ద కొనసాగితే గ్రోత్ రేట్ 5.7%కే పరిమితమవుతుందని పేర్కొంది.
News April 14, 2026
రేపు ఇంటర్ ఫలితాలు: మంత్రి లోకేశ్

AP: రేపు (ఏప్రిల్ 15) ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
*Share It


