news

News October 24, 2024

BSNL కనెక్టింగ్ భారత్‌పై నెటిజన్ల చర్చ ఎలా ఉందంటే!

image

BSNL కొత్త లోగోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. లోగోలో భారత్ మ్యాప్‌ను ఉంచడం, కనెక్టింగ్ ఇండియా ట్యాగ్‌లైన్‌ను కనెక్టింగ్ భారత్‌గా మార్చడం బాగుందని కొందరు అంటున్నారు. భారతీయత కనిపిస్తోందని చెప్తున్నారు. మార్చాల్సింది లోగో కాదని, బిజినెస్ స్ట్రక్చర్, అందించాల్సిన సేవలని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకెప్పుడు 4G, 5G అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. DD లోగో మార్చినప్పుడూ ఇలాంటి కామెంట్సే వచ్చాయి.

News October 24, 2024

పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను అప్పటిలోగా పూర్తి చేయాలి: సీఎం

image

AP: పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 2026 మార్చిలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బావర్ కంపెనీ ప్రతినిధులను CM చంద్రబాబు ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఏటా ₹983 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం ₹275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని జల వనరుల శాఖ సమీక్షలో తెలిపారు. ఇక నుంచి అలా జరగరాదని, ఈ ఏడాదికి అవసరమైన మొత్తం నిధులను ఏకకాలంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News October 24, 2024

ఉచిత సిలిండర్.. బుకింగ్స్ ఎప్పుడంటే?

image

AP: ఈనెల 31 నుంచి ఉచిత సిలిండర్ పథకం ప్రారంభం కానుంది. దానికి 3,4 రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఈనెల 31 నుంచి 2025 MAR నెలాఖరులోపు ఒక సిలిండర్ తీసుకోవచ్చు. ఆ తర్వాత 2025 APR 1 నుంచి JULY నెలాఖరు వరకు మొదటిది, AUG 1 నుంచి NOV లాస్ట్ వరకు రెండోది, DEC 1 నుంచి 2026 MAR నెలాఖరు నాటికి మూడో సిలిండర్ ఇస్తారు. డెలివరీ సమయంలో డబ్బులు చెల్లిస్తే 48గంటల్లో ఖాతాల్లో ప్రభుత్వం ఆ సొమ్మును జమ చేస్తుంది.

News October 24, 2024

ఇక నుంచి సత్వరమే భవన నిర్మాణ అనుమతులు: మంత్రి

image

AP: మున్సిపల్ అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను ఇక నుంచి వెంటనే పరిష్కరించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. భవన నిర్మాణాలు, లేఅవుట్‌లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, రెరా అనుమతులకు సంబంధించి పెండింగ్‌ అప్లికేషన్లను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని రకాల డాక్యుమెంట్లు ఉండి, ఫీజు చెల్లిస్తే వెంటనే అనుమతులిస్తామని, 9398733101, 9398733100 నంబర్లకు వాట్సాప్‌లోనూ వివరాలు పంపవచ్చన్నారు.

News October 24, 2024

వరకట్నం వేధింపులతో కూతురు మృతి.. తండ్రి వినూత్న నిరసన

image

నారాయణపేట‌(D)కు చెందిన చన్నప్పగౌడ కూతురు జయలక్ష్మికి కర్ణాటకలోని శంకర్‌పల్లికి చెందిన శంకర్‌రెడ్డితో 3ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. కాగా వరకట్న వేధింపులతో ఆమె ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. చన్నప్ప PSలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆవేదనకు గురైన ఆ తండ్రి ‘నా కూతురు మృతికి కారణమైన భర్త, అత్త, ఆడపడుచు అదృశ్యమయ్యారు. కనిపిస్తే నాకు సమాచారమివ్వండి’ అని జాతీయ రహదారిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

News October 24, 2024

పింఛన్లకు వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ఆరంచెల విధానం ఇదే

image

AP: పింఛను లబ్ధిదారులను గుర్తించేందుకు గత ప్రభుత్వం ఆరంచెల విధానాన్ని ప్రామాణికంగా తీసుకుంది. దీని ప్రకారం దరఖాస్తుదారులకు వ్యవసాయ భూమి 10ఎకరాలకు మించొద్దు. ఇంట్లో ప్రభుత్వ జాబ్, 4 వీలర్ వెహికల్, IT చెల్లింపు, విద్యుత్ మీటర్ రీడింగ్ 6నెలలకు సరాసరిన 300 యూనిట్లకు మించి ఉండకూడదు. పట్టణాల్లో 1000 చ.అడుగుల పైన నివాసం ఉండొద్దు. ఈ విధానాన్ని ఎత్తివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

News October 24, 2024

యాంటీ టెర్రరిస్టు యాక్ట్: హసీనా స్టూడెంట్ వింగ్‌పై బ్యాన్

image

అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ ‘బంగ్లాదేశ్ ఛాత్రా లీగ్’ను యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద అక్కడి తాత్కాలిక ప్రభుత్వం బ్యాన్ చేసింది. హసీనా 15ఏళ్ల నిరంకుశ పాలనలో వీరు లెక్కలేనన్ని నేరాలు చేసినట్టు పేర్కొంది. ఆమెపై ఉద్యమించిన స్టూడెంట్ గ్రూప్ ADSM డిమాండ్ మేరకే ఛాత్రా లీగ్‌ను బ్యాన్ చేయడం గమనార్హం. హసీనాకు మద్దతుగా మరో ఉద్యమం నిర్మిస్తారనే బ్యాన్ చేసినట్టు ఛాత్రా లీగ్ సపోర్టర్స్ ఆరోపిస్తున్నారు.

News October 24, 2024

డిసెంబర్ 15న ఆత్మార్పణ దినం

image

AP: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గౌరవార్థం డిసెంబర్ 15ను ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, NOV 1న రాష్ట్ర అవతరణ, జూన్ 2న రాష్ట్ర విభజన తేదీల్లో దేనిని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై చర్చించింది. దీనిపై మంత్రుల సూచనలను CM కోరారు. జూన్ 2ను నవనిర్మాణ దినంగా నిర్వహించనున్నారు.

News October 24, 2024

భర్తను అలా పిలవడం క్రూరత్వమే: హైకోర్టు

image

భర్తను భార్య హిజ్రా అని పిలవడం మానసిక హింసకు గురి చేయడమే అని పంజాబ్, హరియాణా హైకోర్టు వ్యాఖ్యానించింది. కింది కోర్టు ఇచ్చిన విడాకులు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తన భార్య పోర్న్ సైట్లకు బానిసయిందని, తనను శారీరకంగా బలహీనంగా ఉన్నానంటూ అవమానించేదని భర్త వాదించారు. కేసులో భార్య ప్రతివాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం కింది కోర్టు ఉత్తర్వుల్ని సమర్థించింది.

News October 24, 2024

GAME CHANGER: బంగ్లా PM ఇప్పటికీ హసీనాయేనా!

image

బంగ్లాలో మరో పొలిటికల్ గేమ్‌కు రంగం సిద్ధమవుతోంది! భారత్‌కు బయల్దేరేముందు జాతినుద్దేశించి మాట్లాడాలనుకున్న షేక్ హసీనాకు సైన్యం టైమివ్వలేదు. ఇంట్లో కీలక డాక్యుమెంట్లు, కొన్ని వస్తువులు సర్దుకొని ఫ్లైటెక్కే హడావిడిలో ఆమె రిజైన్ చేశారో లేదో తెలియడం లేదు. తాజాగా ఆ దేశ ప్రెసిడెంట్ షాబుద్దీన్ ఆమె రిజైన్ చేశారనడానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదనడం వివాదాస్పదమైంది. అంటే టెక్నికల్‌గా హసీనాయే PM అన్నమాట!

error: Content is protected !!